పాకిస్తాన్‌లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్‌లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో భారత ఉపఖండంలోని వివిధ సంస్కృతులు, వివిధ మతాల మధ్య లోతైన సంబంధాలను ఇది తెలియజేస్తోంది. భారత దేశ ఆధ్యాత్మికత సరిహద్దులను దాటి.. జ్ఞానాన్ని పంచిందని మరోసారి వెల్లడైంది. సనాతన ధర్మానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా… ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాలను సనాతన ధర్మం వ్యాప్తి చేస్తూనే ఉంది.
కొన్ని రోజుల కిందటే సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి దిశలో వున్న అల్ రఫా ప్రాంతంలో 8000 ఏళ్ల నాటి ఆలయ అవశేషాలు బయటపడ్డాయని పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పురావస్తు శాఖలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఈ ఆలయ అవశేషాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో పురాతన నాగరికతలు ఎలా వుండేదో తెలిసి వచ్చింది. అత్యంత మన్నికైన రాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, దీనిని నిర్మించిన సృష్టికర్తల నిర్మాణ నైపుణ్యం అమోఘమని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.