భరత ఖండంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం నలంద

    0
    SHARE

    మన భరత ఖండంలో నలంద యూనివర్శిటీ అత్యంత పురాతనమైంది. అత్యంత చారిత్రకమైంది కూడా. బౌద్ధం, గణితం, వైద్యం, రాజకీయం, ఖగోళం, యుద్ధ విద్యలను బోధించడంలో అత్యంత ప్రసిద్ధి చెందింది. 7వ శతాబ్దంలో నలందలో ఆచార్య ఆర్యభట్ట నేతృత్వంలో గరిష్ఠంగా 10 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది ఉపాధ్యాయులు ఉండేవారు. నేటి బిహార్‌ నాటి ప్రాచీన పాటలీపుత్ర ప్రాంతంలో మొఘల్‌ ముష్కర రాజులచే ధ్వంసం చేయబడిన ‘‘నలంద విశ్వ విద్యాలయం నూతన భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఈ నలంద విశ్వ విద్యాలయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

    ఐదో శతాబ్దంలో స్థాపించబడిన నలంద విశ్వవిద్యాలయం, ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించింది. 12 శతాబ్దంలో దీనిని భక్తియార్ ఖిల్జీ అనే మోఘల్‌ రాజు పూర్తిగా ధ్వంసం చేసి, తగలబెట్టే వరకు సుమారు 800 సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగి ప్రపంచానికి జ్ఞాన జ్యోతులను ప్రసాదించింది. ఈ విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని 2007లో ఫిలిఫ్పీన్స్‌లో జరిగిన ఈస్ట్‌ ఏషియా సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ కాకుండా చైనా భూటాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి 17 దేశాలు దీనిలో భాగం పంచుకోవడానికి ముందుకు వచ్చాయి. దీని ప్రకారం అప్పటి యూపీఏ సర్కార్‌ చట్టం చేసి 2014 నుంచి తాత్కాలిక భవనాల్లో 14 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ముష్కరులు ధ్వంసం చేసిన భవనాల నమూనాల ఆధారంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. దీనిలో అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌, తరగతుల భవనాలు, ఆడిటోరియం, గెస్ట్‌హౌజ్‌ వంటి అన్ని సదుపాయాలున్నాయి.

    ఒకప్పుడు బంజరుగా వున్న ఈ క్యాంపస్‌లో ఇప్పుడు 40 హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద మరియు చిన్న చిన్న నీటి వనరులున్నాయి. వర్షపు నీటిని సేకరించే పద్ధతిలో జలాశయాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఉపయోగించే అవసరం లేదు. అక్కడ వుండే జలాశయానికి కమల్‌ సాగర్‌ అని పేరు. ఈ జలాశయాన్ని అంతా వర్షపు నీటిని సేకరించే పద్ధతిలోనే నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించారు కాబట్టి భూగర్భ జలాలను ఉపయోగించే అవసరం లేదు. ఒక్క ఈ కమల్‌ సాగర్‌లోనే నెలలకి సరిపోయే నీరు వుంది. అలాగే భవనంల చాలా శాతం సోలార్‌ విద్యుత్తునే వినియోగిస్తున్నారు.

    నలందను ఎలా నాశనం చేశారంటే….

    తుర్కిష్‌ సైన్యాధ్యక్షుడు భక్తియార్‌ ఖిల్జీ చేతుల మీదుగా 1193లో నలంద విశ్వవిద్యాలయం అత్యంత క్రూరంగా సర్వనాశనం చేశారు. ఒకసారి ఖిల్జీకి తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. తన ఆస్థాన వైద్యుల చేత కూడా నయం కాలేదు. అయితే.. ఆస్థాన సలహాదారు నలందలో వుండే రాహుల్‌ శ్రీభద్ర అనే ఉపాధ్యాయుడున్నాడు. అతనే నలంద విశ్వవిద్యాలయానికి ప్రధాన ఆచార్యులు. అతను అనుకుంటే మీ జబ్బు క్షణంలో నయం చేస్తారు. తప్పక సాయం చేస్తారు’’ అని చెప్పాడు. అందుకు ఖిల్జీ ససేమిరా ఒప్పుకోలేదు. ఇతర మతాచారాలు పాటించేవారితో చచ్చినా వైద్యం చేయించుకోను అంటూ మొండికేశాడు. రోజులు గడిచిపోతున్నాయి. కానీ ఖిల్జీకి మాత్రం ఆ వింత వ్యాధి నయ కాలేదు. భరించరాని నొప్పితో ఇబ్బందులు పడుతుఆన్నడు. చివరికి చేసేదేమీ లేక అహం చంపుకొని ఒప్పేసుకున్నాడు.

    వెంటనే ఆస్థాన విద్వాంసులు రాహుల్‌ శ్రీభద్రకి కబురు పంపారు. అయితే.. రాగానే ఖిల్జీ ఓ నిబంధన విధించాడు. ‘‘నీ మత విశ్వాసం కాకుండా మందులతోనే నయం చేయాలి. అలా కాని పక్షంలో నీ తల తీసేస్తాను’’ అంటూ హుకూం జారీ చేశాడు. అప్పుడు శ్రీభద్ర ‘‘మీ ఇస్లాంలో నయం చేసే ప్రార్థనలు వుంటే చేసుకో’’ అని చెప్పేశాడు. ఇప్పటికే చాలా సార్లు చేశాం. మళ్లీ ఎందుకు? అంటూ ఖిల్జీ ఎదురు ప్రశ్న వేశాడు. కానీ.. చివరికి ప్రార్థనలు చేశాడు. ఆశ్చర్యమేమిటంటే ఖిల్జీకి నయం అయిపోయింది. ఖిల్జీ పట్టరాని ఆనందంతో ఎలా సాధ్యమని అడిగాడు. మా వైద్యులు కూడా మందులు వేశారు. నేను ప్రార్థనలు చేశాను కానీ.. అప్పుడు ఎందుకు నయం కాలేదు? ఇప్పుడు ఎలా? అంటూ ప్రశ్నించాడు.

    అప్పుడు నలంద ప్రధానాచార్యులు  శ్రీభద్ర ఇలా చెప్పారు. ‘‘ చేసే పనిలో శ్రద్ధ, నమ్మకం వుండాలి. నమ్మకం అనేది మనస్సులో వుండాలి. వైద్యుడు వైద్యం కోసం వచ్చే వారిలో నమ్మకం నింపాలి. భయం పోగొట్టాలి. ఆ తర్వాత వైద్యం చేయాలి. నా మీద నీకు పూర్తి నమ్మకం ఏర్పడిరది. అందువల్లే జబ్బు నయం అయ్యింది’’ అని చెప్పాడు. అలా ఖిల్జీ, శ్రీభద్ర మధ్య కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఖిల్జీ ఇలా ప్రేమను నటిస్తూనే చాలా విషయాలు తెలుసుకున్నాడు.

    నలందలో అన్ని విద్యలు, ఆత్మరక్షణ విద్యలు, కళలు, సాహిత్యం, జ్యోతిషం, ఖగోళ, తాంత్రిక, గ్రహాంతర వాసులతో ఎలా కనెక్ట్‌ కావడం… కొన్ని వేల కనీవినీ ఎరుగని విద్యలకు సంబంధించిన సమాచారం వుందని తెలుసుకున్నాడు. ఇవి చదివి సాధన చేసేవారున్నారు అని కూడా వేగుల ద్వారా తెలుసుకుకున్నాడు. అప్పుడే నలందను విధ్వంసం చేయాలని కుటిల పన్నాగాలు పన్నాడు. మహా పాండిత్యం వున్న వీరు.. ఎప్పటికైనా ప్రమాదం అని శ్రీభద్రను సాగనంపి, తాను కోలుకున్న తర్వాత మిగితా అన్ని పనులూ పక్కనబెట్టి, సైన్యాన్ని వెంటబెట్టుకొని నేరుగా నలందని నాశనం చేశాడు. 1193లో నలందను నాశనం చేశాడు ఖిల్జీ. అక్కడ విద్య నేర్చుకుంటున్న 10 వేల మంది విద్యార్థులను, ఆచార్యులను హాహాకారాలు చేస్తుండగా సజీవ దహనం చేసి, విశ్వవిద్యాలయాన్ని కాల్చి బూడిద చేశాడు. లైబ్రరీలో వున్న సుమారు 1 కోటి 10 లక్షల తాళపత్ర గ్రంధాలను తగులబెట్టినప్పుడు అవి కాలి, బూడిద కావడానికి 6 నెలల సమయం పట్టింది. ఆ పొగ సుమారు 150 కిలోమీటర్ల మేర కనిపించేదట.

    తప్పుడు చరిత్ర రాస్తున్న కమ్యూనిస్టులు….

    అయితే.. ఖిల్జీయే నలందను సర్వ నాశనం చేశాడని చరిత్ర వుంటే.. వామపక్ష చరిత్రకారులు ఎప్పటిలాగానే తమ వక్ర బుద్ధిని చూపించారు. తమ ఎరుపు రంగు కలాలలతో తప్పుడు చరిత్రను వ్యాప్తి చేశారు. అసలు నలందను భక్తియార్‌ ఖిల్జీ కూలగొట్టలేదు. అక్కడున్న బ్రాహ్మణులు హిందూ మతానికి బౌద్ధ మతానికి వున్న అంతర్గత కలహాల కారణంగా ఆ విశ్వ విద్యాలయాన్ని తగలబెట్టారని డా. రుచిక శర్మ అనే చరిత్రకారిణి చెప్పుకొచ్చింది. అసలు ఖిల్జీయే కూల్చాడని, ప్రాథమిక ఆధారాలు చూపండి అంటూ ప్రశ్నించింది. దీనిని బట్టి చూస్తే వాస్తవాలన కూడా అవాస్తవాలుగా మార్చి అల్పసంఖ్యాక ప్రజలను సంతోషపెట్టే పనిలో వామపక్షీయులు వుండిపోయారని అర్థమైపోతుంది.

    అయితే.. పర్షియన్‌ చరిత్ర పుస్తకం ‘‘తబకత్‌ ఎ నసిరి’’లో బ్రాహ్మణులను ఎలా ఊచకోత కోశారో, 200 మంది గుర్రాలతో భక్తియార్‌ మొత్తం నలందను ఎలా ధ్వంసం చేశాడో, ఎలా పుస్తకాలను తగలబెట్టాడో తెలుస్తుంది. నలందను విధ్వంసం చేసిన ఖిల్జీ పేరు మీదనే భక్తియార్‌ పూర్‌ రైల్వే స్టేషన్‌ వచ్చింది.

    ఖిల్జీ నలందపై దాడి చేసిన సమయంలో అది పాల రాజవంశం/ సేన రాజవంశంచే పాలించబడిరది. నలంద మరియు పరిసర ప్రాంతాలను ఎన్నడూ బ్రాహ్మణులు పాలించలేదు. ఆ నాలుగు వందల సంవత్సరాల కాల ఖండంలో బౌద్ధాన్ని అనుసరించే రాజులు ఎక్కువ కాలం ఇక్కడ వున్నారు. అప్పటి పాల రాజవంశం కూడా బౌద్ధాన్నే అనుసరించారు. రాజ కుటుంబాలు అనుసరించే మతాన్ని నష్టపరచడానికి ఎవరూ సాహసించరు. అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు వాద సంవాదంతో తార్కికంగా విషయాలను చర్చించే వారే తప్పించి, భౌతికంగా నష్టపరిచే విషయాలు చేయరు. అది ఇతర మత గ్రంథాలకు, హిందూ ధర్మ గ్రంథాలకున్న తేడా.

    నలంద విషయంలో బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ ఏమన్నారంటే…

    విన్సెంట్‌ స్మిత్‌ రాసిన ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ఇండియా (1924) పుస్తకాన్ని చేస్తూ అంబేద్కర్‌ ఇలా అంటారు. 1197 ఏడీలో ముస్లిం ఆక్రమణదారులు నలంద, విక్రమశిల, జగద్దాల, ఒదంతపురి బౌద్ధ విశ్వవిద్యాలయాలను కొల్లగొట్టారు. బౌద్ధ సన్యాసులు వేల సంఖ్యలో నేపాల్‌, టిబెట్‌ మరియు భారత్‌ వెలుపల ఇతర ప్రాంతాలకు పారిపోయారు. చాలా పెద్ద సంఖ్యలో పూజారులు ముస్లిం కమాండర్ల చేతిలో చంపబడ్డారు. ఇస్లామిక్‌ ఆక్రమణదారులు చేసిన బౌద్ధ మతగురువుల వధ అలాంటిది. బౌద్ధ మతాచార్యులను చంపడం ద్వారా ఇస్లాం బౌద్ధ మతాన్ని చంపింది. భారత్‌లో బుద్ధుని మతానికి సంభవించిన అతి పెద్ద విపత్తు ఇదే. పురోహిత వర్గం లేకుంటే మతం అంతరించిపోవాలి. ఇస్లాం ఖడ్గం పురోహిత వర్గంపై ఎక్కువగా పడిరది. అలా బౌద్ధం నశించింది లేదా భారత్‌ వెలుపల పారిపోయింది అంటూ అంబేద్కర్‌ తెలిపారు.