వామపక్ష అవాస్తవ చరిత్ర గుప్పిట్లో నలంద… విధ్వంసానికి కారణం ఖిల్జియా? బ్రాహ్మణులా?

    0
    SHARE

    ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన భారతదేశంలో నిర్మితమైన ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమంతో నలంద విశ్వవిద్యాలయం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఎటువంటి శాస్త్ర విజ్ఞాన లేనప్పుడే ఈ విశ్వవిద్యాలయంలో అన్ని రంగాలలో పరిశోధనలు జరిగాయి. మత ఛాందసవాద భక్తియార్‌ ఖల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని కూలగొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇదే అదునుగా భావించిన వామపక్ష చరిత్రకారులు ఎప్పటిలాగానే తమ ఎరుపు రంగు కలంతో రాసిన చరిత్ర ఈ దేశం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ విశ్వవిద్యాలయాన్ని భక్తీయార్‌ ఖిల్జీ కూలగొట్టలేదు.. అక్కడున్న బ్రాహ్మణులు హిందూ మతానికి బౌద్ధానికి వున్న అంతర్గత కలహాల కారణంగా ఆ విశ్వవిద్యాలయం తగలబెట్టారని డా. రుచికా శర్మ అనే జేఎన్‌యూ హిస్టరీ స్కాలర్‌ ఆరోపణలు చేస్తూ పొంతన లేని కట్టుకథలను చెప్పుకొచ్చింది. దీంతో ఆగకుండా భక్తీయార్‌ కూల్చాడు అనడానికి ప్రాథమిక సాక్ష్యాలను చూపించాలని సవాల్‌ విసిరింది. దీనిని బట్టి చూస్తే వాస్తవాలను కూడా అవాస్తవాలుగా మార్చి, అల్ప సంఖ్యాక ప్రజలను సంతోషపెట్టే ఊబి నుంచి వామపక్ష మేధావులు ఇంకా బయటికి రాలేదన్న విషయం స్పష్టంగా ద్యోతకమవుతోంది. ఇక వాస్తవాల వైపు చూస్తే… పర్షియన్‌ చరిత్ర పుస్తకం ‘‘తబకత్‌ `ఎ` నసిరి’’ లో బ్రాహ్మణులను ఎలా ఊచకోత కోశారో… 200 మంది గుర్రాలతో భక్తీయార్‌ ఖిల్జీ మొత్తం నలందను ఎలా విడిచిపెట్టారో, ఎలా పుస్తకాలను తగులబెట్టాడో స్పష్టంగా వివరిస్తుంది. నలందను ధ్వంసం చేసిన భక్తియార్‌ ఖిల్జీ పేరు మీదనే భక్తీయార్ పూర్‌ (రైల్వే స్టేషన్‌ పేరు) అనే పేరు వచ్చింది.

    భక్తీయార్‌ ఖిల్జీ నలందాపై దాడి చేసినప్పుడుఅది పాల రాజవంశం/ సేన రాజవంశంచే పాలించబడిరది. నలంద మరియు పరిసర ప్రాంతాలను ఎన్నడూ బ్రాహ్మణులు పాలించలేదు. ఆ నాలుగు వందల సంవత్సరాల కాల ఖండంలో బౌద్ధాన్ని అనుసరించే రాజులు ఎక్కువ కాలం ఇక్కడ నివసించారు. అప్పటి పాల రాజవంశం కూడా బౌద్ధాన్ని అనుసరించేవారే. రాజ కుటుంబాలు అనుసరించే మతాన్ని నష్టపరచడానికి ఎవ్వరూ సాహసించరు. అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు వాద సంవాదంతో తార్కికంగా విషయాలను చర్చించే వారే తప్పా, ఇలాంటి భౌతికంగా నష్టపరిచే పనులు చేసేవారు కాదు. అది ఇతర మత గ్రంథాలకు హిందూ ధర్మ గ్రంథాలకు వున్న వ్యత్యాసం.

    ఈ విషయాన్నీ ఇంకా లోతుల్లోకి చర్చించాలంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ నలంద మీద ఉటంకించిన విషయాలను గమనిద్దాం.
    విన్సెంట్‌ స్మిత్‌ రాసిన early history of India పుస్తకాన్ని రిఫర్‌ చేస్తూ అంబేద్కర్‌ ఇలా అంటారు. 1197 ADలో ముస్లిం ఆక్రమణదారులు నలంద, విక్రమశిల, జగద్దాల, ఒదంతపురి, బౌద్ధ విశ్వవిద్యాలయాలను కొల్లగొట్టారు. బౌద్ధ సన్యాసులు వేల సంఖ్యలో నేపాల్‌, టిబెట్‌ మరియు భారతదేశం వెలుపల ఇతర ప్రాంతాలకు పారిపోయారు. చాలా పెద్ద సంఖ్యలో పూజారులు ముస్లిం కమాండర్ల చేతులలో చంపబడ్డారు. ఇస్లామిక్‌ ఆక్రమణదారులు చేసిన బౌద్ధ మతగురువుల వధ అలాంటిది. బౌద్ధ మతాచార్యులను చంపడం ద్వారా ఇస్లాం బౌద్ధ మతాన్ని చంపింది. భారత దేశంలో బుద్ధుని మతానికి సంభవించిన అతి పెద్ద విపత్తు ఇది. పురోహిత వర్గం లేకుంటే మతం అంతరించిపోవాలి. ఇస్లాంఖడ్గం పురోహిత వర్గంపై ఎక్కువగా పడిరది. అలా బౌద్ధం నశించింది. లేదా భారత్‌ వెలుపల పారిపోయింది. బౌద్ధమత జ్వాల రగిలించడానికి ఎవరూ మిగిలిపోలేదు. (first edition by education dept, govt of maharastra: 4 October, 2003 reprinted by dr. b.r. ambedker foundation  Jan 2014)

    నలంద చరిత్ర మన ముందే మారిపోతోంది. ఖిల్జీ నేరం బ్రాహ్మణులపై మోపుతున్నారు. కొన్ని రోజుల తర్వాత వామపక్ష చరిత్రకారులు లౌకిక వాదాన్ని కాపాడడానికి మరియు అల్ప సంఖ్యాకులను సంతోషపెట్టడానికి ప్రస్తుత ఆఫ్గనిస్తాన్‌లోని ఒమియాన్‌ మరియు పాక్‌లోని స్వాత్‌ వ్యాలీలో వేలాది బుద్ధ విగ్రహాలను కూల్చడం నుంచి, ప్రపంచంలో జరిగే మత యుద్ధాలకు, ధార్మిక స్థలాల మీద దాడులు చేస్తుంది. తాలిబాన్‌ మరియు ఇస్లామిక్‌ ఛాందసవాదులు కాదని, బ్రాహ్మణులే అనీ రుజువు చేస్తారు.

    ఇప్పుడు సమస్య నలంద కాదు. వామపక్ష చరిత్రకారులు రాసిన అవాస్తవ చరిత్రను తొలగించి లేదా వాస్తవ చరిత్రను దేశానికి అందించే ప్రయత్నం ఎంత జరిగింది అనేది. ఇందులో గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వ సాధించిన విజయమెంత? వామపక్ష చరిత్రకారులు చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ వుంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంత మంది సోకాల్డ్‌ మేధావులు మాత్రం పైరవీలు చేసుకుంటూ తమకేమి వస్తోంది? ప్రమోషన్‌ వస్తుందా? లేదా? అపాయింట్‌మెంట్‌ అవుతుందా? లేదా? ఇవే విషయాలతో కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా మేల్కొని అకాడమిక్స్‌లో పనిచేయాల్సిన అవసరం వుంది.