వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ భారత మాతను, జాతీయ జెండాను తీవ్రంగా అవమానించింది. కాసర్‌గఢ్ సెంట్రల్ యూనివర్శిటీ ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్ ‘‘కంగమ’’ పేరుతో ఓ ఆర్ట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ ఫెస్టివల్‌లోనే ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు భారత మాతను, జాతీయ జెండాను అవమానించే విధంగా చిత్రీకరించారు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పోస్టర్లను తొలగించారు.ఓ మహిళ నగ్నంగా నిలబడి, కన్నీళ్లు కారుస్తూ జాతీయ జెండాను ధరించినట్లు చిత్రీకరించారు. ఓ రోజు రోజంతా ఈ పోస్టర్ క్యాంపస్‌లోనే వుంది. దీనిని చూసి ఏబీవీపీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు.
అయితే.. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఈ పోస్టర్లను తీసేసినట్లే తీసేసి, మళ్లీ అతికించారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ (ఉప కులపతి)కి ఫిర్యాదు చేశారు.అయితే.. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులను పిలిపించి, మాట్లాడతానని పొడిపొడి మాటలు చెప్పారని ఏబీవీపీ మండిపడుతోంది. దీంతో ఎస్‌ఎఫ్‌ఐ చేసిన దుర్మార్గపు చర్యకి వ్యతిరేకంగా, వీసీ పద్ధతిని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ తీవ్రంగా నిరసనలు చేసింది. జీతం తీసుకుంటూ వీసీ దేశ వ్యతిరేకులతో జట్టు కట్టారని, వెంటనే ఇలాంటి పనులను మానుకోవాలి, లేదంటే ఉద్యమిస్తామని ఏబీవీపీ హెచ్చరించింది.