Home News ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల హత్యలకు వ్యతిరేకంగా భాగ్యనగరంలో ( హైదరాబాద్) నిరసన

ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తల హత్యలకు వ్యతిరేకంగా భాగ్యనగరంలో ( హైదరాబాద్) నిరసన

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలను లక్షంగా చేసుకొని జరుగుతున్న దాడులను కేరళలో రేమిత్, కర్ణాటక లో రుద్రేశ్ హత్యలను నిరసిస్తూ భాగ్యనగరం (  హైదరాబాద్) లో శేరిలింగంపల్లి ఆర్.ఎస్.ఎస్ అధ్వర్యంలో సోమవారం రాత్రి   తారా నగర్ తుల్జాభవాని గుడి నుంచి చందానగర్ గాంధీ విగ్రహం వరకు  నల్ల బ్యాడ్జిలతో కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు.

protest-against-killing-of-rss-members-2

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ కర్ణాటక , కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హత్యలకు పాల్పడిన నిందితులను త్వరగా గుర్తించి వారిపై తగిన న్యాయ విచారణ జరిపి కటినమైన శిక్షలు విధించాలి అని డిమాండ్ చేసారు.

protest-against-killing-of-rss-members1

నలబై రెండు సంవత్సరాల శ్రీ రుద్రేశ్ జీ ఆదివారం (16-అక్టోబర్-2016) ఆర్.ఎస్.ఎస్. అద్వర్యంలో బెంగళూరు, శివాజీ నగర్ లో  జరిగిన పథ సంచలన్ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా చేసిన దాడిలో చనిపోయారు.

అక్టోబర్ 12 నాడు కేరళలోని కన్నూరు జిల్లా పినరయి గ్రామంలో శ్రీ రేమిత్, 26 సం., ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తను కమ్యూనిస్ట్ పార్టీ సానుబుతిపరులగా అనుమానిస్తున దుండగులు హత్య చేసారు.