Home Telugu భారతీయులను మతం, కులం, ఆధారంగా విడదీసి చూడొద్దు: ఇంద్రేష్ కుమార్ జీ

భారతీయులను మతం, కులం, ఆధారంగా విడదీసి చూడొద్దు: ఇంద్రేష్ కుమార్ జీ

0
SHARE

భారత దేశంలో నివసించే వారందిరిని హిందువులు,భారతీయులు అని పిలుస్తారు. 600 పైగా వివిధ బిన్నమైన పూజ విధానాలు, జీవించే పద్దతులు ఉన్న వారందరు సుఖ సంతోషాలతో కొన్ని వందల సంవత్సరులగా సహా జీవనం చేస్తున్న మన అందరిని అక్కున చేర్చుకొని ఆలనా పాలన చూస్తూ అందరికి సమన అవకాశం ఇస్తున్న  మన దేశం తల్లి లాంటిది. ప్రపంచ శాంతి కొరకు పరితపించే మన భారత దేశ ఔన్నత్యాన్ని విశ్వగురు స్థానానికి చేర్చడానకి ఎలాంటి బేధ భావం లేకుండా తమ వంతు సహకారం అందించాలి. అంతే కాని మతం, కులం, ఆధారంగా విడదీసి చూడొద్దు అని ఆర్ ఎస్ ఎస్ సీనియర్ ప్రచారక్, శ్రీ ఇంద్రేష్ కుమార్ జి హైదరాబాద్ లో అన్నారు.

ఇంద్రేష్ కుమార్ గారు హైదరాబాద్ మజ్దాన్ ఇంటర్నేషనల్ హోటల్ లో జరిగిన రాష్ట్రీయ ముస్లిం మంచ్ అధర్యంలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రసంగించారు. ఇందులో 250 మందికి పైగా ముస్లిం లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం  సయాద్ ఫయజుద్దిన్, ఎం ఏ సత్తార్ గారి పర్యవేక్షణలో జరిగింది.

ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా తాము నివసిస్తున్న ప్రదేశాలలో చెట్లు,  ప్రతి ముస్లిం సైతం ఔషద గుణాలు ఉన్న తులసి మొక్కను  ఇంటి ఆవరణలో పెంచుకోవాలి అని ఇంద్రేష్  గారు కోరారు.

మనం అందరి పూర్వికులు ఒక్కరే, ఇక్కడి నివసించిన వారే. కాల క్రమంలో జరిగిన కొన్ని మార్పుల కారణంగా ఏర్పడిన ఇబ్బందులు పెంచుకోకుండా రంజాన్ సందర్బంగా ముస్లింలు తమ ఇంటి పక్క వాళ్ళతో కలిసి ఇఫ్తార్ విందు లాంటిధి ఏర్పాటు చేసుకొని అందరితో సోదర భావంతో మెలగాలి అని, ఇతరుల జీవన విదానాన్ని, పూజ పద్దతలను ఒకరికిఒకరు గౌరవిన్చుకున్నపు డు ఎలాంటి గొడవలు ఉండవు అని అన్నారు.

గోవు తల్లి పాత్ర పోషి స్తూ మనవ జాతికి చేస్తున్న మేలు విస్మరించాలేము, దాన్నిఅందరు  అంగీకరిస్తారు అని చెబుతూనే, ముస్లింల పవిత్ర ప్రదేశం అయిన మక్కాలో లేదా క్రిస్టియన్ పీఠదిపతి నివసించే

వాటికాన్ లో గోవును హత్య చేయరు కాదా అలాంటి అప్పుడు గోమంసాన్ని మతానికి జోడించడం ఏ విధంగా సమంజం అని ప్రశిన్స్తూ దానిపై అందరు అలోచంచాలన్నారు.

కొంతమంది మూర్ఖుల చ ర్యల వలన ఇస్లాం తన గౌరవాన్ని కోల్పోతుంది అని, కాని నిజమైన ముస్లిం తనతో పాటు సమాజం లోని అందరి భాగోగులు చూసినపుడే మొహమ్మద్ ప్రవక్త సంతోషిస్తాడు అని ఖురాన్ లో చాల సందర్బాలలో పెర్కొనబడ్డది అని గుర్తుచేసారు.  ప్రపంచంలో ప్రతి మత గ్రంధంపై వీపరీత అర్థాలు తీస్తూ ఎంతో  మంది ఎన్ని పుస్తకాలు రాసారు, కాని అలంటి చెడు వాటి పై ద్రుష్టి పెట్టకుండా మత గ్రంధాల లోని శాంతిని, సహనాన్ని, సోదరభావాన్ని నేర్చుకోవాలి అని అన్నారు.

ట్రిపుల్ తాలాక్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఖురాన్ లో మహిళకు అత్యంత ప్రాదాన్యత ఇవ్వడం జరిగింది అని, విడాకులు తీసుకోవడమే మహా పాపం గా పరిగనించ బదినపుడు, మూడు సార్లు తలాక్ చెప్పడం అనేది, మహిళా సాధికారతకు సహకరించక పోవడం తప్పు అని అన్నారు.

హైదరాబాద్ ఎం.పి ఒవైసీ పై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ముందు తన తమ్ముడు బహిరంగ సభలో హిందువుల పై చేసిన వ్యాక్యాల పట్ల, తీవ్రవాదం పై ఆకర్శించాబడుతూ, బద్రత దళాలపై రాళ్ళూ రువ్వుతూ, ముస్లిం సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తూ దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటూ మతం చాటున దాకుంటున్న వారి ని దేశ ద్రోహులగా ఎందుకు ప్రకటించడం లేదు అని అన్నారు.

సయ్యద్ ఫయాజుద్దిన్, రాష్ట్రీయ ముస్లిం మంచ్ తెలంగాణా మరియు ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు, మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మతం ఆదారంగా, ముఖ్యంగా హిందూ ముస్లిం ల మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి సోధరభావమతో జీవిస్తూ దేశ ప్రగతి లో శక్తి వంచన లేకుండా పాల్గొనడం మన బాద్యత అనిఅన్నారు.దానికి అనుగుణంగానీ ఇలాంటి కార్యక్రమం అని   ముందు  ముందు  ఈలాంటి మరిన్న కార్యక్రమాలు  నిర్వహిస్తామన్నారు.

ఇందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ. బండారు దత్తాత్రేయ , మౌలానా నదీముల్ కాస్మి, ముస్లిం రాష్ట్రీయ మంచ్ రాష్ట్ర సంయోజక్ శ్రీ. గిరీష్ జూయల్, ఎం ఏ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.