Home News పోలీస్ కానిస్టేబుల్ సాహసం

పోలీస్ కానిస్టేబుల్ సాహసం

0
SHARE

400 మంది పాఠశాల విద్యార్థులను రక్షించడానికి ఓ  పోలీసు కానిస్టేబుల్ 10 కిలోల బాంబును భుజంపై పెట్టుకొని పరుగెత్తిన సాహసానికి మద్య ప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం సాక్ష్యంగా నిలిచింది.

మద్య ప్రదేశ్ సాగర్ జిల్లాలోని చిత్తోరా గ్రామం, రాజాధాని భోపాల్ కు 170 కిమీదూరంలోఉంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఒక పేలుడు పదార్థాన్ని గుర్తించిన పాఠశాల అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

కానిస్టేబుల్ అభిషేక్  పటేల్  నేతృత్వంలో పోలీసులు రంగ ప్రవేశంచేసి ఆ పేలుడు పదార్ధాన్ని పది కిలోల బరువైన బాంబుగా గుర్తించారు. బాంబు స్క్వాడ్ రాక గురుంచి నీరిక్షిస్తూ తదుపరి ఏమి చేయాలో అని స్కూల్ యాజమాన్యం తర్జన భర్జన పడుతున్న సమయంలో కానిస్టేబుల్ అభిషేక్  పటేల్ ఈ వ్యవహారాన్నితన భుజాల పైవేసుకున్నాడు. తక్షణమే 12 అంగుళాల పొడవు, 10 కిలోల బరువున్న ఆ బాంబును తన భుజంపై పెట్టుకొని ఆ పరిసరాలకు దూరంగా  పరిగెత్తాడు. 400 మంది విద్యార్థులను, ప్రజలను రక్షించటానికి జన సమాచారంలేని ప్రదేశం కోసం ధైర్యంగా పరిగెత్తాడు.

సాహసవంతుడైన ఈ కానిస్టేబుల్ తర్వాత మాట్లాడుతూ అంతకుముందు ఇటువంటి పరిస్తితులను ఎదుర్కోవడానికి ఇచ్చిన ప్రశిక్షణ లో భాగంగా తాను బాంబును గుర్తించి ఇదే విధంగా భుజం పై తీసుకొని పరిగెత్తిన విషయాన్నీతెలియచేయడం గుర్తు చేసాడు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలను గుర్తిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడినందుకు యాభై వేల నగదు ను ఇస్తునట్టు ప్రకటించడం జరిగింది.