Home News ఆర్ఎస్ఎస్ 3 రోజుల సమన్వయ సమావేశాలు ప్రారంభం

ఆర్ఎస్ఎస్ 3 రోజుల సమన్వయ సమావేశాలు ప్రారంభం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహిస్తున్న 3 రోజుల సమన్వయ సమావేశమును సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ మరియు సర్ కార్యవాహ శ్రీ భయ్యాజి జోషి భారత మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ప్రారంభించారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 1 నుండి 3, 2017  వరకు శ్రీ ధాం, బృందావన్, ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్నవి.

మనమందరమూ భారత్ యొక్క ఆధ్యాత్మిక మూలాలకు  అనుగుణంగా వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్నామని తమ  ప్రారంభ సందేశములో  ఆర్.యస్.యస్  సహ సర్ కార్యవాహ శ్రీ సురేష్ జీ సోని  అన్నారు. మారుతున్న దేశ, కాల మరియు ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన సంస్థల భావజాలానికి అనుగుణంగా మనము పని చేయాలి.

ప్రతి పని మూడు దశల గుండా సాగుతుంది – అవి నిర్లక్ష్యత, ప్రతికూలత మరియు అంగీకారము. మనము మొదటి రెండు విషయాలని అధిగమించాము. ఇప్పుడు మనకు సమాజం నుండి అత్యంత అనుకూలత లభిస్తున్నది.

ఈ మూడు రోజుల సమావేశములో ప్రస్తుతము ప్రపంచములో జరుగుతున్న మార్పులు, దేశములోని పరిస్థితులు మరియు మన సంస్థలపై  సరైన అంచనాల గురించి చర్చ జరుగుతుంది.

ఒక రోజు ముందు జరిగిన పత్రికా సమావేశములో అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్,  శ్రీ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ, ఇటువంటి సమావేశాలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయని వివరించారు. ఈ సమావేశాములలో ఎటువంటి నిర్ణయాలు తీసికోనబడవని  కేవలం వివిధ క్షేత్రాల జ్యేష్ట అధికారులు తమ తమ అనుభవాలను పంచుకుంటారని అయన తెలిపారు.

డా. వైద్య గారు  సమావేశంలో  ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ ఈ సమన్వయ సమావేశములో పాల్గొంటున్న ప్రతి సంస్థ తమ నిర్ణయాలను తీసుకొనే స్వతంత్రం కలిగియున్నదని  దానికి అనుగుణంగా వారు పనిచేస్తారన్నారు. ఇది అర్ధం చేసుకోలేనివారు సంఘ పనిచేసే విధానాన్ని అర్ధం చేసుకోవాలని సూచించారు.