Home News హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

హైదరాబాద్‌లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

0
SHARE

నగరంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బండ్లగూడ సమీపంలోని సన్‌సిటీలో పోలీసులు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అబ్దుల్ మాలిక్‌, అతని కుమారులు ఫజుల్లా, ఖయ్యూం అనే ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా వారి నుంచి నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా… వీరు ఇంటర్నెట్‌ ద్వారా ఐసిస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఉత్తరప్రదేశ్ పోలీసులకు స్థానిక పోలీసులు అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో నగరంలో వీరి కదలికలు ఉన్నాయని రుజువు చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)