Home News మనం గురుగోవింద్ సింగ్ లం కావాలి -డా. మోహన్ భాగవత్

మనం గురుగోవింద్ సింగ్ లం కావాలి -డా. మోహన్ భాగవత్

0
SHARE

గురుగోవింద్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని, ఆయనను అనుసరించే యువత మన దేశంలో చాలామంది ఉన్నారు. భారతదేశ వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పిన స్వామి వివేకానంద భారత్ మరోసారి ఆ వైభవ స్థితిని, గౌరవాన్ని పొందాలంటే గురుగోవింద్ సింగ్ మార్గాన్ని అనుసరించాలని బోధించారు. అందుకని ముందు స్వయంగా మనం గురుగోవింద్ లం కావాలి. అప్పుడే సమాజం అనుసరిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. గురుగోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ సిఖ్ సంగత్ డిల్లీలోని తల్కటోర స్టేడియంలో నిర్వహించిన(25.10.2017) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడానికి మననుండే ప్రారంభించాలని, మతం, జాతి మొదలైనవాటికి అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. గురుగోవింద్ సింగ్ జీవిత విశేషాలను ఉదహరిస్తూ ఆయన మనకు ప్రేరణ అని అన్నారు. గురుగోవింద్ దేశం కోసం రాజ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి తనను తాను సమర్పించుకున్నారు. ఆయన శత్రువులను కూడా ఎప్పుడు దూషించలేదు. యుధ్ధంలో కూడా ఆయన ఎలాంటి భేదభావం చూపలేదు. దేశంకోసం ప్రాణాలు అర్పించడానికి ఎల్లప్పుడు సిద్దంగా ఉండేవారిని ఆయన తయారుచేశారు. ఆయన చూపిన ఆదర్శం ఏ ఒక్క జాతి, సంప్రదాయం, మతానికో పరిమితమైనది కాదు. ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి, అందులోని ఆదర్శాలను మన జీవితాలలో అనుసరించాలి. అదే ఆయన పట్ల మనం చూపే నిజమైన కృతజ్ఞత అవుతుంది.

రాష్ట్రీయ సిఖ్ సంగత్ అధ్యక్షులు జి.ఎస్.గిల్ మాట్లాడుతూ గురుగోవింద్ సింగ్ విదేశీ దురాక్రమణదారుల ముందు ఎప్పుడు తలవంచలేదని అన్నారు. దేశ గౌరవాన్ని నిలిపేందుకు ప్రాణాలు అర్పించడాన్ని గురుగోవింద్ మనకు నేర్పారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ముప్పును తప్పించి, సమాజానికి ఒక కొత్త దారిని చూపారని, ఆ దారిలోనే పయనిచడానికి నేటికీ మనం ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అన్నారు. అనేక సంకటాలను ఎదుర్కొన్నా ఈ సంస్కృతి మాత్రం ఇక్కడ విలసిల్లుతూనే ఉందని అన్నారు. గురుగోవింద్ సింగ్ ఏ పంథాను ప్రారంభించారో అది నేటికీ దేశాన్ని రక్షిస్తోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

కార్యక్రమంలో నామ్ ధారి సమాజానికి చెందిన ఠాకూర్ దిలీప్ సింగ్ తోపాటు అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.