Home News రామసేతు మానవ నిర్మితమే – సైన్స్ ఛానల్ విశ్లేషణ

రామసేతు మానవ నిర్మితమే – సైన్స్ ఛానల్ విశ్లేషణ

0
SHARE
An image of the Ram Setu as seen from space. Courtesy: Twitter/@ScienceChannel

సైన్స్ ఛానల్ డిస్కవరి ఛానల్ నెట్ వర్క్ లో ఒక టీవి ఛానల్. ఈ చానల్ ను అమెరికాలో 75.48 మిలియన్ మంది చూస్తారు. ఈ ఛానల్ మిథ్ బస్టర్స్, హౌ ఇట్ మేడ్ మొదలైన కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఇందులోనే వాట్ ఆన్ ఎర్త్ అనే కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఇందులో భూమిపై పూర్తి వివరాలు, వివరణ లేని విషయాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం నాసా తీసిన ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తారు. ఇటీవల ఈ ఛానల్ తన  అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో `ఏన్షియంట్ లాండ్ బ్రిడ్జ్’ అనే శీర్షిక తో ఒక వీడియోను పెట్టింది. నాసా ఉపగ్రహ చిత్రం సహాయంతో రూపొందించిన విశ్లేషణ అది.

భారత్, శ్రీలంక మధ్య సముద్రంలో మునిగిఉన్న ప్రదేశపు ఉపగ్రహ చిత్రంలో 48 కి.మీ పొడవున రాళ్ళు కనిపించాయి. ఇవి శ్రీరామచంద్రుడు నిర్మించిన సేతువు కావచ్చని విశ్లేషకులు పరిశీలించారు.

ఈ రాళ్ళు ఇసుక గుట్టలపై అమర్చారని, ఇలాంటి ఇసుక గుట్టలు రెండు భూభాగాల మధ్యలో ఉండే నీటిలో ఏర్పడతాయని సముద్రగర్భ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.  ఇసుక తిన్నెలు సహజంగా ఏర్పడినవే అయినా వాటిపై రాళ్ళు మాత్రం ఎవరో పేర్చినవేనని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. వాటిని దురప్రాంతం నుండి తెచ్చి అక్కడ అలా పెట్టారని అన్నారు.

ఇసుక గుట్టలపై ఉంచిన రాళ్ళు 3వేల సంవత్సరాలకు పూర్వమైనవన్నదే ముఖ్యమైన విషయం. అవి దాదాపు 7వేల సంవత్సరాల నాటివని, అవి అమర్చిన ఇసుక తిన్నెలు మాత్రం 4వేల సంవత్సరాల నాటివని అన్నారు. అంటే దీని అర్ధం ఆ రాళ్ళను ఎక్కడ నుండో, ఎవరో తెచ్చి అక్కడ అమర్చారని విశ్లేషకులు అంటున్నారు.

రామసేతుకు సంబంధించిన ఈ విశ్లేషణ, వీడియోకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్ లో లక్షలాదిమంది ఈ వీడియో చూశారు, షేర్ చేస్తున్నారు. భారతీయ చరిత్రకు చెందిన అనేక విషయాలను అభూత కల్పనలని కొట్టి పారేసే వామపక్ష, సెక్యులర్ మేధావులకు ఈ వీడియో ఒక కనువిప్పు కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.