Home Telugu Articles ఇస్లామ్ పాలకుల విధ్వంసం: ఆలయాల్లో మసీదులు, దర్గాలు

ఇస్లామ్ పాలకుల విధ్వంసం: ఆలయాల్లో మసీదులు, దర్గాలు

0
SHARE

అనురాగ్

వారాణాసిలో జ్ఞాన్‌వాపి వద్ద వివాదాస్పద కట్టడ ప్రాంగణంలో కోర్టు ఆదేశానుసారం మే 16న జరిపిన సర్వేలో ఒక పురాతనమైన శివలింగం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన్‌వాపి విషయానికి వస్తే గతంలో అక్కడ దేవస్థానం ఉండేదని, అదే చోట ఒక మసీదు నిర్మించారని ఆ ప్రాంతాన్ని చూసినవారెవరికైనా సులభంగా అర్థమవుతున్నది. మజార్, మసీదులు, దర్గాలు, కోటలు, ఈద్గాలు, తదితర ఇలాంటి అనేక ముస్లిము కట్టడాలు దేవస్థానాలు ఉన్న చోట, దేవస్థానాలకు చెందిన సామాగ్రితో నిర్మితమయ్యాయి.

అయితే, అలాంటి అనేక నిర్మాణాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. 1990లో చరిత్రకారులు సీతారామ్ గోయెల్ ఇతర రచయితలు అరుణ్ శౌరి, హర్ష్ నారాయణ్, జే దుబాషి, రామ్ స్వరూప్‌తో కలిసి ‘Hindu Temples: What Happened To Them’  అనే రెండు వాల్యూమ్‌ల పుస్తకాన్ని ప్రచురించారు. దేవస్థానాలు ఉన్నచోట, ధ్వంసం చేసిన దేవస్థానాల సామాగ్రితో నిర్మించిన 1,800 కు పైగా ముస్లిము నిర్మాణాలను ఆ పుస్తకంలో గోయెల్ ప్రస్తావించారు. కుతుబ్ మినార్ నుంచి బాబ్రీ మసీదు, జ్ఞాన్‌వాపి, పినోజ్ గార్డెన్స్, తదితరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి.

రచయితలు అనుసరించిన విధానం

రచయితలు రచించగా గతంలో వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాలకు తోడుగా అదనపు అధ్యాయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘Historians Versus History’ పేరిట పుస్తకంలోని ఆరవ అధ్యాయంలో బ్రిటీష్, ముస్లిము చరిత్రకారుల రచనల్లో హిందు దేవస్థానాల విధ్వంసం తాలూకు వివరాలను రామ్ స్వరూప్ పొందుపరిచారు. భారతదేశంలో తమ ఉనికిని దఖలుపరుచుకోవడానికి మొగలాయి రాజుల క్రూరత్వం, అరాచకాల గురించి బ్రిటీష్ చరిత్రకారులు రచించారు. దీనికి విరుద్ధంగా, ఇస్లామును మరింత గొప్పగా చూపించుకోవడానికి దేవస్థానాలను ధ్వంసం చేసిన వైనాన్ని ముస్లిము చరిత్రకారులు వివరంగా రాసుకొచ్చారు.

దేశవ్యాప్తంగా ఇస్లాము నిర్మాణాల వద్ద లభించిన అనేక శాసనాలు ఖురాన్‌ను ఉటంకిస్తూ అల్లా, మహమ్మద్ ప్రవక్తను స్తుతిస్తున్నాయి. అవే శాసనాలు ఈ కట్టడాలను ఎవరు, ఎలా, ఎప్పుడు అనే వివరాలను అందిస్తున్నాయి. “పేరొందిన ముస్లిము పురాలేఖన విజ్ఞానుల ద్వారా ఆ శాసనాలు వాటి చారిత్రక అంశానికి అనుసంధానమై ఉన్నాయి. వాటిని భారత పురావస్తు శాఖ Epigraphia Indica లో ప్రచురించింది. Epigraphia Indo-Moslemica  పేరిట 1907-08లో తొలిసారిగా ప్రచురితమైంది” అని ఆ పుస్తకం పేర్కొంది.

అరుణ్ శౌరి రచించిన ఒక కథనం 1989 సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రచురితమైంది. పేరొందిన వ్యక్తి మౌలానా హకీమ్ సయీద్ అబ్దుల్ హయ్‌ను అరుణ్ శౌరి ప్రస్తావించారు. వారు అనేక పుస్తకాలను రచించారు. వాటిలో 17 పేజీలతో కూడిన ‘హిందుస్థాన్ కీ మస్‌జీదే’ లేదా ‘The Mosques of India’ అనే అధ్యాయం ఉన్నది. మసీదులకు చెందిన క్లుప్తమైన వివరాలు లభించాయని శౌరి ఆ అధ్యాయంలో పేర్కొన్నారు. హయ్‌కు సంబంధించినంతవరకు అవి కేవలం కుప్తమైన వివరాలు మాత్రమే కానీ వాటిలో హిందూ దేవస్థానాలను ధ్వంసం చేసిన తర్వాత మసీదులు నిర్మించిన వైనం ఉందని అరుణ్ శౌరి తెలిపారు.

ఉదాహరణకు, బాబ్రీ మసీదు గురించి ఒకానొక శాసనంలో “ఈ మసీదును బాబర్ అయోధ్యలో నిర్మించాడు. అదే ప్రాంతాన్ని హిందువులు రామచంద్ర స్వామి జన్మభూమిగా పిలుచుకుంటారు. వారి భార్య సీతామాత గురించిన ప్రసిద్ధమైన ఇతిహాసం ఉన్నది. ఇదే ప్రాంతంలో సీతామాతకు దేవస్థానం ఉండేది. సీతాసాధ్వీమణి శ్రీరామచంద్రమూర్తి కోసం ఆహారాన్ని వండి వడ్డించేవారు. ఇలాంటి ప్రాంతంలో, బాబర్ ఈ మసీదును H. 963 లో నిర్మించాడు
” అని ఉంది. ఇక్కడ H. 963 అంటే హిర్జీ క్యాలెండర్ సంవత్సరం 963 అని అని అర్థం. అదే ఇంగ్లీషు క్యాలెండర్‌లో 1555-1556 సంవత్సరంగా రూపాంతరం చెందుతుంది.

రాష్ట్రాల వారీగా ఇస్లాము నిర్మాణాల జాబితా
పుస్తకంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి 1,800 కుపైగా నిర్మాణాలను ప్రస్తావించారు. సీతారామ్ గోయెల్ రచించిన పుస్తకానికి ఇస్లాము నిర్మాణాల జాబితాను సమకూర్చడంలో హిందూ దేవస్థానాల పునరుద్ధరణకు అంకితమైన Reclaim Temples అనే సంస్థ విస్తృతమైన కృషి చేసింది.

ఆంధ్రప్రదేశ్
సీతారామ్ గోయెల్, తదితరులు చేసిన ప్రస్తావనలతో కూడిన ఆ పుస్తకంలో, ఆంధ్రప్రదేశ్‌లో దేవస్థానాలను ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో మసీదులు, దర్గాలు, గేట్‌వేలు, కోటలు నిర్మితమయ్యాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి 142 నిర్మాణాలను రచయిత గుర్తించారు. వాటిలో కదిరిలో జమీ మసీదు, పెనుకొండలో షేర్ ఖాన్ మసీదు, బాబయ్య దర్గాగా రూపాంతరం చెందిన దేవస్థానం, తాడిపత్రిలో ఈద్గా, గుండ్లకుంటలో దత్‌గిరి దర్గా, జనలపల్లెలో దత్‌గిర్ స్వామి దర్గాగా రూపాంతరం చెందిన జంగం దేవస్థానం, తదితరాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా, హైదరాబాద్‌లోని అలియాబాద్‌లో ఒక దేవస్థాన ప్రాంతంలో 1322లో ముముని చుప్ దర్గా నిర్మితమైంది. అదే విధంగా, రాజమహేంద్రవరంలో 1324లో వేణుగోపాలస్వామి దేవస్థానం జమీ మసీదుగా రూపాంతరం చెందింది. ఆంధ్రప్రదేశ్‌లో దేవస్థానాల విధ్వంసం శతాబ్దాల కాలంగా కొనసాగుతున్నది. 1729లో ఒక దేవస్థాన ప్రాంతంలో నిర్మితమైన గచ్చినాల మసీదు రాష్ట్రంలో తాజా మసీదుగా నిలుస్తున్నది.

అస్సాం
ఈ పుస్తకం ప్రకారం అస్సాంలో రెండు పేరొందిన దేవస్థాన ప్రాంతాలు పోవో మసీదు, సుల్తాన్ ఘియసుద్దీన్ బాల్బన్ మజర్ అనే మసీదులుగా రూపాంతరం చెందాయి. ఈ రెండూ ఇస్లాము కట్టడాలు కామరూప్ జిల్లాలోని హజోలో గల దేవస్థాన ప్రాంతాల్లో నిర్మితమై ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లో దేవస్థానాల ధ్వంసం చేసిన ప్రాంతాలు లేదా ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో మసీదులు, దర్గాలు, కోటలు లాంటి ముస్లిమ్ కట్టడాలతో కూడిన 102 ప్రాంతాలను గుర్తించారు. వాటిలో లోక్‌పురాలో ఘజీ ఇస్మాయిల్ మజర్‌గా రూపాంతరం చెందిన వేణుగోపాల స్వామి దేవస్థానం, ధ్వంసం చేసిన దేవస్థానాల సామాగ్రితో 1221లో బిర్భుమ్ సియాన్‌లో నిర్మించిన మఖ్దూమ్ షా దర్గా, బౌద్ద మందిరాలను ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో సౌతాలో నిర్మించిన సయ్యీద్ షా షహీద్ మహ్ముద్ దర్గా, బనియా పుకుర్‌లో 1342లో దేవస్థానాలను ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో నిర్మించిన అలౌద్-దిన్ అలౌల్ హఖ్ మసీదు ఉన్నాయి.

12 శతాబ్దం చివరిలో లక్ష్మీ నవతి పేరిట ఒక హిందూ రాజధానిని ముస్లిములు ధ్వంసం చేశారు. హిందూ రాజధాని శకలాలతో గౌర్‌లో ఒక ముస్లిము రాజధాని నిర్మితమైంది. అదే నగరంలో రెండు శతాబ్దాల కాలంలో ధ్వంసం చేసిన దేవస్థానాల సామాగ్రితో ఛోటీ సోనా మసీదు, తాంతిపురా మసీదు, లట్టన్ మసీదు, మఖదుమ్ అఖి సిరాజ్ ఛిస్తీ దర్గా, ఛమ్‌కట్టి మసీదు, ఛండిపూర్ దర్వాజా, తదితర కట్టడాలు నిర్మితమయ్యాయి.

బీహార్
బీహార్‌లో మసీదులు, ముస్లిము కట్టడాలు, కోటలు తదితర హిందూ దేవస్థానాల ప్రాంతాల్లో నిర్మించిన 77 నిర్మాణాలను గుర్తించారు. భాగల్‌పూర్‌లో ఒక దేవస్థాన ప్రాంతంలో 1502లో హజ్రత్ షాబాజ్ దర్గా నిర్మితమైంది. అదే విధంగా చంపానగర్‌లో జైన మందిరాల శిథిలాలపై అనేక మజర్లు నిర్మితమయ్యాయి. మొంఘైర్ జిల్లాలోని అమోల్‌జోరిలో విష్ణు మూర్తి దేవస్థాన ప్రాంతంలో ముస్లిముల స్మశానవాటిక ఉన్నది. గయలోని నాదిర్‌గంజ్‌లో 1617లో ఒక దేవస్థాన ప్రాంతంలో షాహీ మసీదు నిర్మితమైంది.

నలంద జిల్లాలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ విహారం ఉదండపురాలో ధ్వంసం చేసిన తర్వాత ముస్లిము రాజధాని బీహార్ షరీఫ్ నిర్మితమైంది. దేవస్థానాలను ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో నిర్మించిన అత్యధిక ముస్లిము నిర్మాణాల్లో 1380లో నిర్మితమైన మఖ్‌దుముల్ ముల్క్ షరీఫుద్దిన్ దర్గా, బడా దర్గా, ఛోటా దర్గా, తదితరాలు ఉన్నాయి.

పాట్నాలో ఒక దేవస్థాన ప్రాంతంలో షా జుమ్మన్ మదరియ్యా దర్గా నిర్మితమైంది. బౌద్ధ విహారాలపై షా ముర్ మన్సూర్ దర్గా, షా అర్జానీ దర్గా, పిర్ దమారియా దర్గా, తదితరాలు నిర్మితమైయ్యాయి.

ఢిల్లీ
ఢిల్లీలో మొత్తంగా 72 నిర్మాణాలను గుర్తించినట్టు ఆ పుస్తకం పేర్కొంది. ఇస్లాము చొరబాటుదారులు ఏడు నగరాలను నిర్మించడానికి ఇంద్రపత్, ధిల్లికా వాటి అనుబంధ ప్రాంతాలను ధ్వంసం చేశారు. దేవస్థానాల శకలాలతో కుతుబ్ మినార్, ఖువ్వతుల్ ఇస్లామ్ మసీదు (1198), షంసుద్ దిన్ ఇల్తుత్‌మిష్ మఖ్‌బరా, జహాజ్ మహల్, అలాల్ దర్వాజా, అలాల్ మినార్, మదర్సా, అలౌద్-దిన్ ఖల్జీ మఖ్‌బరా, మదీ మసీదు లాంటి అనేక స్మారకాలు, మసీదులు, మజర్లు నిర్మితమయ్యాయి.

డయూ
1404లో ఒక దేవస్థాన ప్రాంతంలో నిర్మితమైన జమీ మసీదును పుస్తకంలో ప్రస్తావించారు.

గుజరాత్
గుజరాత్‌లో 170 నిర్మాణాలను పుస్తకం ప్రస్తావించింది. అసవల్, పటన్, చంద్రావతి వద్ద ధ్వంసం చేసిన దేవస్థానాల శకలాలతో అహ్మదాబాద్ పేరిట ఒక ముస్లిము నగరం నిర్మితమైంది. అహ్మదాబాద్‌లో దేవస్థానాల శకలాలతో నిర్మించిన నిర్మాణాల్లో భద్ర రాజప్రాసాదం, కోట, అహ్మద్ షా జమీ మసీదు, హయిబిత్ ఖాన్ మసీదు, రాణి రూప్‌మతి మసీదు, తదితరాలు ఉన్నాయి.

ధోల్కా జిల్లాలో దేవస్థానాలకు చెందిన ప్రాంతాల్లో భాలోల్ ఖాన్ ఘాజీ మసీదు, మజర్, బార్‌కత్ షాహీద్ మజర్ నిర్మితమయ్యాయి. అదే విధంగా, సార్‌ఖేజ్‌లో దేవస్థానాల శకలాలను ఉపయోగించి 1445లో షేఖ్ అహ్మద్ ఖట్టు గంజ్ బక్ష్ దర్గా నిర్మితమైంది. భారుచ్‌లో హిందూ, జైన దేవస్థానాలను ధ్వంసం చేయగా వచ్చిన సామాగ్రితో 1321లో జమీ మసీదు నిర్మితమైంది.

భావ్‌నగర్‌లోని బొటద్‌లో ఒక దేవస్థానానికి చెందిన ప్రాంతంలో పిర్ హమీర్ ఖాన్ మజర్ నిర్మితమైంది. ద్వారకలోని ఒక దేవస్థాన ప్రాంతంలో 1473లో ఒక మసీదు నిర్మితమైంది. భుజ్‌లో ఒక దేవస్థాన ప్రాంతంలో జామి మసీదు, బాబా గురు గుంబడ్ నిర్మితమయ్యాయి. రండేర్ నుంచి జైన మతస్థులు వెళ్ళగొట్టబడ్డారు. అక్కడి జైన మందిరాలు మసీదులుగా రూపాంతరం చెందాయి. ఆ క్రమంలో జామి మసీదు, నిత్ నౌరీ మసీదు, మియా కా మసీదు, ఖార్వా మసీదులు నిర్మితమయ్యాయి. సోమనాథ్ పటాన్‌లో దేవస్థాన ప్రాంతాల్లో బజార్ మసీదు, చాంద్‌నీ మసీదు, ఖాజీ మసీదు నిర్మితమయ్యాయి.

హర్యానా
హర్యానాలో మొత్తంగా 77 నిర్మాణాలను చరిత్రకారులు గుర్తించారు. అంబాలాలోని పింజోర్‌లో ఫిదాయి ఖాన్ గార్డెన్‌ నిర్మాణంలో దేవస్థాన శకలాలను వినియోగించారు. కయిథాల్‌లో 1246లో దేవస్థాన శకలాలను వినియోగించి బల్ఖ్ షేక్ సలాహుద్-దీన్ అబుల్ ముహమ్మద్ దర్గాను నిర్మించారు. కురుక్షేత్రలోని తిలాలో మదర్సా, ఝాజ్జర్‌లో కలీ మసీదును దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు. అగ్రోహ నుంచి తెప్పించిన దేవస్థాన శకలాలతో హిసార్‌ను ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు. శ్రీరామచంద్రప్రభువు కుమారుడైన కుశుడి వారసుడు అగ్రసేన మహారాజు అగ్రోహ నగరాన్ని నిర్మించారు. అగ్రోహ నగరాన్ని మహమ్మద్ ఘోరీ 1192లో ధ్వంసం చేశాడు.

హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రాలో దేవస్థాన శకలాలను వినియోగించి జహంగిరి గేటును నిర్మించిన వైనాన్ని పుస్తకంలో పొందుపరిచారు.

కర్నాటక
కర్నాటకలో మొత్తంగా 192 నిర్మాణాలను గుర్తించారు. బెంగళూరులోని దొడ్డ బల్లాపూర్‌లో అజోధన్ ముహియుద్-దిన్ ఛిస్తీ దర్గాను దేవస్థాన శకలాలతో నిర్మించారు. కుడాచీలో మఖ్దూమ్ షా వలీ దర్గా, షేఖ్ ముహమ్మద్ సిరాజుద్ – దిన్ పిర్దాదీ మజర్‌ను దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు. విజయనగరం, హంపీ శిథిలాల్లో దేవస్థాన శకలాలను వినియోగించి మసీదు, ఇద్గా నిర్మితమయ్యాయి.

బీదర్‌లో పురాతన హిందూ నగరం ఒక ముస్లిము రాజధానిగా రూపాంతరం చెందింది. సోలా ఖంబ మసీదు, జామి మసీదు, ముఖ్తర్ ఖాన్ మసీదు, ఇతర ముస్లిము నిర్మాణాలను దేవస్థాన శకలాలతో దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు.

చాళుక్యుల రాజధాని కళ్యాణి నగరం. ఈ నగరంలోని దేవస్థానాలను ధ్వంసం చేయడం కానీ మసీదులుగా రూపాంతరం చెందడం కానీ జరిగాయి. జామి మసీదు, మహల్లా షాపూర్‌లో మసీదు దేవస్థాన ప్రాంతాల్లో నిర్మితమయ్యాయి. బీజాపూర్ ఒకనాటి పురాతన హిందూ నగరంగా శోభిల్లుతుండేది. అది ఒక ముస్లిము రాజధానిగా రూపాంతరం చెందింది. జామి మసీదు, కరీముద్-దిన్ మసీదు, ఛోటా మసీదు దేవస్థాన శకలాలను ఉపయోగించి కానీ దేవస్థాన ప్రాంతాల్లో కానీ నిర్మితమయ్యాయి. మైసూరులోని టొన్నూర్‌లో దేవస్థాన శకలాలను వినియోగించి సయ్యీద్ సలార్ మసూద్ మజర్‌ను నిర్మించారు.

కేరళ
కేరళలోని కొల్లంలో జామి మసీదు, పాల్‌ఘాట్‌లోని కోటను దేవస్థాన శకలాలను వినియోగించి టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

 లక్షద్వీప్
లక్ష్మద్వీప్‌లో కల్‌పెనీలో ముహియుద్-దిన్-పల్లి మసీదును, కవరాటిలో ప్రొట్-పల్లి మసీదును దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు. ప్రస్తుతం లక్షద్వీప్ నూటికి నూరుశాతం ముస్లిము ప్రాబల్యానికి గురికావడం విశేషం.

మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో 151 ముస్లిము నిర్మాణాలను పుస్తకం ప్రస్తావించింది. భోపాల్‌లో ఒకప్పుడు సభామండల దేవస్థానం ఉన్న ప్రాంతంలో ఖుడ్సియా బేగమ్ జామి మసీదును నిర్మించింది. దామోహ్‌లో ఒకప్పటి దేవస్థాన ప్రాంతంలో ఘజీ మియా దర్గా నిర్మితమైంది. భోజ రాజు పరంపరకు రాజధానిగా విలసిల్లిన ధర్ ఒక ముస్లిము రాజధానిగా రూపాంతరం చెందింది. కమల్ మౌలా మసీదు, లట్ మసీదు, అబ్దుల్లా షా ఛంగల్ మజర్‌ను దేవస్థాన శకలాలతో దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు.

పురాతన హిందూ నగరమైన మండు ఒక ముస్లిము రాజధానిగా రూపాంతరం చెందింది. జామి మసీదు, దిలావర్ ఖాన్ మసీదు, ఛోటీ జామి మసీదు దేవస్థాన శకలాలతో దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు. బుధి ఛందేరి శకలాలతో ఛందేరి అనే ముస్లిము నగరం నిర్మితమైంది. మోతి మసీదు, జామి మసీదును దేవస్థాన శకలాలతో నిర్మించారు. గ్వాలియర్‌లో మహమ్మద్ గౌస్ దర్గా, జామి మసీదు, గణేష్ గేటు సమీపంలో మసీదును దేవస్థాన ప్రాంతాల్లో నిర్మించారు.

మహారాష్ట్ర
మహారాష్ట్రలో 143 ముస్లిము నిర్మాణాలను గుర్తించారు. అలా నిర్మించిన వాటిలో అహ్మద్‌నగర్‌లో దేవస్థాన శకలాలతో నిర్మించిన అంబా జోగి కోట
ఒకటి. గోఘ్‌లో 1395లో దేవస్థాన ప్రాంతంలో ఈద్గాను నిర్మించారు. అకోట్‌లో 1667లో దేవస్థాన ప్రాంతంలో జామి మసీదును నిర్మించారు. కరంజ్‌లో 1659లో దేవస్థాన ప్రాంతంలో అస్తాన్ మసీదును నిర్మించారు. రిత్‌పూర్‌లో ఔరంగజేబు ఆధ్వర్యంలో ఒక దేవస్థాన ప్రాంతంలో జామి మసీదును నిర్మించారు. ఖుల్దాబాద్‌లో 1339లో ఒక దేవస్థాన ప్రాంతంలో హజరత్ బుర్హానుద్-దిన్ గరీబ్ ఛిస్తీ దర్గా నిర్మితమైంది.

ముంబైలో మహాలక్ష్మి దేవస్థానం మయినా హజ్జమ్ మజర్‌గా రూపాంతరం చెందింది. ముంబైలోని జామి మసీదు ఒక దేవస్థాన ప్రాంతంలో నిర్మితమైంది. పరండాలోని తలవ్ సమీపంలోని మనకేవర దేవస్థానం నమాజ్‌గా గా రూపాంతరం చెందింది. లాతూరులో మీనాపురి మాత దేవస్థానం మబ్సు సాహిబ్ దర్గా గా, సోమెవర దేవస్థానం సయ్యీద్ ఖాద్రీ దర్గా గా, పవునార్‌లో రామచంద్ర దేవస్థానం ఖదీమీ మసీదుగా రూపాంతరం చెందాయి.

ఒడిశా
ఒడిశాలో 12 ముస్లిము నిర్మాణాలను గుర్తించారు. బలేశ్వర్‌లోని మహల్లా సున్‌హట్‌లో జామి మసీదును శ్రీ చండి దేవస్థాన ప్రాంతంలో నిర్మించారు. కటక్‌లో షాహీ మసీదు, ఒడియా బజార్‌లో మసీదులు, కేంద్రపరాలో మసీదు దేవస్థానాల ప్రాంతాల్లో నిర్మితమయ్యాయి.

పంజాబ్
పంజాబ్‌లో 14 ముస్లిము నిర్మాణాలను గుర్తించారు. బటిండాలో ఒక దేవస్థానం బాబా హజీ రత్తన్ మజర్‌గా రూపాంతరం చెందింది. జలంధర్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒక బౌద్ధ విహారంపై బాద్‌షాహీ సరాయి నిర్మితమైంది. లుధియానాలోని ఒక దేవస్థాన ప్రాంతంలో అలీ సర్‌మస్త్ దర్, మసీదు నిర్మితమయ్యాయి. పాటియాలాలోని బహదూర్‌గఢ్‌లోని కోటలో మసీదు ఒక దేవస్థాన ప్రాంతంలో నిర్మితమైంది.

రాజస్థాన్
రాజస్థాన్‌లో 170 ముస్లిము నిర్మాణాలను పుస్తకంలో ప్రస్తావించారు. ఒకప్పుడు హిందూ రాజధానిగా విలసిల్లిన అజ్మేర్ ఒక ముస్లిము నగరంగా రూపాంతరం చెందింది. 1199 నాటి అధాయి-దిన్-కా-జోన్‌ప్రా, 1236 నాటి మొయినుద్-దిన్ ఛిస్తీ దర్గా, తదితర మసీదులు దేవస్థానాల ప్రాంతాల్లో దేవస్థాన శకలాలతో నిర్మితమయ్యాయి. తిజారాలో ఒక దేవస్థానం బర్తారీ మజర్‌గా రూపాంతరం చెందింది. బయానాలో ఉషా దేవస్థానం నోహారా మసీదుగా రూపాంతరం చెందింది. విష్ణు దేవస్థానపు శకలాలతో భితారి-బహారీ మహల్లా మసీదు నిర్మితమైంది.

కామాన్‌లో కామ్యకేశ్వర్ దేవస్థానం చౌరాసి ఖంబ మసీదుగా రూపాంతరం చెందింది. జాలోర్‌లో 1323లో నిర్మితమైన టోప్‌ఖాన్ మసీదు నిర్మాణంలో పర్వంత దేవస్థానపు శకలాలను వినియోగించారు. షేర్ షా సూరి కోట షేర్‌గఢ్ నిర్మాణానికి హిందూ, బౌద్ధ, జైన దేవస్థానాల శకలాలను వినియోగించారు. లోహర్‌పురాలోని ఒక దేవస్థాన ప్రాంతంలో పీర్ జహిరుద్దీన్ దర్గా నిర్మితమైంది. సలావ్‌తన్‌లో 1625లో ఒక దేవస్థాన ప్రాంతంలో మసీదు నిర్మితమైంది. నాగపూర్‌లో దేవస్థానాలకు చెందిన ప్రాంతాల్లో పీర్ జహీరుద్దీన్ మజర్, బాబా బద్ర్ దర్గా నిర్మితమయ్యాయి.

తమిళనాడు
తమిళనాడులో 175 ముస్లిము నిర్మాణాలను పుస్తకం ప్రస్తావించింది. చెంగల్‌పట్‌లోని ఆచార్వక్‌లో ఒక దేవస్థానపు ప్రాంతంలో షా అహ్మద్ మజర్ నిర్మితమైంది. కోవలమ్‌లోని ఒక దేవస్థానపు ప్రాంతంలో మాలిక్ బిన్ దినార్ దర్గా నిర్మితమైంది. పంచ పద్మాలయ పర్వతం మౌలా పహాడ్‌గా నామాంతరం చెందింది. ఒక గుహలోని పురాతన దేవస్థానానికి చెందిన కేంద్ర ఆవరణం మసీదుగా రూపాంతరం చెందింది. కోయంబత్తూరులో అన్నామలై కోటకు మరమ్మతుల కోసం దేవస్థాన శకలాలను టిప్పు సుల్తాన్ వినియోగించాడు. టిప్పు సుల్తాన్ మసీదు ఒక దేవస్థానపు ప్రాంతంలో నిర్మితమైంది.
తిరుచిరాపల్లిలోని ఒక శివాలయం నాదర్ షా వలీ దర్గాగా రూపాంతరం చెందింది. దేవస్థానంలోని శివ లింగాన్ని దీప స్తంభంగా వినియోగించారు.

ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లో దేవస్థానాలకు చెందిన ప్రాంతాల్లో లేదా దేవస్థానపు శకలాలతో నిర్మితమైన 299 ముస్లిము నిర్మాణాలను పుస్తకం ప్రస్తావించింది. ఆగ్రాలో కలాన్ మసీదు దేవస్థానపు శకలాలతో నిర్మితమైంది. అక్బర్ కోటలో నదీముఖంగా ఉన్న నిర్మాణాన్ని జైన మందిరాలకు చెందిన ప్రాంతంలో నిర్మించారు. అక్బర్ మఖ్‍‌బారా ఒక దేవస్థానపు ప్రాంతంలో నిర్మితమైంది. అలహాబాద్‌లో అక్బర్ కోట దేవస్థానాలకు చెందిన ప్రాంతాల్లో నిర్మితమైంది. మియా మఖ్బూల్, హుస్సేన్ ఖాన్ షహీద్ మజర్ దేవస్థానాలకు చెందిన ప్రాంతాల్లో నిర్మితమయ్యాయి. పత్తర్ మహల్లాలో లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం మసీదుగా రూపాంతరం చెందింది.

అయోధ్యలో రామజన్మభూమి దేవస్థానపు ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మితమైంది. వివాదాస్పద కట్టడపు కూల్చివేత అనంతరం అదే ప్రాంతంలో భవ్యమైన రామ మందిరం నిర్మితమవుతున్నది. స్వర్గద్వార దేవస్థానం, త్రేత కా థాకూర్ దేవస్థానాలను కూల్చివేసిన ఔరంగజేబు వాటికి బదులుగా మసీదులను నిర్మించాడు.

షా జురన్ ఘోరీ మజర్‌ ఒక దేవస్థానపు ప్రాంతంలో నిర్మితమైంది. బుద్ధుడి పాదముద్రలతో కూడిన ఒక బౌద్ధ మందిరం వద్ద సర్ పైగంబర్, అయూబ్ పైగంబర్ మజర్లు నిర్మితమయ్యాయి. గోరఖ్‌పూర్‌లోని ఒక దేవస్థానపు ప్రాంతంలో ఇమామ్‌బరా నిర్మితమైంది. అదే విధంగా, కర్బాలాలో ఒక బౌద్ధ స్థూపానికి చెందిన శిథిలాలపై పావా నిర్మితమైంది.

లక్నోలోని ఒక దేవస్థానపు ప్రాంతంలో తిలేవాలీ మసీదు నిర్మితమైంది. మీరట్‌లో ఒక బౌద్ధ విహారానికి చెందిన శిథిలాలపై జమా మసీదు నిర్మితమైంది. నౌచాండీలో నవచండీ దేవీ ఆలయం ఒక దర్గా గా రూపాంతరం చెందింది. వారణాసిలో విశ్వేశ్వర దేవస్థానపు సామాగ్రిని వినియోగించి దేవస్థానపు ప్రాంతంలోని జ్ఞాన్‌వాపి వద్ద మసీదు నిర్మితమైంది. వివాదాస్పద నిర్మాణం వద్ద ఒక సర్వే చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశించింది. సర్వే జరిపిన బృందం అక్కడ ఒక శివలింగాన్ని కనుగొన్నది. అనంతరం న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు.

కనిపెట్టింది గోరంత.. కనిపెట్టాల్సింది కొండంత
పుస్తకంలో పేర్కొన్న ముస్లిము నిర్మాణాల జాబితా అసంపూర్ణమైనదిగా గోయెల్ అందులో రాశారు. అది కేవలం కుప్లమైన వివరణ మాత్రమేనని చెప్పారు.
“కట్టడాల పేర్లు, వాటిని నిర్మించిన ప్రాంతాలు, కట్టడాలను నిర్మించిన తేదీలను కచ్చితంగా కనిపెట్టడంలో మా వంతు కృషి చేశాము. అయినప్పటికీ, కొంత తప్పిదాలు, అయోమయం మిగిలిపోయి ఉండవచ్చు. ఒకే కట్టడానికి సంబంధించిన వేర్వేరు పేర్లను, వేర్వేరు తేదీలను భిన్నమైన వర్గాలు సమకూర్చడం సర్వసాధారణం. అనేక మంది ముస్లిము ఫకీర్లు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందారు. అది వారి మజర్లు లేదా దర్గాలను గుర్తించడంలో ఒకింత గందరగోళాన్ని సృష్టిస్తున్నది. కొన్ని జిల్లాలను కొత్తగా సృష్టించారు. కొన్ని జిల్లాలకు పేరు మార్చారు. గతంలో ఒక జిల్లాలోని ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పడి ఉంటుంది. కనుక ఇది (పుస్తకం) కేవలం ఒక సంక్షిప్తమైన సంగ్రహం మాత్రమే” అని గోయెల్ ఆ పుస్తకంలో రాశారు.

Source: OPINDIA