Home News ప్రాచీన సంప్రదాయాలలో ఒక భాగ‌మే ‘ఆధ్యాత్మిక’ – శ్రీ‌ దత్తాత్రేయ హోసబలే జీ

ప్రాచీన సంప్రదాయాలలో ఒక భాగ‌మే ‘ఆధ్యాత్మిక’ – శ్రీ‌ దత్తాత్రేయ హోసబలే జీ

0
SHARE

అస్సాం: అంతర్జాతీయ సాంస్కృతిక అధ్యయనాల కేంద్రం (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్-ICSS) ద్వారా “భాగస్వామ్య సుస్థిర సమృద్ధి” అనే అంశంపై ఏర్పాటు చేసిన 8వ సమ్మేళనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స‌ర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీ, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్ హాజరయ్యారు. భూమి, పక్షులు, మహాసముద్రం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ధన్యవాదాలు చెబుతూ ఉండే ఒక యజీదీ పెద్దల ప్రార్థనతో ముగింపు వేడుక ప్రారంభమైంది. ఐ.సి.సి.ఎస్ భారత చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ శశి బాలా వేదికపై ఆసీనులైన అతిథులకు, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. ఐ.సి.సి.ఎస్ అంతర్జాతీయ సమన్వయకులు దిగంత్ దాస్ సమ్మేళన సారాంశాన్ని వివరించారు. ఈ సమ్మేళనంలో 33కు పైగా దేశాలకు చెందిన 125 మంది విదేశీ ప్రతినిధులు తమ ప్రాచీన సంప్రదాయ పరిజ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్నారు. విభిన్న సాంప్రదాయాలతో జనవరి 28న డిబ్రుగడ్ లో సుందరమైన ఊరేగింపు జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా దత్తాత్రేయ హోసబలే జీ మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్త ఉద్యమ‌ని ఆయన అన్నారు. ఇందులో ప్రధానమైన పదం సమృద్ధి అని సమృద్ధిని ఎక్కువ కాలం ఎలా కాపాడుకోవాలన్నదే ప్రశ్న అని భూమిని దోపిడీ చేసి సమృద్ధి పొందాల‌నుకోవ‌డం స‌రికాద‌న్నారు. సముద్ర మంథనానికి సంబంధించిన ఒక కథను ఆయన ఉదాహరించారు. చాలా కష్టమైన మంథనం తర్వాతే లక్ష్మీ అంటే సమృద్ధి దాని నుండి ఉద్భవించింద‌ని సమృద్ధి కోసం మంథనం అవసర‌మ‌న్నారు. ఈ సమ్మేళనంలో నాలుగు రోజులపాటు మంథనం చేశామ‌ని ఫలితంగా “అమృతం” వెలువడింద‌ని పేర్కొన్నారు. కథల ద్వారా మనకు లభించే సందేశం సమృద్ధి స్థిరంగా న్యాయపరంగా ఉండాన్నారు. ఆధ్యాత్మికత అనేది ప్రాచీన సంప్రదాయాలలో ఒక సాధారణ అంశమ‌ని, ప్రతి జీవిలో దైవత్వం ఉనికి కనిపిస్తోంద‌న్నారు. ప్రకృతి ప్రతి ఒక్కరికీ కావలసినంత అందిస్తుంద‌ని, ఇప్పుడు ఈ దేవతను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ఆధ్యాత్మికత అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు ఆత్మ అని, అన్ని సంస్కృతులలో సారూప్యతలు ఉన్నాయన్నారు. ప్రాచీన స్వదేశీ సాంప్రదాయాలు భూమిపై ఉన్న ఏకైక సాంప్రదాయాలు, ఇవి స్త్రీలలో దైవత్వాన్ని గుర్తించి కుటుంబ విలువలను, సాధారణంగా స్థిరమైన జీవనశైలిని నొక్కి చెబుతాయ‌న్నారు.. సుస్థిరత కోసం పూరకం చాలా అవసరమ‌న్నారు. సమ్మేళనానికి సంబంధించి వారు మూడు అనువర్తి బిందువులను నొక్కి చెప్పారు. మొదటిది దేశీయ సంప్రదాయం, సంస్కృతిని అలంకరించి సంగ్రహలయాల్లో భద్రపరచడానికి తయారు చేయలేదు. ఈ పురాతన జ్ఞానం, విశ్వాస వ్యవస్థలు భూమిపై నిరంతర జీవన సంప్రదాయాలు. వీటిని సామాజిక వ్యవస్థ ప్రధాన స్రవంతిలో ఉంచాలి, అంచులకు నెట్టబడకూడదు. రెండవది, వ్యక్తిగత, సామాజిక జీవనశైలి వేలాది సంవత్సరాలుగా స్వదేశీ సంస్కృతులచే ఉపయోగించబడుతోంది, కాబట్టి ఇది భూమాతను రక్షించడానికి ఏకైక మార్గమని ఖచ్చితంగా చెప్పవచ్చు. మానవత్వాన్ని రక్షించడానికి వీటి ఉనికి అవసరం. ఆ విధంగా ఈసారి పరీక్షించిన జ్ఞానాన్ని ఈ విలువల ఆధారంగా తదుపరి తరానికి అందించాలి, మరియు మూడవది ప్రతి సముదాయం పురోగతి, భౌతిక అభివృద్ధిని మెరుగుపరచడానికి దాని స్వంత సామర్ధ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంద‌ని, ఆధ్యాత్మికత అంటే అంతా ఒక్కటేనని, ప్రతి జీవిలో లేదా నిర్జీవిలో దైవత్వం ఉంటుందని సర్ కార్యవాహ అన్నారు. మన ప్రాచీన సంప్రదాయాలన్నీ ప్రతి దానిలో దైవత్వాన్ని చూస్తాయ‌ని, మనం కలిసికట్టుగా ఉండే జీవితాన్ని స్వీకరించి ఆచరిస్తామ‌న్నారు. మ‌న దేశంలో “శతహస్త సమాహార్ ,సహస్రహస్త సంకిర్‌ష అనే నానుడి ఉంద‌ని, వంద చేతులతో సంపాదించి వేయి చేతులతో పంచి పెట్టండి అని దీని అర్థమ‌ని మ‌నం సంపాదించిన దానికంటే పది రెట్లు ఎక్కువ వితరణ చేయాలనేది ఈ సదస్సు ముఖ్య సందేశేమ‌న్నారు.

అనంత‌రం అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు మాట్లాడుతూ సామరస్య సమాజాన్ని నిర్మాణం చేస్తామని ప్రకటించిన ఐ.సి.సి.ఎస్ ను అభినందించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉజ్వల స్థానాన్ని సాధించి ప్రపంచానికి మార్గాన్ని చూపుతోంద‌న్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో 26 గిరిజన తెగలు ఉన్నాయ‌ని, వారిలో చాలామంది శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. స్వదేశీ సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ విధాన‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. స్వదేశీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇటానగర్ లో కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి “డోని పోలో విమానాశ్రయం” అని పేరు పెట్టామ‌న్నారు. (డోని అంటే సూర్యుడు, పోలో అంటే చంద్రుడు అని అర్థం). ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో స్థానిక గిరిజన సంప్రదాయాలను పరిరక్షించేందుకు మూడు గురుకులాలను ఏర్పాటు చేశామ‌న్నారు. ఆదివాసీల కోసం ప్రతి సంవత్సరం యువ సమ్మేళనం నిర్వహిస్తుమ‌న్నారు. పూణేలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 20 మంది విద్యార్థులకు సహకారం అందజేశామ‌న్నారు. మరో 14 తెగల గురించి డాక్యుమెంటేషన్ జరుగుతోంద‌న్నారు. 3వేల మంది స్వధర్మ అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నామ‌న్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే 12 ఉత్పత్తులకు GI ట్యాగులను పొందింద‌ని, మరో పదహారు ఉత్పత్తుల కోసం దరఖాస్తులు చేశార‌ని తెలిపారు.