Home Ayodhya అయోద్య రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళ‌మిచ్చిన నిరుపేద మహిళ

అయోద్య రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష విరాళ‌మిచ్చిన నిరుపేద మహిళ

0
SHARE

ఆమె కూలి ప‌ని చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు కూడా ఏదో చిన్న వృత్తిలో ఉన్నాడు. ఆమె కుటుంబం చిన్నదైనా, ఆమె మనసు మాత్రం గొప్ప‌ది. ఒక నిరుపేద మహిళ తను కష్టపడి కూలి పని చేసి రూపాయి రూపాయిగా కూడబెట్టిన మొత్తం లక్ష రూపాయలను అయోధ్య రామమందిర నిర్మాణ నిధికి సమర్పించి త‌న భ‌క్తిని చాటుకుంది. ఆమె ధనానికి పేదరాలే కానీ దాతృత్వానికి కాద‌ని నిరూపించింది.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోదికొండపైనున్న రామాలయంలోని శ్రీరామచంద్రుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన సంగతి పాఠకులకు విదితమే. ఆ దేవాలయ సందర్శనార్థం కర్ణాటకలోని సుప్రసిద్ధ ఉడిపి పెజావర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ఇక్క‌డికి వ‌చ్చారు. ఆ సందర్భంగా విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరానికి చెందిన శ్రీమతి అన్నపూర్ణమ్మ, స్వామీజీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి తన వంతు నిధిగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

Source : VSK ANDHRA