Home News RSS ABKM 2016 – శుభారంభం – కేరళలో రాజకీయ హత్యలపై చర్చలు

RSS ABKM 2016 – శుభారంభం – కేరళలో రాజకీయ హత్యలపై చర్చలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు

అన్నోజీగూడ, హైదరాబాదు.

                                     23- అక్టోబర్-2016

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు, శ్రీ విద్యా విహార్, అన్నోజీగూడలో అక్టోబర్ 23వ తేది ఉదయం 8:30 నిమిషాలకి ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్, డా. శ్రీ మోహన్ జి భాగవత్ సమావేశాలను జ్యోతి ప్రజ్వలన తో ప్రారంబించారు. సర్ కర్యవాహ శ్రీ భయ్యాజీ జోషి వీటికి అధ్యక్షత వహిస్తారు. దేశం నలుమూలల నుండి  విచ్చేసిన సంఘ్ సీనియర్ కార్యకర్తలు మరియు వివిధ క్షేత్రాలకు చెందిన 396 మంది జాతీయ పదాధికారులు పాల్గొన్నారు.

[column-group]

[column]

jyotiprajwalan

[/column]

[column]

jyotiprajwalan2

[/column]

[/column-group]

ఈ సందర్భంగా మీడియాని ఉద్దేశించి సహ సర్ కార్యవాహ శ్రీ వి. భాగయ్య గారు మాట్లాడుతూ మూడు రోజులు పాటు జరిగే ఈ సమావేశాలలో సంఘ కార్య విస్తరణ, సమాజ వికాసానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు – విద్య, కార్మిక, వనవాసి, సాంస్కృతిక, ధార్మిక క్షేత్రాలలో జరుగుతున్న పని తీరుపై సమీక్ష జరుగుతుందన్నారు.

_s8a6188-1024x683

అదే విధంగా ఆర్.ఎస్.ఎస్ రెండు తీర్మానాలపై చర్చ చేపడుతుంది అని అన్నారు. వాటిలో ఒకటి కేరళలో సంఘ్, వివిధ క్షేత్రాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇతర హిందూ సంఘటనల కార్యకర్తలపై రాజకీయ పరంగా కమ్యూనిష్టులు చేస్తున్న హత్యలు, దాడులను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తామని చెప్పారు.

ప్రపంచ సర్వతోముఖాభివృద్దికై భారతీయ విలువలతో కూడిన “ఏకాత్మతామానవ దర్శన్” అనే తత్వశాస్త్రాన్ని ప్రతిపాదించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ గారి శత జయంతి ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నామని అన్నారు. తదనుగుణంగా సమాజంలో ఏకాత్మత, సమరసత సాధించటానికి స్వయంసేవకులు అనేక కార్యక్రమాలు చేపడుతూ విశేష కృషి చేస్తున్నారు అని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జిహాది మూకలు చేస్తున్న దాడులు, ఇటివల పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందువులే లక్ష్యంగా చేస్తున్న దాడులు, ఆస్తుల విధ్వంసం పై చర్చ జరుగుతుందన్నారు. ముఖ్యంగా షెడ్యుల్డు కులాల (దళిత) మహిళలపై ముస్లింల ద్వారా జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తున్నామని చెప్పారు. ఇటివలే కలకత్తా హై కోర్ట్ స్పందిస్తూ “హిందువుల ప్రాథమిక హక్కులను భంగపరుస్తూ  మైనారిటీ వర్గాల పట్ల సంతుష్టికరణ చేయద్దు” అని ప్రభుత్వాన్ని హెచ్చరించిది అని కూడా అన్నారు.

Bhagaiahji at RSS ABKMఆర్.ఎస్.ఎస్ దేశవ్యాప్తంగా సామజిక సమరత విషయంలో హిందువులు అందరికి ఆలయ ప్రవేశం, నీటి వనరుల పై సమాన హక్కు, ఉమ్మడి స్మశాన వాటికల వినియోగం పై సర్వే చేస్తుంది అని తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇప్పటివరకు 489 గ్రామాలలో జరిపిన సర్వే ప్రకారం 431 గ్రామాలలో అందరికి ఆలయ ప్రవేశం, 475 గ్రామాలలో నీటి వనరులపై బేధాభిప్రాయాలు లేవని తేలింది అని చెప్పారు.  తెలంగాణాలోని నల్గొండ, పాలమూరు జిల్లాలో గతంలో ఉన్న రెండు గ్లాసుల వ్యవస్థను సంఘ్ స్వయంసేవకులు మిగితా గ్రామ పెద్దలతో కూర్చొని చర్చించిన తరువాత అందరి సహకారంతో అలాంటి గ్రామాలలో ఎలాంటి వివక్ష లేకుండా చేయడం జరిగింది అని తెలిపారు.

RSSABKM Glimpse

రాజ్యాంగ పరంగా మన సమాజంలో షెడ్యుల్డ్ కులాలు/ తెగలు/సంచార జాతుల వారికి లభించిన హక్కులు, సాధికారితతో పాటు, పరిపాలనలో వారికి భాగస్వామ్యం కొరకు సమాజాన్ని చైతన్యం చేసే పనిని స్వయంసేవకులు చేస్తున్నారు అని శ్రీ భాగయ్య గారు తెలిపారు.

ప్రపంచంలో ప్రస్తుతం పర్యావరణ పట్ల ఉన్న దోపిడీ విధానం పోవాలని, పర్యావరణ పరిరక్షణ కూడా హిందూ జీవన విధానంలో భాగమని దాని ఆవశ్యకత పై గూడా చర్చ జరుగుతుంది అని, అందుకోసం స్వయంసేవకులు పని చేస్తున్నారని కూడా తెలిపారు.