RSS అఖిల భారతీయ కార్యకారి మండల్ ఆమోదించిన తీర్మానాల సంక్షిప్త రూపం
RSS అఖిల భారతీయ కార్యకారి మండల్ ఆమోదించిన రెండు తీర్మానాలను శ్రీ విద్య విహార్ స్కూల్, అన్నోజిగూడ, హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య గారు మరియు అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నంద కుమార్ గారు విలేకరుల ను ఉద్దేశించి మాట్లాడారు. కేరళ ప్రాంత సంఘచాలక్ శ్రీ బలరాం గారు కూడా సమావేశంలో వున్నారు.
రేపు RSS సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి విలేకరుల సమావేశంలో ఉంటారు.
తీర్మానాల సంక్షిప్త రూపం:
1. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఏకాత్మ మానవ దర్శనం ఏకైక పరిష్కారం
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లకు భారతీయ జీవనమూల్యాల ఆధారంగా రూపు దిద్దుకున్న ఏకాత్మ మానవ దర్శనం ఏకైక పరిష్కారం అని RSS అఖిల భారతీయ కార్యకారి మండల్ విశ్వసిస్తుంది. పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనం ఇటు మానవులు అటు ప్రాణికోటి ఎదురుకొంటున్న సమస్యలకు పరిష్కారం సూచిస్తుంది.
1992లో రియోడిజినోరియో లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన పృద్వి సదస్సుకు 172దేశాలు ప్రపంచ శాంతికి సమీకృత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని అంగీకరించాయి. ఐతే ఈ లక్ష్యాలకు దూరంగా ప్రపంచం పయనిస్తోంది. 2015లో జరిగిన పారిస్ సదస్సులో భూతాపాన్ని నియంత్రిస్తామని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. పై లక్ష్యాలను సాధించటానికి ప్రపంచ దేశాలన్నీ వినియోగ వాదాన్ని తగ్గించుకొని సమీకృత అభివృద్ధికి కృషి చెయ్యవలసిన అవసరం వుంది. కుటుంబం,సమాజము, ప్రకృతి వీటి మధ్య సమతుల్యం పాటిస్తే ఎటువంటి సంఘర్షణ లేకుండా మానవాళి శాంతియుత జీవనం కొనసాగిస్తుంది.
ఈ ఏడాది పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సంవత్సరం. అదే విధంగా దీన దయాళ్ జీ ఏకాత్మ మానవ దర్శనం ప్రవంచించి 50సంవత్సరాలు పూర్తి అవుతాయి. ప్రస్తుత పరిస్థితులలో స్వయంసేవకులతో సహా పౌరులు, రాష్ట్రప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం ఏకాత్మ మానవ దర్శనం సిద్ధాంతం ఆధారంగా సమాజ వికాసానికి, అభివృద్ధికి కృషి చెయ్యాలని అఖిల భారతీయ కార్యకారి మండల్ పిలుపునిస్తుంది.
2.CPI(M) నిరంతరం చేస్తున్న దాడులను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది
కేరళలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై మరియు ఇతరులపై CPI(M) నిరంతరం చేస్తున్న దాడులను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. కేరళ రాష్ట్రంలో 1940 ల లో అర్ ఎస్ ఎస్ పని ప్రారంబం అయిన నాటి నుండి వామపక్ష వాదులు, ముఖ్యంగా సిపిఐ (ఎం)కార్యకర్తలు ఆర్.ఎస్.ఎస్ పై నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. కేరళ రాష్ట్రంలో ఆర్ ఎస్ ఎస్ యొక్క ప్రభావం పెరుగుతున్న కొద్ది ఆర్ ఎస్ ఎస్ ను సమూలంగా నాశనం చేయాలనీ భావించిన సి పి ఎం సంఘ శాఖలపై,సంఘ కార్యకర్తలపై దాడులు ప్రారంబించినది. 28 ఏప్రియల్ 1969 నాడు శ్రీ వడిక్కలు రామకృష్ణన్ అనే 19 సం. ల సంఘ్ స్వయంసేవక్ ను CPI (M) కార్యకర్తలు పట్ట పగలు అతి దారుణంగా నడి రోడ్డు పై హత్య చేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆనాటి హత్య కేసులో ప్రథమ ముద్దాయి ఈనాటి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్ కావడం . హత్యలతో భయబ్రాంతులను చేసి సంఘ పురోగమనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన CPI (M) ప్రయత్నాలు సంఘ ప్రగతిని ఏ మాత్రం అడ్డుకోలేక పోయాయి. 1980 లలో మోహన్ అనే కార్యకర్తని దారుణంగా హత్య చేసారు. ఆ సంఘటన సమయానికి కేవలం రెండు సంవత్సరాల వయసున్న అతని కూతురు నివేదిత పెద్దయ్యాక ఒక మండల కార్యవాహ అయిన సంఘ కార్యకర్తని పెళ్లాడగా, CPI (M) కార్యకర్తలు ఆమె ఇంటిపై పోలీసుల సమక్షంలో దాడి చేసి ఇంటిలో వారందరినీ విచక్షణా రహితంగా గాయ పరిచారు. సంఘ వృద్ధిని సహించలేని కమ్యూనిస్టులు ఒకరి తర్వాత ఒక సంఘ కార్యకర్తని హత్య చేయడం మొదలు పెట్టారు. కేవలం ఒక కన్నూర్ జిల్లాలోనే 82 మంది స్వయంసేవకులను చంపివేసారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. సంఘ కార్యకర్తల పై దాడి చేసి హత్య చేయడం, లేకపోతే తీవ్రంగా గాయపరచి వారి భ్రుతిని దెబ్బతీయడం లాంటి పనులతో కమ్యూనిస్టులు భయోత్పాతాన్ని సృష్టించారు.
ప్రస్తుత కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. పార్టీ, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కమ్యూనిస్టులను వ్యతిరేకించిన వారందరి పైన అకృత్యాలకు ఒడిగట్టడం మొదలు పెట్టారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే కేవలం ఐదు గంటల వ్యవధిలో పోలీసులు 55 కేసులు CPI (M) కార్యకర్తలపై నమోదు చేయవలసి వచ్చిందంటే అకృత్యాలు ఏ మేర జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. గత ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు సంఘ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. కమ్యూనిజాన్ని వదిలి సంఘ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై సంఘలో చేరుతున్న కమ్యూనిష్టులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి అసహిష్ణుతను సభ్య సమాజం ఖండించడం తో పాటు, ప్రజలను జాగృత పరిచే మీడియా దృష్టి సారించి ఇటువంటి ఆకృత్యాలను అంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించాలని అఖిల భారతీయ కార్యకారి మండల అపేక్షిస్తోంది.