Home News హ‌ర్యానాలో మార్చి 12 నుండి 14 వ‌ర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌తినిధి స‌భ‌లు

హ‌ర్యానాలో మార్చి 12 నుండి 14 వ‌ర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌తినిధి స‌భ‌లు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) ఈ సంవత్సరం మార్చి 12 నుండి 14 వరకు హర్యానాలోని పానిపట్ జిల్లాలోని సమల్ఖాలో వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. సంఘ్ గ‌త సంవత్సరం (2022-23) కార్యకలాపాలను సభ సమీక్షిస్తుంది. తదుపరి సంవత్సరం (2023-24) కోసం వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది.

మూడు రోజుల సమావేశంలో కార్యకర్త నిర్మాణం, వారి శిక్షణ, అలాగే RSS శిక్షా వర్గ‌ల ప్రణాళిక నిర్వహణ గురించి చర్చిస్తారు. సంఘం శతాబ్ది-సంవత్సర విస్తరణ ప్రణాళిక, కార్యక్రమాలు, చర్యలను బలోపేతం చేయడంపై కూడా స‌మావేశాల్లో ఆలోచన చేస్తారు. అలాగే దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు ఈ సమావేశంలో చేయనున్నారు.

RSS స‌ర్ సంఘ‌చాల‌క్ డా. మోహన్ భగవత్ జీ, సర్ కార్య‌వాహ‌ దత్తాత్రేయ హోసబాలే జీ, సహ కార్యవాహులందరూ సమావేశాల్లో పాల్గొన‌నున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు, జోనల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని విభాగ్ ల ప్రచారక్‌లు, వివిధ RSS ప్రేరేపిత సంస్థల ప్ర‌తినిధులు కూడా సమావేశంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,400 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.