Home News VIDEO: జ్ఞానం, శీలం, ఏకతల త్రివేణి సంగమం ఎబివిపి

VIDEO: జ్ఞానం, శీలం, ఏకతల త్రివేణి సంగమం ఎబివిపి

0
SHARE

వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం, ‘జ్ఞానం, శీలం, ఏకత’ లు శ్వాసగా మెరికలైన విద్యార్థుల రూపకల్పన లక్ష్యంగా.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్భవించింది. 1948 జులై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయం లో కేవలం ఐదుగురు విద్యార్థులతో స్థాపించబడింది. నేడు దేశంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా అవతరించింది ఎబివిపి. కుల, వర్గ, వర్ణాలకు అతీతంగా విద్యార్థులందరి నడుమ ఒక వారధిగా విద్యార్థి పరిషత్ పనిచేస్తున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో సోకాల్డ్ ఉదారవాదులు, వామపక్ష మేధావులు, అనుబంధ విద్యార్థి సంఘాలు యాకుబ్ మెమెన్, మక్బూల్ భట్ ఆశయ సాధన కోసం పని చేస్తుంటే.. స్వామి వివేకానంద – అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఎబివిపి కృషి చేస్తున్నది.