జనవరి 25, 2023 నుండి 30 జనవరి 2023 వరకు, అఖిల భారత హిందూ గోర్బంజారా, లబానా-నాయక్దా సమాజ్ కుంభమేళ జల్గావ్ జిల్లాలోని జామ్నేర మండలంలోని గోద్రీ గ్రామంలో నిర్వహించారు. భారతదేశం అంతటా స్థాపించబడిన హిందూ గోర్బంజారా, లబానా-నాయక్డా సంఘాలను సమీకరించడంతో పాటూ, సనాతన ధర్మం విశిష్టత, యోగ్యమైన దిశానిర్దేశం, స్పూర్తిని అందరికీ అందించడానికి ఈ కుంభమేళ నిర్వహించారు.
విషయ ప్రస్థావన :
గతకొన్నేళ్లుగా క్రైస్తవమిషనరీలు బంజారా సమాజాన్నితప్పుదోవపట్టించి, అసత్య ప్రచారం చేస్తూ, వారిని ఒప్పించి మతంమార్చేస్తున్నారు. బంజారా సమాజ చరిత్ర, సంస్కృతి, మతం, సంప్రదాయాలపై అనేక అసత్య ప్రచారాలు, వాటిని ప్రచారం చేసేందుకు సంఘ వ్యతిరేకశక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా వాటిని తిప్పికొట్టాలంటే హిందూధర్మాన్నిరక్షించే గొప్ప సప్తసింధువు, వేలసంవత్సరాల చరిత్ర కలిగిన, హిందూ గోర్బంజారా, లబానా నాయక్దాలను మేల్కొల్పడం, సుసంపన్నం చేయడం ద్వారా, అటువంటి సంప్రదాయాలు, సంస్కృతిని అనుసరించే సమాజం నిర్మాణం చేయడం ద్వారా సమాజం సర్వతోముఖపురోగతి సాధ్యమవుతుంది. ఈ చారిత్రాత్మక కుంభమేళ మహారాష్ట్ర గడ్డపై నిర్వహించారు.
ప్రాధాన్యత :
పైన పేర్కొన్న దాని ప్రకారం మిషనరీల కుట్రల వల్ల బంజార సమాజానికి కలిగే సాంస్కృతిక, సామాజిక హానిని అరికట్టడానికి ధర్మజాగరణ సమన్వయ్ ద్వారా ఈ విషయాలన్నింటినీ బంజారా సమాజంలోని ప్రముఖ సాధువులు, మత పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. బంజారా సమాజంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలోదాదాపు 11500 తాండాలుఉన్నాయి. వీటిలో తెలంగాణలోని 3600 తాండాలపై క్రైస్తవుల ప్రభావం ఉంది. మహారాష్ట్ర, కర్నాటకలో అనేక తండాలను మతం మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరాఠ్వాడాలోని కొన్ని తాండాల వద్ద చర్చిలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ తీవ్రమైన సమస్యలనువారి మతపెద్దలతో చర్చించిన తర్వాత, బంజారా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి తగిన దిశానిర్దేశం చేసేందుకు ప్రముఖ సాధువులు, మతపెద్దలు బంజారా సంఘం నేతృత్వంలో ఈ కుంభమేళ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో 18 క్రైస్తవ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి యూస్, ఇతర విదేశీ సంస్థల నుండి ప్రత్యక్ష సహాయాన్ని పొందుతున్నాయి. గ్లోబల్ బంజారా బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ (GBBMI) సంస్థ ప్రతి బంజారా గ్రామం లేదా పట్టణంలో కనీసం ఒక ఇంటిని క్రైస్తవంగా మార్చాలనీ, ప్రతి బంజారా గ్రామంలో చర్చిని అంటే వారి ప్రార్థన కేంద్రాన్నిస్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలలు, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, సేవా కార్యక్రమాల ద్వారా బంజారా సమాజాన్ని చేరుకోవడానికి , వారిని క్రైస్తవులుగా మార్చడానికి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే చురుకుగా పనిచేస్తూ ఉన్నాయి.
1999 లో, పోప్ జాన్ పాల్ ఢిల్లీని సందర్శించినప్పుడు, “మొదటిసహస్రాబ్దిలో (వెయ్యిసంవత్సరాలలో) మనం యూరప్ మొత్తాన్ని, రెండవ సహస్రాబ్దిలో ఆఫ్రికా, మూడవ సహస్రాబ్దిలో ఆసియాఖండాన్ని క్రైస్తవీకరించాలి. “ఇదిమనందరి లక్ష్యం. మనం భారతదేశం నుండి ప్రారంభించాల్సిన లక్ష్యం ఇది అంటూ ప్రసంగించారు. అప్పటినుండి భారతదేశంలోని క్రైస్తవ మిషనరీసంస్థలు హిందూ సమాజంలోని కొన్నిభాగాలను క్రమపద్ధతిలో మార్చాయి. గోర్బంజారా, లబానా మరియు నాయక్డా సమాజం మతంమారడం ఈ దేశవ్యతిరేక కుట్రలో భాగమే అని చెప్పవచ్చు.
జనాభా నేపథ్యం :
దేశంలో 1872 నుండి జనాభా గణన నునిర్వహిస్తున్నారు. ప్రతి పదేళ్లకోసారి జనాభాగణన జరుగుతుంది. 2021 లో జరిగిన జనాభాగణన 16వది. 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రైస్తవులజనాభా 2.3%. ఉంది. కానీ దేశంలో హిందూ సమాజంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది హిందువులు తమ హిందూ విశ్వాసాన్ని వదిలి క్రైస్తవాన్ని అవలంబిస్తున్నారు. కాబట్టి దేశంలోక్రైస్తవ జనాభా అనేది 9% వరకు ఉంటుంది అని అంచనా. ఈ మతమార్పిడుల వల్ల కొన్ని చోట్ల హిందువుల జనాభా తగ్గుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా 90% కంటేఎక్కువ క్రైస్తవ జనాభా ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో క్రైస్తవ మతమార్పిడి శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆంధ్రా, పంజాబ్ వంటి రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి. ఈ మొత్తం అంశాన్ని పరిశీలిస్తే, క్రైస్తవుల (క్రిప్టోక్రిస్టియన్స్) జనాభా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఎన్నో ఏళ్లుగా ఈ దేశంలో విదేశీసొమ్ముతో మతమార్పిడి ఆటసాగుతోంది. ఇందులో భాగంగా బంజారా, లబానా, నాయక్డాసంఘాలు మతమార్పిడులకు గురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో హిందూగోరేబంజారా, లబానా, నైక్డా కమ్యూనిటీలు 11,591 వేలు ఉన్నాయి. వాటిలో 3678 క్రైస్తవ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. బంజారా సమాజానికి చెందిన సాధువులు, గురువులు వివిధ తాండాలను సందర్శించడం ద్వారా ఈ భయంకరమైన సత్యాన్ని స్వయంగా ధృవీకరించారు.
ORP & RNS :
జనాభా లెక్కల ప్రకారం, అందులో రెండు అంశాలు ఉన్నాయి. దీనిలో ఒక పాయింట్ ORP (అదర్ రిలిజియన్ పర్స్యుయేషన్) అంటే ఇతర మతాల అనుచరులు అని అర్థం. అంటే రాజ్యాంగం గుర్తించిన మతాల్లోంచి ఒక్కో మతాన్ని ఎంచుకోవాలి. దీంతో దేశంలో మరో మతానికిడిమాండ్రుగుతోంది.
రెండవ పాయింట్ RNS (మతం చెప్పబడ లేదు). అంటే మనకు మతం లేదు అని అర్థం. ఈ రెండు అంశాల ఆధారంగానే 3500 వనవాసీల కులాల్లో గొడవలు, అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని వల్ల సమాజంలో “మేము హిందువులం కాదు” అని రాసేవారి సంఖ్య తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది భారతదేశానికి ప్రాణాంతకం.
ఈ రెండు పాయింట్లను ఆధారంగా చేసుకుని 2001 నుంచి 2011 జనాభా లెక్కల సమయంలోనే వారు మతమార్పిడులకు కుట్రచేశారా అనే అనుమానం కలుగుతోంది. అందుకే గోర్బంజారా సమాజంలో రెండు పెద్ద సవాళ్లు వచ్చాయి. ఒకటి క్రైస్తవ మతం ప్రచారం ఎలా అడ్డుకోవడం అనేది ఒకటైతే, మరొకటిమన ధర్మం యొక్క ప్రాధాన్యత ఎలా చెప్పడమనేది.
తెలంగాణ, విదర్భ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మతమార్పిడులు బాగా పెరిగిపోయి మహారాష్ట్రలో బంజారాలు హిందువులు కాదని, వారిది దైవమతమని ప్రచారంప్రారంభించారు. అందుకే బంజారా సమాజంలోని గౌరవనీయులైన సాధువులు, పెద్ద మనుషులు చొరవ తీసుకుని కుంభమేళ చేయాలని నిర్ణయించుకున్నారు.
నిర్వాహణ :
బంజారా కమ్యూనిటీకి చెందిన సాధువు, మతనాయకుడు పరమ పూజ్యనీయ శ్రీ.బాబుసింగ్జీ మహరాజ్ (ధర్మగురు, పోహ్రగడ), పరమ పూజ్యనీయ మహంత్ 1008 శ్రీరాంసింగ్ జీ మహారాజ్ (కాలుబాబా దేవస్థానం, తెలంగాణ), పరమ. పూజ్యనీయ 1008 శ్రీ చంద్రసింగ్ జీ మహారాజ్ (శ్రీ గురుసాహిబ్ధామ్, మలాజ్‌పూర్, మధ్యప్రదేశ్), ప. పూశ్రీగోపాల్ జీ చైతన్యమహారాజ్ (గడిపాటి, బృందావన్ధామ్, పాల్), ప. పూ శ్రీసురేశ్‌జీ మహారాజ్ (భగవత్కథకుడు, లబానా-నాయక్దా సమాజ్), పరమ పూజ్యనీయ శ్రీ శ్యామ్‌జీ చైతన్య మహారాజ్ (ఛైర్మన్, స్టీరింగ్కమిటీగోద్రి) తదితరులతో పాటుగా ఈ కుంభమేళ నిర్వహణ కోసం సాధువులు, మహాత్ములు కృషిచేశారు. సాధువులు, పెద్దమనుషులందరూ కలిసి వివిధ వనవాసీ ప్రాంతాలకు వెళ్లి వారి మొత్తం సమాజాన్ని కుంభమేళానికి ఆహ్వానించారు.
కుంభమేళ జరిగిన స్థలం :
గోద్రీ’ లో ఈ కుంభమేళ జరగింది. ఈ కుంభస్థానంపూజ్య ధోండిరామ్ మహారాజ్ పాదాల స్పర్శతో పవిత్రమైనచారిత్రక భూమి. ఇక్కడ బంజారా, నాయక్డా కమ్యూనిటీ నివాసంపెద్ద ఎత్తునఉంది. పరమపూజ్యనీయ దొండిరామ్ బాబా తండ్రి పేరు హరి దంగర్ . బాబా 1803లోనానాంగ్, తాలూకా – పూసాద్, జిల్లా – వాషిం సమీపంలోజన్మించారు. ఆ తర్వాత 1872లో గోద్రి తండాలో స్థిరపడ్డారు. అక్కడ బాబాజీ ఆవులను మేపడం, పాలుపాలు పితకడం, వాటిచుట్టూ ప్రదక్షిణలు చేయడం, నూలు తిప్పడం మొదలైనవి చేసేవారు.
బాబాజీ గురుసాహెబ్‌కు అమితమైన భక్తుడు. అతను ఆసమయంలో పురాతన వైద్యుడిగా ప్రసిద్ధిచెందాడు. బాబా తన జీవితమంతా గోసేవకు, ప్రజాసేవకు అంకితంచేశారు. గోద్రి తండాలో బాబాజీకి గొప్పదేవాలయం ఉంది. ఇక్కడి సమాజానికి బాబాజీ అంటే అపారమైన ప్రేమ, గౌరవం. బాబా 1898 లో గోద్రి తండాలో మరణించారు. ఆ తర్వాత బాబాజీజ్ఞాపకార్థం, శ్రీ బాలాజీ సంగత్ మరియు శ్రీ గురునానక్ దేవ్ జీ భండారా యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో ఈ ప్రాంతం నుండి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రముఖ సాధువులందరి సమక్షంలో శ్రీ క్షేత్ర పోహ్రగడలో జరిగిన సమావేశంలో “గోద్రి” ప్రాంతాన్ని ఈ కుంభమేళకి ఏకగ్రీవంగా ఎంపికచేశారు. బంజారా సమాజ మార్పిడిని అరికట్టేందుకు, సామాజిక జాగృతికోసం ఈ మహాకుంభమేళను నిర్వహించారు.
ధర్మ జాగరణ్ సమన్వయ పాత్ర
సంఘస్వయంసేవకులు, బంజారా సమాజ్ యువకులు కుంభమేళకు ఏర్పాట్లు చేశారు. అందుకోసం దాదాపు 3 వేల మంది వాలంటీర్లు రెండునెలలుగా నిస్వార్థంగా ప్రణాళికలు, సమావేశాల ద్వారా పని చేశారు. 500 ఎకరాల విశాలమైన భూమిలో ప్రత్యక్ష కుంభమేళ జరిగింది. ఆరు రోజుల కుంభమేళలో వివిధ 8 రాష్ట్రాల నుంచి 10 నుంచి 12 లక్షల మంది భక్తులు వచ్చారని ప్రాథమిక అంచనా వేశారు. జాతిహితం కోసం, సమాజహితం కోసం అవసరమైనప్పుడు, ధర్మజాగరణ్ మంచ్ చట్టపరమైన, సరియైన మార్గంలో ఎప్పటికీ సహకరిస్తూనే ఉంటుంది, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మునుపటి శబ్రీ కుంభమేళలో, ఇంకా నర్మదా కుంభమేళలో కూడా ధర్మజాగరణ వాలంటీర్లు తమ బాధ్యతను సేవతో నిర్వర్తించారు. ఈ లక్ష్యంతోనే గోద్రిలో జరిగిన బంజారా కుంభమేళ విజయవంతానికి ధర్మజాగరణ స్వయంసేవకులు కుంభమేళలో పాల్గొని దాన్ని విజయవంతం చేశారు.