Home News ఆర్మీ విధుల్లో చేరిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

ఆర్మీ విధుల్లో చేరిన భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

0
SHARE

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌, ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) మహేంద్రసింగ్‌ ధోనీ భారత ఆర్మీలోని పారాచూట్‌ రెజిమెంట్‌లో తన శిక్షణ ప్రారంభించాడు. రెండు నెలల పాటు క్రికెట్‌ కు దూరంగా వెస్టిండీస్ పర్యటన నుండి విశ్రాంతి తీసుకున్న ధోనీ బుధవారం బెంగళూరులోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పారాచూట్‌ రెజిమెంట్‌లోని తన బెటాలియన్‌తో కలిశాడు. 

‘భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన మహేంద్రసింగ్‌ ధోనీకి సాయుధ దళాలపై ఎంత ప్రేమ ఉందో మనందరికీ తెలుసు. భారత ఆర్మీతో కలిసి పనిచేయాలనే ఆలోచన అతడికి ఎప్పటి నుంచో ఉంది, అయితే విరామం లేని క్రికెట్‌తో అది సాధ్యపడలేదు. ఇప్పుడు తన బెటాలియన్‌తో కలిసి చేరిపోయాడు. ఇలా చేయడం ద్వారా సాయుధ దళాలపై యువతకు అవగాహన కలుగుతుంది. అదే ధోనీకి కావాలిసింది’ అని ఓ ఆర్మీ అధికారి మీడియాతో పేర్కొన్నారు.

భారత ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌ విభాగంలో ధోనీకి 2011లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 2015లో ఆగ్రా వేదికగా జరిగిన పారాచూట్‌ శిక్షణలో పాల్గొన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఐదుసార్లు పారాచూట్‌ డైవింగ్‌ చేశాడు. ఇటీవల ప్రపంచకప్‌లో సందర్భంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న ధోనీ వెస్టిండీస్‌ టూర్‌కు విశ్రాంతి తీసుకొని ఆర్మీతో కలిసి శిక్షణకు హాజరయ్యాడు.

ధోనికి కాశ్మీర్ లోయలో ఉన్న విక్టర్ ఫోర్స్ సేనలతో విధులు కేటాయించారు. కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను జులై 31 నుండి ఆగష్టు 15 వరకు అక్కడ విధులు నిర్వహిస్తారు.

Source: nijam.org