Home News ఇస్లామిక్ సంస్థ పి.ఎఫ్‌.ఐని నిషేధించాల‌ని కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించిన‌ అస్సాం ప్రభుత్వం

ఇస్లామిక్ సంస్థ పి.ఎఫ్‌.ఐని నిషేధించాల‌ని కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించిన‌ అస్సాం ప్రభుత్వం

0
SHARE

భారతదేశంలోని అతివాద ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్‌.ఐ) ను నిషేధించాలని కోరుతూ అస్సాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సీఎం శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పీఎఫ్‌ఐ వివిధ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక సంస్థను నిషేధించదు కాబట్టి పి.ఎఫ్‌.ఐ ను నిషేధించాలని ఆధారాలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపామని చెప్పారు.

“రాష్ట్రంలో జరిగిన అనేక రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలలో తీవ్రవాద సంస్థ ప్రమేయాన్ని రుజువు చేసే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధిస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము” అని ముఖ్యమంత్రి తెలిపారు. నివేదికల ప్రకారం, అస్సాం పోలీసులు తీవ్రవాద సంస్థ‌ల‌తో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేసులు పెట్టారు.

గ‌త నెల‌లో దర్రాంగ్ జిల్లాలోని గరుఖుతిలో తొలగింపు డ్రైవ్ సందర్భంగా జరిగిన హింసను అస్సాం ప్రభుత్వం ప్రకారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రేరేపించిందని నివేదించబడింది. నివేదిక‌ల ప్ర‌కారం అక్ర‌మ నిర్మాణాల తొలగింపు సమయంలో చెలరేగిన హింస వ‌ల్ల ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కొల్పొవడ‌మే కాకుండా అనేక మంది గాయాల‌పాల‌య్యారు.

Source : Sentinelassam