కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకురుమ పల్లి గ్రామంలో అజాదీ కా అమృతోత్సవంలో భాగంగా సేంద్రీయ వ్యవసాయం, గ్రామ స్వావలంబన మీద ప్రశిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ గ్రామవికాస ప్రముఖ్ దినేష్ గారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల వలనే దేశ పురోగతి జరుగుతోందని గ్రామంలో గుడి, బడి, ఆట స్థలం వంటివి ఉంటూ వాటిలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. భారతదేశ వాసులు ఏ దేశంలోనైనా 2శాతం ఉంటే ఆ దేశం అభివృద్ధి పథంలో ఉంటుందని అందుకు ఉదాహరణ అమెరికా, యూరప్ దేశాలని గుర్తు చేశారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు తరుచు జాతీయ పండుగల పేరున కలుస్తూ ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామభారతీ రాష్ట్ర అధ్యక్షులు కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి , తెలంగాణ ప్రాంత గ్రామ వికాస ప్రముఖ్ జిన్నా సత్యనారాయణ రెడ్డి, అవార్డు గ్రహీత మల్లిఖార్జున రెడ్డి పాల్గొన్నారు.