హిందూ సంస్కృతీ సంప్రదాయాలను అవహేళన చేసే ప్రక్రియలో కమ్యూనిస్టులు మరో మెట్టు కిందకు దిగారు. ఈసారి ఏకంగా అయ్యప్ప స్వామిని అవమానిస్తూ పోస్టర్లు ప్రదర్శించారు.
కేరళకు చెందిన కమ్యూనిస్ట్ విద్యార్థి విభాగం ‘స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” (ఎస్.ఎఫ్.ఐ) త్రిస్సూర్ వర్మ కళాశాల ప్రాంగణంలో పోస్టర్లు ఏర్పాటు చేసారు. శబరిమల దేవస్థానంలో మహిళల ప్రవేశాన్ని సమర్ధిస్తూ ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో అయ్యప్ప స్వామిని అత్యంత అసభ్యంగా చిత్రీకరించారు.
ఈ కళాశాల కేరళ ప్రభుత్వానికి చెందిన ధార్మిక శాఖ అయిన దేవసోమ్ బోర్డుకే చెందినది కావడం గమనార్హం. అన్ని వర్గాల నుండి తీవ్రమైన ప్రతిస్పందన రావడంతో ఎస్.ఎఫ్.ఐ ఈ పోస్టర్లను తొలగించింది.
గతంలో ఇదే కళాశాలలో ఎమ్.ఎఫ్. హుస్సేన్ సరస్వతి దేవిని కించపరుస్తూ వేసిన చిత్రాన్ని ఎస్.ఎఫ్.ఐ ప్రదర్శనకు ఉంచింది.