Home Telugu Articles ధర్మరక్షణకై ‘బందా సింగ్ బైరాగి’ బలిదానం

ధర్మరక్షణకై ‘బందా సింగ్ బైరాగి’ బలిదానం

0
SHARE
సిక్కుల రక్షణార్థం, గురుగోవింద్ సింగ్ మరణానికి కారణమైన వజీర్ ఖాన్ ను శిక్షించడానికి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిన బందాసింగ్ బైరాగి బలిదానం మనందరికీ స్పూర్తిదాయకం. అక్టోబర్ 10, 1670న కశ్మీర్ లోని పంచ్ జిల్లా రాజౌరి గ్రామంలో ఓ హిందూ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టినపేరు లక్ష్మణ్ దేవ్. చిన్నప్పటి నుంచే అలౌకిక విషయాలపై ఆసక్తి ఉండడంతో, జానకీ ప్రసాద్ అనే భైరాగి దగ్గర సన్యాసం తీసుకున్నాడు. అప్పుడు ఆ గురువు అతని పేరును సంత్ మాధవదాసు గా మార్చాడు. ఆ తర్వాత రాందాస్ అనే సాధువు దగ్గర శిష్యుడిగా చేరినప్పటికీ సాధనలో సంతృప్తి కలుగక తీర్థయాత్రలు చేస్తూ మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో పంచవటీకి చేరుకుని సాధు అఘోరనాథ్ కి అనుచరుడిగా మారి వారి దగ్గర తాంత్రిక విద్యను నేర్చుకున్నారు. వారి తదనంతరం 21 సంవత్సరాల వయసులో నాంథేడ్ కి చేరుకుని అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని సాధుజీవనాన్ని సాగించాడు. అక్కడే వారి జీవితం మలుపుతిరిగింది.
సిక్కులను సర్ హిందూ రాజ్యంకి చెందిన వజీర్ ఖాన్ దమనకాండ నుంచి రక్షించేందుకు, అందుకోసం ఔరంగజేబును కలిసేందుకు గురుగోవింద్ నాందేడ్ వచ్చాడు. అయితే అప్పటికే ఔరంగజేబు చనిపోయాడు. అలాంటి సమయంలో పరస్పరం వ్యక్తిగతంగా కలవకపోయినప్పటికీ, ఒకరిగురించి మరొకరికి తెలిసి ఉండడంతో మాధవదాసును గురుగోవింద్ సింగ్ కలిశారు. ఇద్దరూ దేశ, ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలపై చర్చలు చేసేవారు. గురుగోవిందుని మాటల నుంచి సంత్ మాధవదాసు ఎంతో ప్రభావితుడయ్యాడు. మాధవదాసు గురుగోవింద్ సింగ్ కు సేవకుడిగా (బందీగా)  ఉంటానని ఆ సమయంలో చెబుతాడు. దాంతో గురుగోవింద్ సింగ్ ఖల్సా సాంప్రదాయం ప్రకారం అతనికి సిక్కు దీక్షను ఇచ్చి బందా సింగ్ బహదూర్ గా పేరు మారుస్తాడు.
ఆసమయంలోనే సర్ హిందూ నవాబ్ కు చెందిన సైనికుడు ఒకరు గురుగోవింద్ సింగ్ పై హత్యాయత్నం చేస్తాడు. గాయాలతో మంచంమీద ఉన్న గురువును చూసిన బందా బైరాగి వజీర్ ఖాన్‌ను శిక్షించడానికి అనుమతి ఇవ్వవలిసిందిగా కోరుతాడు. అలా గురువు అనుమతితో పంజాబ్ బయల్దేరి సిక్కులతో సాయుధ సంఘర్షణకు నాయకత్వం వహించాడు.
ముస్లింలను ఎదుర్కునేందుకు వీలుగా పంజాబ్‍లో సైన్యాన్ని తయారు చేశాడు. 1710లో వజీర్ ఖాన్ ను శిక్షించడానికి అతనిపై దాడికి వెళ్లాడు. అతని సారధ్యంలో ఫతేసింహుడు అనే సైన్యాధికారి వజీర్ ఖాన్ ను సంహరించాడు. ఆ తర్వాత అతను ముస్లింల చెరలో ఉన్న అనేక ప్రాంతాలను వశం చేసుకుంటూ లోహగడ్ ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. అది యుద్ద వ్యూహరీత్యా చాలా కీలకమైంది. అలా బందాబైరాగి పరాక్రమంతో యమునా సట్లేజ్ నదుల మధ్య భాగమంతా సిక్కుల రాజ్యం విస్తరించింది. ఇలా సిక్కుల రాజ్యం పటిష్టమవడం ముస్లిం పాలకులకు నచ్చలేదు. బందాసింగ్ ను ఎలాగైనా అంతమొందించాలని వారు భావించారు. 1715 డిసెంబర్ 7న మొగలు సేనాని దిలేర్ జంగ్ పూర్తి సంసద్దితతో బందాబైరాగిపై దాడిచేశారు. ముస్లింల భారీ సైన్యం ముందు సిక్కు సైన్యం నిలవలేకపోయింది. ఆ సమయంలో బందా ను వారు నిర్భందించారు. ఆ తర్వాత 1716 జూన్ 9న అత్యంత పాశవికంగా హత్య చేశారు. తదనంతరం రంజిత్ సింగ్, సిక్కు రాజ్యంని విస్తరణ చేస్తూ పంజాబ్ ప్రాంతం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు సిక్కు రాజ్యం విస్తరింపచేశాడు.
సుమారు రెండువందల సంవత్సరాలపాటు సిక్కులు ముస్లింలతో నిరంతర సంఘర్షణ సాగించారు. ముస్లింలకు మాత్రమే కాదు ఆంగ్లేయులకు కూడా లొంగకుండా స్వతంత్ర రాజ్యంగా పంజాబ్ విలసిల్లింది. ఈ విధంగా హిందూ దర్మరక్షణ గావించి ఇస్లాం అత్యాచారాలను నిరోధిస్తూ పంజాబ్ ఇస్లాం రాజ్యంగా కాకుండా కాపాడిన వీరుడైన బందాబైరాగి బలిదానం మనందరికీ స్పూర్తిదాయకమైనది