ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది.. మరోవైపు ప్రభుత్వాలు తమ ప్రజలను కరోనా నుండి రక్షించుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించి కఠిన నిబంధనలు విధించాయి.. పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు అహోరాత్రాలు కష్టించి ప్రజలను జాగృతం చేస్తున్నా కూడా కొన్ని చోట్ల కొన్ని వర్గాల ప్రజలు సామాజిక బాధ్యత పూర్తిగా విస్మరిస్తున్నారు. దేశం ఏమైపోతే మాకేంటి అన్న వీళ్ళ ప్రవర్తన కారణంగా వీళ్ళతో పాటు, వీళ్ళ చుట్టుప్రక్కల సమాజం కూడా ప్రమాదపుటంచుల్లోకి జారుకుంటోంది.
నిర్మల్ జిల్లా భైంసాలోని బీఫ్ మార్కెట్ ఈ కోవలోకే వస్తుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా, సామాజిక దూరం ఏమాత్రం పాటించకుండా.. పరిశుభ్రతకు దూరంగా.. విచ్చలవిడిగా మారిన మార్కెట్ ప్రాంగణం చూస్తే.. వీరికి ఉన్న సామాజిక బాధ్యత ఇట్టే అర్ధమవుతుంది.
ఇప్పటికే నిర్మల్ జిల్లాలో 11 మందిని కరోనా అనుమానం కింద వైద్యపరీక్షలు తరలించారు.. అందరిదీ ఒకే సామాజిక వర్గం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నవారిలో మార్పు రాకపోవడం శోచనీయం. సామాజిక దూరం పాటించాలన్న కనీస విచక్షణ కూడా లేకుండా, ఒకరినొకరు తోసుకుంటూ, మాంసం ఎగబడుతున్న ఇక్కడి వినియోగదారుల తీరు అటుంచితే పరిస్థితి ఎంతటి ప్రమాదకరంగా ఉందో ఊహించవచ్చు.
ఎప్పుడూ వినియోగదారులతో రద్దీగా ఉండే భైంసా బీఫ్ మార్కెట్లో మార్చి 22 నాటి ‘జనతా కర్ఫ్యూ’ నాటి నుండి నేటి దాకా కూడా ఇదే పరిస్థితి. ఇప్పటి దాకా ఈ విషయంలో అధికారులు స్పందించకపోవడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. స్థానిక బీజేపీ నేతలు జిల్లా పోలీస్ సూపరింటెండెంటుకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదని సమాచారం.