Home News శ్రీమద్ రామాయణం.. సత్య ప్రామాణిక ఇతిహాసం

శ్రీమద్ రామాయణం.. సత్య ప్రామాణిక ఇతిహాసం

0
SHARE

కొత్త రచయితల రాకతో వామపక్ష చరిత్రకారులు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వారి దృక్కోణం వైజ్ఞానికమైనది, తార్కికమైనది. మరీ ముఖ్యంగా భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి పట్ల వారికి ఎనలేని భరోసా సైతం ఉంది. సీతామాతను రావణాసురుడు అపసంహరించుకొని తీసుకొనిపోతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్నపుష్పక విమానం ఏ మార్గంలో వెళ్ళింది? ఆ మార్గంలో ఏ విధమైన వైజ్ఞానిక రహస్యం దాగి ఉంది? లక్షలాది సంవత్సరాల క్రితమే ఆ మార్గం గురించి ఎలా తెలిసింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం వామపక్ష చరిత్రకారులకు మృత్యువుతో సమానం.

సీతామాతను రావణుడు పంచవటి (మహారాష్ట్రలో నాసిక్) నుంచి అపహరించాడు. పుష్పక విమానం ద్వారా హంపి (కర్నాటక), లేపాక్షి (ఆంధ్రప్రదేశ్) మీదుగా శ్రీలంకకు సీతామాతను తీసుకొనివెళ్ళాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీక్షించినప్పుడు నాసిక్, హంపి, లేపాక్షి, శ్రీలంక ఒకే సరళ రేఖ మీద ఉన్నట్టుగా కనిపించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. మరీ ముఖ్యంగా పంచవటి నుంచి శ్రీలంక చేరుకోవడానికి ఇది దగ్గరిదారి కావడం విశేషం.
దగ్గరిదారి ఏదో తెలుసుకోవడానికి ఆ కాలంలో గూగుల్ మ్యాప్‌లు లేవు. భారత్ వ్యతిరేకులు వారి అహాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసం శ్రీమద్ రామాయణాన్ని మహర్షి వాల్మీకి రచించిన ఒక మహాకావ్యం అని అంటుంటారు. అదే నిజమైతే.. పంచవటి నుంచి శ్రీలంక చేరుకోవడానికి ఉపకరించే ఒక దగ్గరిదారి వాల్మీకి మహర్షికి ఎలా తెలిసింది?

మహాకావ్యంలో సంఘటనల కోసం ఏదో ఒక ప్రాంతాన్ని, స్థానాలను ప్రస్తావించడం సర్వసాధారణమైన విషయం. కానీ సీతామాత అపహరణం కోసం ఉద్దేశించిన ఒక స్థలాన్ని పుష్పక విమానం ద్వారా నేరుగా శ్రీలంకకు చేర్చే స్థలంగా వాల్మీకి మహర్షి ఎలా ఎంచుకున్నారు? అదెలా సరైనదంటే.. నేటి నుంచి సరిగ్గా 500 సంవత్సరాల క్రితం గోస్వామి తులసీదాస్ జీకి భూమాత నుంచి సూర్య భగవానుడికి మధ్య దూరం (జుగ్ సహస్ర యోజన్ పర్ భాను = 152 మిలియన్ కిలోమీటర్లు(15 కోట్ల 20 లక్షల కిలోమీటర్లు) ఎలా తెలిసిందో అలాగే అనుకోవాలా? మరి నాసా కొద్ది సంవత్సరాల క్రితమే కదా ఈ దూరాన్ని కనిపెట్టింది.

వనవాస సమయంలో శ్రీరామచంద్రప్రభు, సీతామాత, లక్ష్మణ స్వామి పంచవటిలో ఉన్నారు. ఇక్కడకు వచ్చిన శూర్పణఖ తనను వివాహం చేసుకోవాలని లక్ష్మణ స్వామి వెంటపడింది. ఆగ్రహించిన లక్ష్మణస్వామి ఆమె ముక్కు (నాసిక) ను తెగకోశారు. అదే ప్రాంతాన్ని మనం నేడు నాసిక్ అని పిలుస్తున్నాము.

పుష్పక విమానంలో వెళుతున్న సీతామాత కిందకు చూసినప్పుడు ఒక పర్వతంపైన కొందరు వానర వీరులు ఆమెకు కనిపించారు. సీతామాత తాను ధరించిన వస్త్రంలో కొంత భాగాన్ని చించివేసి.. ఆ వస్త్ర భాగంలో తన చేతిగాజులను చుట్టిపెట్టారు. అలా చుట్టిపెట్టిన వస్త్రాన్ని కిందకు పడవేశారు. ఆ వస్త్రాన్ని అందుకున్న వానర వీరులు తనను వెదికే సమయంలో శ్రీరామచంద్రప్రభువుకు సహకరిస్తారనే ఉద్దేశ్యంతో సీతామాత ఆ పనిచేశారు. ఏ స్థలంలో నైతే తన చేతి గాజులను వస్త్రంలో చుట్టి సీతామాత పడవేసినారో అదే రుష్యముక పర్వతం. ఆ పర్వతం ప్రస్తుతం హంపీలో ఉంది.

అనంతరం ఎవరో ఒక రాక్షసుడు ఒక స్త్రీని పుష్పక విమానంలో అపహరించుకొని తీసుకువెళుతుండటాన్ని జటాయువు అనే పక్షిరాజు చూశాడు. సీతామాతను విడిపించడం కోసం రావణుడితో జటాయువు యుద్ధం చేశాడు. రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కను నరికివేశాడు. రావణుడి దుష్ట కార్యానికి జటాయువు కిందపడిపోయాడు. లక్ష్మణ స్వామి సమేతంగా సీతామాత కోసం అన్వేషిస్తున్న శ్రీరామచంద్రుడు కిందపడి ఉన్న జటాయువును చూశారు. ‘లే..పక్షి..’ అని జటాయువును పిలిచారు. కాలక్రమేణా ఆ ప్రాంతమే లేపాక్షిగా పేరు పొందింది. ఇదంతా చదువుతుంటే మీకు ఏమి అర్థమవుతున్నది? పంచవటి-హంపి-లేపాక్షి-శ్రీలంక. ఒకటే దారి. అన్ని దారులకన్నా దగ్గరిదారి.

మన జ్ఞాన విజ్ఞానాన్ని, సంస్కృతిని విస్మరించిన భారత్ బంధువులారా..! శ్రీమద్ రామాయణం ఒక పురాణగాథ కాదు. అది మహర్షి వాల్మీకి ద్వారా రచించబడిన సత్య ప్రామాణిక ఇతిహాసం. ఈ విషయాన్ని రుజువు చేసే అన్ని వైజ్ఞానిక ప్రమాణాలు నేడు అందుబాటులో ఉన్నాయి.

అందుకనే ఎవరైనా వామపక్షానికి చెందిన వ్యక్తి మన ఇతిహాసాలను, సంస్కృతిని, సాహిత్యాన్ని పురాణాగాథలని చెబుతూ ప్రజలను భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటివారిని పట్టుకోవాలి. సదరు వామపక్ష వ్యక్తిని సావధానంగా కూర్చొండపెట్టాలి. పైన పేర్కొన్న ప్రశ్నలకు జవాబులు చెప్పాలని వామపక్ష వ్యక్తిని నిగ్గదీయాలి. మీరు నమ్ముతారో లేదో కానీ సదరు వ్యక్తి ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వలేడు.

మరి ఈ మొత్తం వ్యవహారంలో మీ బాధ్యత ఏమిటి? మీ వంతు బాధ్యతగా టీవీలో శ్రీమద్ రామాయణం వీక్షిస్తున్నప్పుడు ఒక కథను చూస్తున్నట్టుగా భావించకండి. మనదైన ఇతిహాసం కన్నులముందు నిలిచిందనే భావనను నిత్యం మనస్సులో ఉంచుకొని శ్రీమద్ రామాయణాన్ని టీవీలో వీక్షించండి. ఈ దృష్టితో రామాయణాన్ని చూడండి. అవగతం చేసుకోండి. ఇలాంటి దృష్టినే మీ పిల్లలకు కలిగించండి. ఇది ఒక కథ కాదు అని ఇతిహాసం అని వారికి చెప్పండి. శ్రీమద్ రామాయణం మనదైన ఇతిహాసం. పరమపవిత్రమైన రామాయణాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలను అడ్డుకోండి.

‘పాంచజన్య’ సౌజన్యంతో..