భారతదేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. న్యూడిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్ద నరేంద్ర మోదీతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్రపతి కోవింద్.. మోదీకి అభినందనలు తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బాంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌ల్యాండ్, నేపాల్, భూటాన్ (బిమ్‌స్టిక్) దేశాల అధినేతలతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ, యూపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర ఫడణవీస్, అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, పళనిస్వామి, ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ దంపతులు, రతన్‌టాటా తదితరులు హాజరయ్యారు.
నరేంద్ర మోదీతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం రాష్ట్రపతి కోవింద్ మరికొందరు కాబినెట్ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.