ఉత్తరప్రదేశ్ లోని లఖిమ్‌పూర్ ఖేరీలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని భారతీయ కిసాన్ సంఘ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ విధ్వంసంలో పాల్గొన్న వారెవరూ రైతులు కాదని, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారే వామపక్షా పంథాలో ఈ విధ్వంసాన్ని సృష్టించారని కిసాన్ సంఘ్ పేర్కొంది. కర్రలతో దాడి చేయడం, అమాయక ప్రజలను హత్య చేయడం వంటి ఘటనలు చూస్తూ ఇలా ఏ రైతూ చేయలేడని, చట్టాన్ని తమ చేతులోకి తీసుకుని కొంత మంది వ్యక్తులు బహిరంగంగా హత్యలు చేయడం చూస్తే ముందస్తుగానే ప్రణాళిక ప్రకారమే ఈ ఘటన జరిగి ఉంటుందని కిసాన్ సంఘ్ పేర్కొంది.
ఈ దాడికి కారకులైన వారిని గుర్తించి వారిని కఠిన శిక్షించాలని కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోందని పేర్కొంది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. మృతుల కుటుంబాలకు భారతీయ కిసాన్ సంఘం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని పేర్కొంది.