అస్సాంను తూర్పు పాకిస్తాన్ లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన తల్లిభారతి గొప్ప కుమారుడు, అస్సాం సుపుత్రుడిగా పేరుగాంచిన భింబర్ దేవరి. అతని తండ్రి గోదారం దేవరీ, తల్లి బజోతి దేవరీ. చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థిగా పేరుపొందిన అతను, అస్సాం సివిల్ పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ గిరిజనుడైనందున అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో అతను డిబ్రుగర్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు.