Home News ‘వ్యాసభారతంలో భీష్మ’ పుస్త‌కాన్ని ఆవిష్కరించిన శ్రీ‌ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

‘వ్యాసభారతంలో భీష్మ’ పుస్త‌కాన్ని ఆవిష్కరించిన శ్రీ‌ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

0
SHARE

కొచ్చి: వ్యాస‌భార‌తంలో భీష్మ అనే పుస్త‌కాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌జీ ఆవిష్కరించారు. సంఘ్ సీనియర్‌ ప్రచారక్‌, మాజీ అఖిల భారతీయ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ ఆర్‌.హరిజీ ఈ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ కార్యక్ర‌మం కొచ్చిలోని ఆర్‌ఎస్‌ఎస్ కేరళ ప్రాంత్ కార్యాలయం మాధవ్ నివాస్‌లో వేడుక‌గా జరిగింది. కార్యక్రమంలో ఆర్‌టీడీ జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పుస్తకాన్ని అందుకున్నారు.

మహాభారతంలోని అద్భుతమైన పాత్రలను వ్యాస దృక్కోణం నుండి వివరించే పుస్తకాల శ్రేణిలోకి ‘వ్యాసభారతంలో భీష్మ’ చేరుతుంది. ప్రముఖ మలయాళ కవి ప్రొఫెస‌ర్ వి.మధుసూదనన్ నాయర్ ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు.

వ్యాసభారతంపై గతంలో ప్రచురించిన‌ పుస్తకాలలో శ్రీకృష్ణుడు, కర్ణన్, విదురర్, ద్రౌపది. నారదుడు ఉన్నాయి. కురుక్షేత్ర ప్రకాశన్ వీటి ప్రచురణకర్త. ఈ కార్యక్రమంలో కేరళ ప్రాంత్ సంఘ్‌చాలక్ కె.కె. బలరాం, కురుక్షేత్ర మేనేజింగ్ డైరెక్టర్ సి.కె. రాధాకృష్ణన్, ఎడిటర్ కె.బి. సురేంద్ర‌న్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.