సామాజిక సమరసతా వేదిక, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లా పూర్ లోని నాగోబా మందిర ప్రాంగణంలో నవబంర్ 15 మంగళవారం బిర్సా ముండా 147వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం అలాగే అడవి, చెట్టు పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్నారు. మన దేవతల నుండి, మన నమ్మకాల నుండి మనను దూరం చేసే శక్తులు మన మధ్యలో సంచారిస్తున్నాయని వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలన్నారు. మత మార్పిడులు జరుగకుండా అలాగే గిరిజనులు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని కోరారు.
తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మాట్లాడుతూ తర తరాలుగా వికసించిన గిరిజన గ్రామీణ స్వావలంబాన పద్ధతులను ప్రజాస్వామ్య వ్యవస్థ గా పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలో ప్రస్థావించారని పేర్కొన్నారు. గిరిజన నాయకులు సేదం శ్రీ భీమ్ రావ్ ప్రసంగింస్తూ మన హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని కోరారు. వచ్చిన పెద్దలకు శాలువా, బిర్సా ముండా చిత్రపటాన్ని, 100 మంది మహిళలకు చలి దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి నాగోబా మందిర మఠాధిపతి మెస్రం వెంకట్ రావ్, మెస్రం ఆనంద్ రావ్, మందిరం అధ్యక్షులు,అర్కా కమ్ము, సార్ మేడి పంద్ర అమృత రావ్, కేస్లా పూర్ గ్రామ సర్పంచ్ కూడే కైలాష్,మెస్రం రాజేశ్వర్, జయంతి ఉత్సవాల కన్వీనర్, మరప రాజు, ధర్మ జాగరణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.