2021 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్‌లో వరుసగా మూడవ సారి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ(BJP) అధికారంలోని గుజరాత్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ కోసం 28కి పైగా రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడ్డాయి. అధికార వర్గాల ప్రకారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ వారం మొదట్లో స్టేట్స్ స్టార్టప్ ర్యాంకింగ్‌కు సంబంధించిన పురస్కారాలను ప్రదానం చేశారు. “ఔత్సాహికులకు అవసరమైన పటిష్టమైన స్టార్టప్ ఎకో సిస్టమ్ సమకూర్చడం” కేటగిరిలో NDA అధికారంలో ఉన్న మేఘాలయ, BJP అధికారంలోని కర్నాటక రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి.
‘Best Performer State’ కేటగిరిలో 2019, 2020 సంవత్సరాల్లో సైతం గుజరాత్ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ “ప్రధాన మంత్రి ఆకాంక్షిస్తున్న ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేయడంతో గుజరాత్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నది. ఏదేని దేశంలో ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలను చేర్చే సామర్థ్యం స్టార్టప్‌లకు ఉంది. భవిష్యత్తులో, ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కారంలో ఈ స్టార్టప్‌లు ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తాయి” అని అన్నారు.
స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం గుజరాత్‌లో 14,200కు పైగా స్టార్టప్‌లు నమోదై ఉన్నాయి. గుజరాత్‌లోని 180కి పైగా ఇంక్యుబేటర్లు/విద్యా సంస్థలతో కూడిన ఒక విస్తృతమైన నెట్‌వర్క్ ప్రస్తుతం స్టార్టప్‌లకు మద్దతుగా పనిచేస్తున్నాయి. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నందుకు 2017 సంవత్సరానికి ‘Prime Minister’s Award for Excellence in Public Administration’ ను సైతం గుజరాత్ దక్కించుకున్నదని అధికారులు తెలిపారు.
పలు విస్తృతమైన సంస్కరణాయుత అంశాలు ప్రాతిపదికగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం 2021 ర్యాకింగ్‌లను నిర్వహించింది. సంస్థాగత మద్దతు, సృజనాత్మకత, వ్యవస్థాపకత, మార్కెట్ సౌలభ్యం, ఇంకుబ్యేషన్ మద్దతు, నిధుల పరంగా మద్దతు, మార్గదర్శక మద్దతు, సమర్థమంతుల సామర్థ్య నిర్మాణం, తదితర సంస్కరణాయుత అంశాలు ప్రాతిపదికగా ర్యాంకింగ్‌లు ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
SOURCE: ORGANISER