Home News రైతు సంక్షేమ‌మే ధ్వేయంగా BKS పోరాటం

రైతు సంక్షేమ‌మే ధ్వేయంగా BKS పోరాటం

0
SHARE
  • ఢిల్లీలోని రాంలీలా మైదానంలో BKS ఆధ్వ‌ర్యంలో రైతుల ర్యాలీ
  • రాకేష్ టికాయ‌త్ ఒక మోస‌గాడు: రైతుల

రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, రైతుల డిమాండ్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జేసేందుకు భార‌తీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం సెంట్రల్ ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో దేశ‌వ్యాప్తంగా దాదాపు 50,000 మంది రైతులు సమావేశమయ్యారు. సుమారు 700 నుండి 800 బస్సులు, 3,500 నుండి 4,000 ప్రైవేట్ వాహనాల్లో రైతులు మైదానానికి చేరుకున్నారు. నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. రైతులు కూడా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా ర్యాలీ నిర్వ‌హించారు.

అయితే ఈ ర్యాలీ శాంతియుతంగా జ‌రుగుతుంద‌ని, కానీ గ‌తంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి జరిగిన ర్యాలీ చాలా హింసాత్మకంగా ఎందుకు మారింద‌ని ర్యాలీలో పాల్గొన్న రైతుల‌ను మీడియా సంస్థ‌లు ప్ర‌శ్నించ‌గా వారు స్పందిస్తూ “తమ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ నిధులు సమకూర్చడం లేదని, ర్యాలీ శాంతియుతంగా జరగడానికి కారణం అదే కావచ్చు” అని పేర్కొన్నారు. ఢిల్లీలో హంగామా చేసిన న‌కిలీ రైతులు రాజకీయ అండదండల‌తో ర్యాలీని ప‌క్క‌దారి ప‌ట్టించి, దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయ లక్ష్యంతో నిర‌స‌న‌ల పేరుతో రైతులను కించపరిచార‌న్నారు. గ‌తంలో జ‌రిగిన ‘కిసాన్ ఆందోళన్’లో తాము భాగం కాదని, అయితే కొందరు తాము ఆ ఉద్యమం ప్రారంభంలో పాల్గొని, నిరసన ప‌క్క దారి ప‌ట్ట‌డంతో వెనక్కి తగ్గామ‌ని తెలిపారు. రాకేష్ టికాయ‌త్ లాంటి రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు రైతులను మోసం చేస్తున్నారు అని ర్యాలీలో ఓ రైతు అన్నారు. రాకేష్ టికాయ‌త్ లాంటి వారు తమ నాయకుడు కాదని రైతులు తేల్చిచెప్పారు. రైతుల న్యాయమైన డిమాండ్ల‌ను ప్రభుత్వం ముందు ఉంచేందుకే ఈ ర్యాలీ చేస్తున్నామ‌ని, ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాద‌ని స్ప‌ష్టం చేశారు.

“కిసాన్ గర్జన ర్యాలీ”లో పాల్గొన్న రైతులు మూడు కీలకమైన డిమాండ్లు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KSNY) కింద పంపిణీ చేస్తున్న రూ.6వేల‌ను సంవత్సరానికి రూ. 20వేల‌కు పెంచాల‌ని, అలాగే రైతు పరికరాలపై విధించిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. పంట ధరను దాని ధరకు అనుగుణంగా నిర్ణయించాల‌ని, బంగాళాదుంపలు భూమిలోప‌ల పెరుగుతాయో లేదా భూమిపై పెరుగుతాయో కూడా తెలియని నాయకులు నిర్ణయించ‌డం వ‌ల్ల రైతులు న‌ష్ట‌పోతున్నార‌న్నారు. తాము జాతీయవాదులమని, మూడు వ్యవసాయ చట్టాలతో తమకు ఎప్పుడూ సమస్య లేదని కొన్ని లోపాల‌ను స‌రిచేసిన త‌ర్వాత ఆ చ‌ట్టాల‌ను అంగీక‌రిస్తామ‌ని పేర్కొన్నారు.

‘కిసాన్ గర్జన ర్యాలీ’కి సాంస్కృతిక వైభవం తోడ‌యింది. కొందరు రైతులు సంప్రదాయ నృత్యం చేస్తూ, సంగీతాన్ని వాయిస్తూ కనిపించగా, మరికొందరు ఝల్ లేదా కర్తాల్ వంటి వాయిద్యాలను వాయిస్తూ కనిపించారు. రైతులు శాంతియుతంగా కూర్చున్న వేదికపై భారత్ మాత, శ్రీ‌రాముడి చిత్ర‌ప‌టాల‌ను అలంక‌రించారు. “కిసాన్ గర్జన ర్యాలీ”కి చాలా మంది మహిళలు హాజరు కావడం అక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.

26 జనవరి 2021న ‘రైతులు’ అని పిలవబడే కొందరు అల్లకల్లోలం సృష్టించి, దిగ్గజ ఎర్రకోటపై విధ్వంసం చేశారు. ఆ సంఘ‌ట‌న బ‌ట్టి చూస్తే ఒడిశాలోని రైతులు తాము ఎల్లప్పుడూ శాంతియుత ప్రదర్శనలకు అనుకూలంగా ఉన్నామన్నారు. భగవంతుడు బలరామ్‌ను భగవంతుడు జగన్నాథుని అన్నగా, నాగలికి ప్రభువుగా పరిగణించడం వలన భగవంతునిపై తమకు ఎంతో విశ్వాసం ఉందని వారు పేర్కొన్నారు. బలరాముడికి ఒడిశాలో కూడా అనేక ఆలయాలు ఉన్నాయి. అందుకే ‘కిసాన్ గర్జన ర్యాలీ’లో ‘జై బలరాం’ నినాదం చాలా ప్రతిధ్వనించింది.