Home News ” BLEEDING INDIA” & “ర‌క్త‌సిక్త భార‌తం ” పుస్త‌కాల‌ ఆవిష్క‌ర‌ణ‌

” BLEEDING INDIA” & “ర‌క్త‌సిక్త భార‌తం ” పుస్త‌కాల‌ ఆవిష్క‌ర‌ణ‌

0
SHARE

భాగ్యనగరంలో సెప్టెంబ‌ర్ 28న ” BLEEDING INDIA ” ” రక్త సిక్త భారతం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మ‌హ‌రాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, భారతీయ మజ్దూర్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ బి సురెందరన్, అఖిల భారత సహప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్, ” Bleeding India”  పుస్తక రచయిత బినయ్ కుమార్ సింగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత బినయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ” ఝార్ఖండ్ లో ఒక ముస్లిం యువకుడు హిందూ గిరిజ‌న మ‌హిళ‌ను వివాహమాడిన తరువాత కూడా మతం మార్చలేదు” అన్న వార్త ఆశ్చర్యం కలిగించిందనీ, ఆ విషయం పై పరిశోధన చేయగా బంగ్లాదేశ్ చోరబాటు దారులు దాదాపు పదివేల మంది ఇలా హిందూ గిరిజన స్త్రీ లను వివాహం పేరున లోబరుచుకొని పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిపారని ఈ పన్నాగం వెనుక PFI హస్తం ఉందనీ అర్ధం అయ్యిందని చెప్పారు. ఈ విష‌యం సామాన్యులకు అర్ధం కావలిసిన అవసరం గమనించి ఈ పుస్తకాన్ని రచించాననీ తెలిపారు. సురేంద్రన్ గారు మాట్లాడుతూ ” దళిత అనే పదాన్ని దళిత voice  అనే పేరు గల సంస్థ వ్యవస్థాపకుడు VT రాజశేఖర్ అనే వ్యక్తి ప్రాచుర్యం లోకి తెచ్చారనీ, 1980 ల లో షెడ్యూలు కులాలు అని కాకుండా దళిత అనే పదం తో దేశ విచ్చిన్నకర ఆలోచనలతో ఎలా హిందూ సమాజం లో అనైక్యత పెంచే ప్రయత్నం జరిగిందీ ఇప్పుడు ఈ అనైక్యత వల్ల జరుగుతున్న అనర్ధాలను ప్రస్థావించారు.

బర్కత్ పురా లోని కేశవ నిలయంలో ఈ పుస్తకాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్‌లో  కింది లింక్ ద్వారా పుస్త‌కాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ర‌క్త‌సిక్త భార‌తం : https://www.hindueshop.com/product/rakta-sikta-bhaaratam/

BLEEDING INDIA : https://www.hindueshop.com/product/bleeding-india/