Home News ‘అంద‌రినీ క‌లుపుకుని, జాతీయ‌వాదాన్ని వ్యాప్తి చేయాలి’

‘అంద‌రినీ క‌లుపుకుని, జాతీయ‌వాదాన్ని వ్యాప్తి చేయాలి’

0
SHARE
  • ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత ప్ర‌చార‌క్ శ్రీ లింగ్ శ్రీ‌ధ‌ర్ జీ

    సమాజంలోని అందరినీ కలుపుకుంటూ దేశోద్ధారమే ఆర్‌.ఎస్‌.ఎస్ లక్ష్య‌మ‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత ప్ర‌చార‌క్ శ్రీ లింగం శ్రీ‌ధ‌ర్ జీ అన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్ బోయిన్‌ప‌ల్లి బాగ్ ఆధ్వ‌ర్యంలో బ‌హూదూర్‌ప‌ల్లిలోని మేక‌ల వెంక‌టేశ్వ‌ర్లు గార్డెన్‌లో ఆదివారం విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వంలో విభాగ్ సంఘ‌చాల‌క్ దుర్గా రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త, సామాజిక‌వేత్త శ్రీ రంజ‌న్ సూద్ గారు, ప్ర‌ధాన వ‌క్త‌గా శ్రీ లింగం శ్రీ‌ధ‌ర్ జీ  పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా లింగం శ్రీ‌ధ‌ర్ జీ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925లో నాగపూర్ లో విజయదశమి రోజు స్థాపించార‌ని, సంఘం 98 సంవత్సరాల నుండి భారతదేశపు పునర్ వైభవం కోసం పనిచేస్తున్నద‌ని తెలిపారు. భారతదేశాన్ని విశ్వ గురు స్థానానికి తీసుకెళ్ల‌డ‌మే సంఘ లక్ష్యమ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు.

ఈ హైందవ ధర్మం సనాతనమైనటువంటిది దీన్ని ఎవరు నాశనం చేయలేర‌ని, నిరంతరం జీవిస్తూనే ఉంటుంద‌ని అన్నారు. హిందూ సమాజంపై దాడులు జరిగినప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది  అటువంటి కష్టాలు రాకుండా ఆత్మ విస్మృతి నుండి ఆత్మ స్థైర్యము నింపడానికి సంఘము కృషి చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. మనుషులలో ఆత్మవిస్మృతి తొలగించి ఆత్మవిశ్వాసం పెంచేందుకు హిందూ సమాజం ధర్మ మార్గంలో వెళ్లడం కోసం,  మనుషులలో భేదభావాలు తొలగి సమాజ ఉద్ధరణకు తొడ్ప‌డే సంఘాన్ని డాక్టర్ జీ  స్థాపించార‌ని వారు గుర్తు చేశారు. ఈ  98 సంవత్సరాల‌లో రంగాలలో పనిచేస్తున్న కారణంగా సమాజంలో మార్పును గమనించ‌వ‌చ్చ‌న్నారు.

డాక్టర్ జీ సంఘాన్ని ప్రారంభించినప్పుడు ఎన్నో అవ‌మానాల‌కు గుర‌య్యార‌ని, అయిన‌ప్ప‌టికీ ఒక నిర్ధిష్ట ల‌క్ష్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్ ను దేశమంతా వ్యాప్తి చేశార‌ని తెలిపారు. 1948లో సంఘంపై దురుద్దేశపూరితంగా నిషేధం విధించార‌ని, మ‌ళ్లీ 1975 ఎమర్జెన్సీలో నిషేధం విధించిన‌ప్ప‌టికీ సంఘం పెరుగుతూనే ఉంద‌ని ఆయ‌న అన్నారు. సమాజంలో సమస్యలన్నిటికీ సంఘం పరిష్కారం చెప్తుంద‌న్నారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 500 సంవత్సరాల పైగా పోరాటం జరుగుతున్నది కానీ సంఘం 50 సంవత్సరాలు పోరాటం చేసి సాధించింద‌న్నారు. జాతీయ‌వాద ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వం నుంచి కాకుండా మాత్ర‌మే కాకుండా వ్యక్తులు సమాజం నుంచి సంఘం ఆశిస్తున్న‌ద‌ని వారు తెలిపారు. “దేశీయతమే నాహితం” అని ఆలోచించి స్వయంసేవకులు సాధ్యం చేస్తున్నార‌ని తెలిపారు.

దశ దిశలో సంఘాన్ని విస్తరించిద‌ని, అన్ని వర్గాలు కలుపుకొని  హేచ్చు తగ్గుల్లేకుండా ఆత్మవిశ్వాసంతో సంఘ కార్యకర్తలు పని చేస్తున్నార‌ని తెలిపారు. ప్రపంచమంతా మార్పు కోరుతూ మాననీయ సర్ సంఘచాలక్‌ గారు ముల్లాలతో సమావేశం నిర్వహిస్తే… ఆర్ఎస్ఎస్ కూడా ముస్లింలకు లొంగిపోయింద‌ని సమాజంలో కొద్దిమంది ఆలోచిస్తే.. స్వయంసేవకులు మాత్రం మనం వాళ్ళని కూడా భారతీయులుగా  భావించి వాళ్లలో జాతీయ ఆలోచనలు పెంపొందించుటకు పని చేశారని ఆలోచించార‌ని పేర్కొన్నారు.

ప్రపంచంలోని అన్ని సంస్కృతుల‌ను భారతదేశం ఆదరించింద‌ని, మనం ఎవరిని కూడా శత్రువులుగా చెడువారిగా భావించ‌లేద‌న్నారు. శ్రీరామచంద్రుడు అస్త్రాన్ని ధరించి దుర్మార్గులను, రాక్షసులను మాత్రమే శిక్షించాడ‌ని, అలాగే అమ్మవారు కూడా దుష్టులను శిక్షించి సన్మార్గులను కాపాడేందుకే ఆయుధాలను ధరించింద‌ని తెలిపారు. కానీ కొద్దిమంది దుర్మార్గులు మంచి వాళ్లను శిక్షించి పైశాచికానందము పొందుతార‌ని అన్నారు. మనం చెడు గురించి ఆలోచించకుండా మంచినే ఎక్కువ చేస్తామ‌న్నారు. మనలో స్వయంసేవకత్వం ఎంత ఉంది అనేది మనమే నిర్ణయించుకోవాల‌ని, సంఘ ఆలోచన‌ల‌క‌నుగుణంగా ఎంత వ‌ర‌కు పనిచేస్తున్నామ‌ని మనమే నిర్ణయించుకోవాల‌న్నారు.

డాక్టర్ జి తన చేతిలో పట్టుకున్న కర్ర పైన  స్వయమేవ మృగేంద్రత  అని రాసి ఉంటుంది. దాని అర్థం అడవిలో సింహాన్ని ఎవరు కూడా రాజుగా ప్రకటించలేదు, కానీ సింహం తానే తన బలపరాక్రమాలచే అడవికి రాజుగా ఉంటుంది. అదేవిధంగా హిందూ సమాజం కూడా ఆ రకంగానే ఆలోచించాలన్నారు. సంఘ కార్యకర్తలు కూడా నిరంతరం సంఘ ప‌నిలో నిమ‌గ్న‌మై, సేవా కార్యక్రమాల‌ను విస్తరించి సమాజ సంఘటన ఉద్ధరనలో  ముందు ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చారు.