Home News రైతుల సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌

రైతుల సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌

0
SHARE

రైతు సంక్షేమానికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామ‌న్ అన్నారు. సోమ‌వారం పార్ల‌మెంట్ లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో వ్య‌వసాయం రంగం గురించి ప్ర‌స్తావిస్తూ నూత‌న వ్య‌వ‌సాయం చ‌ట్టం ప్రకారం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతూ ఉంటుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. అలాగే వెయ్యి మండీల‌ను ఈ-నామ్‌కు అనుసంధానం చేయ‌నున్న‌ట్టు ఆమె తెలిపారు. దేశంలో ఐదు వ్య‌వ‌సాయ హ‌బ్‌ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. 2022లో వ్య‌వ‌సాయ రుణాల ల‌క్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు అని తెలిపారు. 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించామ‌ని, త‌ద్వారా1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందార‌ని తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హాయంలోని 2013-14 సంవ‌త్స‌రంలో గోధుమ రైతుల‌కు ప్ర‌భుత్వం చెల్లించిన మొత్తం 33,874కోట్లు, ప‌ప్పు దినుసు పండించే రైతుల‌కు 236కోట్లు, వ‌రి పండించే రైతుల‌కు 63,928 కోట్లు చెల్లించింది. అదే 2019-20 సంవ‌త్స‌రంలో గోధుమ రైతుల‌కు రూ. 62,802కోట్లు, ప‌ప్పు దినుసు రైతుల‌కు 8,285కోట్లు, వరి పండించే రైతులకు 1,41,930 కోట్లు ఇప్ప‌టి ప్ర‌భుత్వం చెల్లించింది. ప్ర‌స్తుత 2020-21 సంవ‌త్స‌రంలో కూడా ప‌ప్పు దినుసు రైతులకు రూ. 10,530కోట్లు, గోధుమ రైతుల‌కు 75,060కోట్లు చెల్లించింది. వ‌రి రైతుల‌కు రూ. 172,752 కోట్లు చెల్లించింది. ఇది 2013-14లో అప్ప‌టి ప్ర‌భుత్వం చెల్లించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ‌.