Home News చంద్రుడి క‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశించిన చంద్ర‌యాన్ 3

చంద్రుడి క‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశించిన చంద్ర‌యాన్ 3

0
SHARE
చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్ -3 తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్ లూనార్ కక్ష్యలో చంద్రుడివైపు దూసుకెళ్లిన ఈ వ్యామనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్ 3’ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.
“ఆగస్టు 5, 2023న చంద్ర కక్ష్యలోని ప్ర‌వేశించిన  (LOI) సమయంలో చంద్ర‌యాన్ 3 చంద్రుడిని  వీక్షించింది.” అని చంద్ర‌యాన్ 3 మిషన్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేసింది.
బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్, (ISTRAC) నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ క్రమంలోనే మొదటి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 6న రాత్రి 11 గంటల సమయంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఇలా దశలవారీగా కక్ష్యను తగ్గిస్తూ వ్యొమనౌకను చంద్రుడికి మరింత చేరువ చేయనుంది. శనివారం చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత అద్భుతమైన చంద్ర ఉపరితల చిత్రాలను బంధించింది.

చంద్రయాన్ 3’ని జులై 14న ఎలిఎంటి-ఎండి రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం..  చంద్రుడి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్య లోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శనివారం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఇక క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ, ‘చంద్రయాన్ -3స‌ని చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి చేర్చనున్నారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. ల్యాండింగ్ తర్వాత, ఇది ఒక చాంద్రమాన రోజు పని చేస్తుంది. ఇది దాదాపు 14 భూమి రోజులు. చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం.

ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. చంద్రుడి మీద కాలు మోపుతుంది. అనంతరం రోవర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యి పరిశోధనలు చేయనుంది. ల్యాండింగ్ కోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది ఇస్రో. నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్ క్రాఫ్ట్ 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణం సాగించాల్సి ఉంది. ఇందులో భాగంగా అయిదు దశల్లో భూకక్ష్యను అధిగమించింది.
22 రోజుల వ్యవధిలో భూకక్ష్యను దాటుకుంది. ఇప్పటివరకు 2,60,369 కిలోమీటర్ల మేర ఈ రాకెట్ అంతరిక్ష ప్రయాణాన్ని సాగించింది. చంద్రుడిని చేరుకోవడానికి ఇంకో లక్షా 24 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించాల్సి ఉంది. ఈ నెల 23వ తేదీన సాయంత్రానికి చంద్రుడి ఉపరితలానికి సమీపిస్తుంది. ఆ సమయంలో క్రాష్ ల్యాండింగ్ కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.
చంద్రయాన్ 3 ఇప్పుడున్న వేగంతోనే ప్రయాణిస్తే.. క్రాష్ ల్యాండింగ్ తప్పదు. అందుకే- దాని వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. జాబిల్లి ఉపరితలం మీద సవ్యంగా దిగాలంటే.. చంద్రయాన్ 3 వేగాన్ని జీరో కిలోమీటర్లకు తీసుకుని రావాల్సి ఉంటుంది. అదే ఈ ప్రక్రియ మొత్తానికీ అత్యంత కీలక ఘట్టం. 2019లో ప్రయోగించిన చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది.

చంద్రుని ఉపరితలంపై తన అంతరిక్ష నౌకను నిలిపిన అమెరికా, చైనా, రష్యా తర్వాత భారతదేశం నాల్గవ దేశంగా అవతరించింది. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన, మృదువైన ల్యాండింగ్ కోసం దేశం సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 
చంద్రయాన్-3 ఆమోదిత వ్యయం రూ. 250 కోట్లు  లాంచ్ వెహికల్ ఖర్చు మినహా). చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. దీనిని మొదట 2021లో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే, కోవిడ్-19 మహమ్మారి మిషన్ పురోగతికి ఊహించని జాప్యాన్ని తీసుకువచ్చింది.

చంద్రయాన్-2 మిషన్ 2019లో చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత, చివరికి దాని ప్రధాన మిషన్ లక్ష్యాలను విఫలమైనట్లు భావించిన ఇస్రో చంద్రయాన్-3 పై పూర్తి జాగ్ర‌త్త‌లు వ‌హించి సంపూర్ణ విజ‌యం దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇస్రో చేపట్టే ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో యావత్ దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.