Home News క‌రోనా ప‌రిశోధ‌న‌కు చైనా అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

క‌రోనా ప‌రిశోధ‌న‌కు చైనా అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

0
SHARE

కోవిడ్ -19 మూలాన్ని పరిశోధించడానికి చైనాలోని వుహాన్ ప్రాంతాన్ని సందర్శించడానికి అంతర్జాతీయ నిపుణులకు చైనా ఇంకా అనుమతి ఇవ్వకపోవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూ.హెచ్.‌వో) నిరాశ వ్యక్తం చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఆన్‌లైన్ మీటింగ్ డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, క‌రోనాపై అంతర్జాతీయ శాస్త్రీయ బృందం సభ్యులు తమ ప్రయాణాన్ని ఇప్పటికే ప్రారంభించార‌ని, అయితే చైనా అధికారులు మాత్రం ప‌రిశోధ‌న‌కు అవసరమైన అనుమతులు ఇవ్వలేద‌ని తెలిపారు.
ఈ మిషన్ కు డబ్ల్యూహెచ్‌ఓ ప్రాధాన్యతనిస్తోంద‌ని, వీలైనంత త్వరగా మిషన్‌ను చేపట్టడానికి డ‌బ్ల్యూహెచ్‌వో ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల‌కు డబ్ల్యూహెచ్‌ఓ, చైనా ప్రభుత్వానికి సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని ఆయ‌న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ తెలిపారు. వైరస్ మూలాన్ని పరిశోధించడానికి WHO యొక్క నిపుణుల బృందానికి పూర్తి అనుమ‌తిని ఇస్తామని బీజింగ్ గతంలో హామీ ఇచ్చింది. కానీ ప్ర‌స్తుతం అనుమ‌తినివ్వ‌క‌పోవ‌డంతో డ‌బ్ల్యూహ‌చ్‌వో నిరాశ వ్య‌క్తం చేసింది.

2019 చైనాలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైన‌ప్పుడు అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు అనేక మంది ప్ర‌ముఖులు చేసిన విమ‌ర్శ‌ల‌ను చైనా ప్ర‌భుత్వం తొసిపుచ్చింది. ఈ వైర‌స్‌ను ట్రంప్ ఏకంగా చైనా వైర‌స్ ని ప్ర‌చారం చేశాడు. ఈ వైర‌స్‌కు చైనా ప్ర‌భుత్వ‌మే జ‌వాబుదారీగా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా ట్రంప్ అన్నారు. క‌‌రోనా నివార‌ణ‌కు నిపుణుల చేస్తున్న ప‌రిశోధ‌న‌ల‌కు చైనా అనుమ‌తినివ్వ‌కుండా మొండిగా వ్య‌వ‌హరిస్తూ, డబ్ల్యూహెచ్‌ఓ చేప‌ట్టిన మిష‌న్‌కు ఆటంకం కలిగిస్తున్నందుకు చైనా క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వంపై  అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Source : Organiser