Home News భారత్ లో వాటికన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తేవాలని చర్చ్ ప్రయత్నిస్తోంది : విశ్వ హిందూ పరిషత్

భారత్ లో వాటికన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తేవాలని చర్చ్ ప్రయత్నిస్తోంది : విశ్వ హిందూ పరిషత్

0
SHARE
Representative Image

ఇటీవల కాలంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం విమర్శలు, ఆరోపణల వెనుక ఈ ప్రభుత్వాలను మార్చి వాటికన్ కీలుబొమ్మ ప్రభుత్వాలను తేవాలన్నదే చర్చ్ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్వహిందూ పరిషత్ సందేహం వ్యక్తంచేసింది. డిల్లీ ఆర్చ్ బిషప్ తరువాత, ఇప్పుడు గోవా ఆర్చ్ బిషప్ కు కూడా దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడినట్లు ఆందోళన కలుగుతోందని, దీనినిబట్టి దేశంలో చర్చ్ వాటికన్ తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలుగుతోందని  విశ్వ హిందూ పరిషత్  సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్ర జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడే చర్చ్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇలాగే చర్చ్ లపై దాడులు జరిగిపోతున్నాయంటూ ప్రచారం చేశారు. కానీ వారి ప్రచారం తప్పని తెలినప్పుడు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనం వహించారు తప్ప క్షమాపణలు చెప్పలేదు. అటల్ జీ హయాంలో కూడా చర్చ్ ఇలా అన్ని మర్యాదల్ని అతిక్రమించింది. ఆనాటి ప్రభుత్వంపై చర్చ్ చేసిన ఆరోపణలు సభ్య సమాజంలో ప్రస్తావించడం కూడా కష్టమే. వాటిపై విచారణ జరపాల్సిందిగా అప్పుడు విహింప జాతీయ మైనారిటీ కమిషన్ ను కోరింది. ఆ ఆరోపణలన్నీ అసత్యమని కమిషన్ కూడా తేల్చింది.

హిందువులను అవమానించడమే  కాకుండా ప్రపంచంలో భారత్ ప్రతిష్టను వాటికన్ దెబ్బతీసే ప్రయత్నం చేసిందని డా. జైన్ అన్నారు. వాటికన్ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తూ ఇక్కడి చర్చ్ మొత్తం జాతినే అవమానాల పాలుచేస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, కాశ్మీర్ లో హిందువులను అమానుషంగా చంపినప్పుడు, 1984లో సిక్కులను ఊచకోతకు గురిచేసినప్పుడు, చక్మా బౌద్ధులను తరిమివేసినప్పుడు ఈ చర్చ్ ఎందుకు మాట్లాడలేకపోయింది? అప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడినట్లు అనిపించలేదా? అని జైన్ ప్రశ్నించారు.

ఇదంతా ఈ దేశంలో చర్చ్ వాటికన్ వ్యూహానికి తగినట్లుగా వ్యవహరిస్తోందని, అవార్డులు వెనక్కు తిప్పి ఇచ్చిన `మేధావుల’ బృందం లాగానే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇప్పుడు డిల్లీ, గోవా ఆర్చ్ బిషప్ లే కాదు మిజోరాం, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్ మొదలైన ఎన్నికల్లో కూడా తమకు ఇష్టమైన పార్టీనే అధికారంలోకి తేవాలని చర్చ్ ప్రచారం చేసిందని, ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని డా. జైన్ అన్నారు. ఇదంతా సెక్యులరిజమేనా? అని ఆయన ప్రశ్నించారు. ప్రార్ధనలు చేసుకునేందుకు, పూజలు చేసుకునేందుకు ఏ మతస్తులకైనా రాజ్యాంగం అవకాశం, స్వేచ్ఛ కలిగిస్తుందికానీ చట్టవ్యతిరేక పద్దతిలో మతమర్పిడులు చేయడానికి కాదని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే హిందూ దేవిదేవతలను దూషించడం, విగ్రహాలను ద్వంసం చేయడంకాదు. స్వామి లక్ష్మణానంద సరస్వతి, శాంతి కాళి మాతాజీని హత్యచేయడం ఏ రాజ్యాంగ హక్కులను నిలబెట్టడంకోసం? ఈ దేశంలో ఇక్కడి రాజ్యాంగం ద్వారానే పరిపాలన సాగుతుంది తప్ప మధ్యయుగాల నాటి, అరాచక వాటికన్ రాజ్యాంగం ప్రకారం కాదని చర్చ్ గ్రహించాలి. చర్చ్ అనుసరిస్తున్న ఈ రాజకీయ వ్యూహం, మతమార్పిడుల వల్లనే రాజ్యాంగం ప్రమాదంలో పడుతోందని ప్రజలు గ్రహిస్తున్నారు. తమ ఈ ప్రమాదకర వ్యూహాన్ని అనుసరించే 1947లో గోవా ఆర్చ్ బిషప్  దేశస్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించారు. అలాగే ఇదే గోవా చర్చ్ 1961లో కూడా గోవా విముక్తి పోరాటాన్ని కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే క్రైస్తవులు పోర్చుగీసు వారి పాలనలోనే సుఖంగా ఉన్నారని వాదించింది.

ఇప్పటికైనా చర్చ్ ఆత్మపరిశీలన చేసుకుని, క్షమాపనలు కోరాలి. దేశ రాజ్యాంగాన్ని గౌరవించి, అనుసరించాలి. వాటికన్ పిడికిలి నుండి తమను తాము విముక్తం చేసుకోవాలి అని విహింప కోరుతోంది.

– పత్రిక ప్రకటన విడులచేసినవారు

వినోద్ బన్సల్, విహింప జాతీయ అధికార ప్రతినిధి