Home News చర్చి జరిపిన సాంస్కృతిక దాడికి వాటికన్ పోప్ క్షమాపణ చెప్పాల్సిందే – మెక్సికో డిమాండ్

చర్చి జరిపిన సాంస్కృతిక దాడికి వాటికన్ పోప్ క్షమాపణ చెప్పాల్సిందే – మెక్సికో డిమాండ్

0
SHARE

సుమారు ఐదు వందల ఏళ్ల క్రితం చర్చి అధికారులు మెక్సికోలోని వివిధ తెగలకు చెందిన ప్రజలపై సాగించిన దురాగతాల తాలూకు సెగలు ఇప్పటినీ వాటికన్ పాప్ ని వెంటాడుతున్నాయి. స్పెయిన్ దేశంతో కలిసి రోమన్ క్యాథలిక్ చర్చి జరిపిన దురాగతాలకు ఇరువురూ క్షమాపణ చెప్పాల్సిందే అని తాజాగా మెక్సికో ప్రభుత్వం డిమాండ్ చేసింది. స్పెయిన్ రాజు 6వ ఫెలిప్ మరియు వాటికన్ అధిపతి పోప్ ఫ్రాన్సిస్ లకు లేఖ రాసింది.

స్పెయిన్ దురాక్రమణ (Spain Conquest)గా వ్యవహరించే ఈ దురాగతానికి 1492లో క్రిష్టఫర్ కొలంబస్ బీజం పడింది. మొట్టమొదట కరీబియన్ దీవులు చేరుకున్న కొలంబస్ సైన్యం అక్కడి నుండి తమ దురాక్రమణ పర్వాన్ని కొనసాగించింది. ఈక్రమంలో మూడు శతాబ్దాల పాటు స్పెయిన్ దక్షిణ అమెరికాలోని సగ భాగం, మధ్య అమెరికాలోని అనేక ప్రాంతాలతో పాటు నేటి మెక్సికోని కలుపుకుని ఫ్లోరిడా, నైరుతి మరియు పసిఫిక్ తీరప్రాంతాలతో సహా ఉత్తర అమెరికా ప్రాంతాన్ని ఆక్రమించింది.

ఈక్రమంలో జరిపిన మారణహోమంలో అనేక తెగలు నాశనం కావడంతో పాటు అనేక జాతులు సాంస్కృతిక దాడులకు గురైనాయి.

తాజాగా ఈ ఉదంతంపై తమ దేశానికి స్పెయిన్ మరియు దురాక్రమణకు నేతృత్వం వహించిన వాటికన్ తరఫున పోప్ క్షమాపణ చెప్పాలంటూ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ ఓబ్రాడోర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Source: DailyMail