Home News ఆర్.ఎస్.ఎస్ – పీఎఫ్ఐ మధ్య పోలిక అసంబద్ధం, అన్యాయం

ఆర్.ఎస్.ఎస్ – పీఎఫ్ఐ మధ్య పోలిక అసంబద్ధం, అన్యాయం

0
SHARE

ఒక మంచి మాట ఆర్. ఎస్. ఎస్ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) ల మధ్య పొలికే లేదు, అలా పోల్చటం అసంబద్ధం, అసమంజసం, తగని పని.      – అరుణ్‌ ఆనంద్‌

ఇటువంటి పోలిక చేసిన జాతీయవాద వ్యతిరేకశక్తులు కొంతమంది, కొన్ని సంస్థలు వాస్తవంగా ఉన్న సమస్యలకు విరుద్ధంగా తారుమారు చేసి, కనుమరుగయ్యేందుకు కావాలని కొన్ని కథనాలను సృష్టించి, ప్రచారం చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే, ఎంతో తెలివైనవ్యక్తులు కూడా, సరైన  సమాచారం తెలియక లేదా తెలుసుకోకుండా, ఇటువంటి జాతీయవాద వ్యతిరేకత అనే ఉచ్చులో పడి, చిక్కుకుంటూ ఉంటారు.

కొన్ని పోలికలు నిరర్థకంగా, అసమంజసంగా ఉంటాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  పి.ఎఫ్.ఐ. ల మధ్య పోలిక సరిగ్గా ఇటువంటి కోవకి చెందినదే. అయితే ఇటువంటి నకారాత్మక ప్రచారం వలన అది నిజమని నమ్మి, ప్రభావితులయ్యే దేశప్రజలకు మనం వాస్తవాలను తెలియజేసి, వారిని అసత్యప్రచారాలనుండి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

1925లో స్థాపించబడిన ఆర్.ఎస్.ఎస్. ప్రపంచమంతటిలో “వసుధైవ కుటుంబకం” (విశ్వమంతా ఏకైక కుటుంబం) అనే ప్రాచీన వేదవాక్యమే ఆధారంగా, సమతావాదంతో, సామాజిక, సాంస్కృతిక వేదికగా పనిచేసే ఒక ప్రముఖమైన, అతిపెద్దదైన స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ స్వయంసేవకులు సమాజసంక్షేమం కొరకు, జాతినిర్మాణంలో కొన్ని దశాబ్దాలనుండి నిరంతరం  కృషి చేస్తున్నారు. వాళ్ళు సమాజంలోని వివిధవర్గాలమధ్య వారధిగా పని చేస్తూ, అటువంటి వారందరినీ  సమాజసంక్షేమం, దేశరక్షణ గురించి పాటుచేసేటట్లు ప్రేరణ చేసి, ఐక్యంగా నిలబెట్టి, తీర్చిదిద్దటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కోరలనుండి భారతీయ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వాళ్ళు, సత్యాగ్రహం వంటి అనేక పోరాటాలు చేశారు. ఇంకా, ఎప్పుడు సమాజానికి భారీ విపత్తులు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఆపదల్లో ఇరుక్కుని సహాయం కోసం విలవిల్లాడినా, ఆపన్నహస్తం అందించేందుకు వాళ్ళు ముందుంటారు. ఇటీవల సంభవించిన కోవిడ్-19 మహమ్మారి విజ్బుంభించిన సమయంలో వేలాది ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు సమాజసేవ కోసం ముందుండి వివిధ సహాయ, సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇంకొకవైపు గనక మనం పరిశీలిస్తే, కొద్దిమంది అతివాదముస్లింలచే స్థాపించబడిన పి.ఎఫ్.ఐ. అనే సంశయాత్మకసంస్థ, ఇస్లామిక్ కార్యకలాపాలు మాత్రమే శాశ్వతలక్ష్యంగా పనిచేస్తున్నది. అనేక దర్యాప్తుసంస్థలు, వివిధరాష్ట్రాలలో పోలీసులు, వీళ్ళ కార్యకలాపాలను పసిగట్టి, ఎండగడుతున్నారు.

పి.ఎఫ్.ఐ. మూలమే తన వాస్తవరూపాలను, రంగులను మరుగుపరుస్తున్నది. 1992లో అయోధ్యలోని  వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత, కేరళలో నేషనల్ డెమోక్రెటిక్ ఫ్రంట్ (NDF-ఎన్.డి.ఎఫ్.) అనే ఒక సంస్థ, ముస్లింల సామాజిక, ఆర్థిక సంస్కరణల కార్యం కొరకు, అని బయటకు చెప్పే ఒక ముసుగుతో స్థాపించబడింది. కానీ, ఎప్పుడైతే 2003లో కేరళలో కోజికోడ్ లోని, మరాడ్ బీచ్ లో 8 మంది హిందువుల హత్యలు, అప్పటి అల్లర్లలో పి.ఎఫ్.ఐ. సభ్యులకు ప్రమేయం ఉందని వాళ్ళని అరెస్టు చేసినప్పుడు మాత్రమే, వాళ్ళ తీవ్రవాద, హింసాత్మకధోరణి బహిర్గతమైనది, దేశమంతటికీ తెలిసింది. (Radicalisation in India, Abhinav Pandya, Pentagon Books, pp 62)

రాజకీయ ఇస్లాంను విశ్వసించే కొన్ని ప్రభుత్వేతర సంస్థల కూటమిగా పి.ఎఫ్.ఐ.గా ఏర్పడేందుకు ఏకమయ్యాయి, అనేది వింటే ఆశ్చర్యమేమీ కలుగదు. పి.ఎఫ్.ఐ. అధికారిక వెబ్-సైట్ ప్రకారం, వాళ్ళు 23 రాష్ట్రాలలో కార్యకలాపాలు నడుపుతున్నారు.

పాంద్యా గారి మాటల్లో చెప్పాలంటే – “మొదట్లో ఎన్.డి.ఎఫ్. కార్యకలాపాలు కేరళ వరకే పరిమితమయ్యాయి. తర్వాత, అటువంటి భావజాలం ఉన్న, కర్ణాటక లోని ‘ఫోరం ఫర్ డిగ్నిటీ’ ఇంకా తమిళనాడు లో పనిచేసే ‘మణితా నీతి పాశరై’ అనే సంస్థలను తనలో విలీనం చేసుకొని పి.ఎఫ్.ఐ. గా ఆవిర్భవించింది. తర్వాతి మూడేళ్లలో ‘గోవా సిటిజెన్స్ ఫోరం’, రాజస్థాన్ లోని ‘కమ్యూనిటీ ఫర్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ’, పశ్చిమ బెంగాల్ లోని ‘నాగరిక్ సురక్షా సమితి’, మణిపూర్ లోని ‘లీలాంగ్ సోషల్ ఫోరం’ మరియు ఆంధ్ర లోని  ‘అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్’ వంటి కొన్ని సంస్థలు పి.ఎఫ్.ఐ. లో విలీనం అయ్యాయి. అయినప్పటికీ, పి.ఎఫ్.ఐ. కేరళలో మాత్రమే చాలా క్రియాశీలకంగా ఉన్నది. పి.ఎఫ్.ఐ. ఇతర విభాగాలు: 1. ‘ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్’ (ఇస్లాం మతపండితుల విభాగం) 2. కేరళ లోని మలప్పురంలో మతమార్పిడులే ధ్యేయంగా పనిచేసే, ‘సత్యసారిణి’ అనే పేరు మీద ఉన్న  ఒక విద్యారంగ, ధార్మిక సంస్థ.

ఇక్కడ, ఇంకొక ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే, పి.ఎఫ్.ఐ. గతంలో నిషేధింపబడిన ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా’ (SIMI – సిమి) తో గట్టి సంబంధాలు కలిగి ఉన్నది. పాంద్యా గారు ఇంకా ఏమన్నారంటే, పి.ఎఫ్.ఐ. లో పదవుల్లో ఉన్న చాలామంది, 2001లో నిషేధింపబడిన సిమితో బలమైన సంబంధాలు కలిగి ఉన్నవాళ్లే.

పి.ఎఫ్.ఐ. కార్యపద్దతి

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటి(JNU) లో అధ్యయనపండితులైన సౌమ్యా అవస్థి, 2020లో పి.ఎఫ్.ఐ.పై ఒక పరిశోధనాపత్రం “Popular Front of India: Understanding the Propaganda and Agenda, లో వీళ్ళ కార్యనిర్వహణాపద్ధతి గురించి చాలా వివరంగా తెలియజేశారు.  అందులో వారు ఏమి చెప్పారంటే – పి.ఎఫ్.ఐ. ముస్లింల సాధికారతే లక్ష్యంగా అస్థిత్వం ఏర్పరచుకొన్నప్పటికీ, వాళ్ళు తమ ఇస్లాం కార్యక్రమపట్టిక (ఎజెండా)ను ఒక వైపు ప్రదర్శనగా చూపించేవాళ్లు. దానిని కప్పిపుచ్చేందుకు వాళ్ళు మహిళలు, కూలీలు, రైతులు, దళితులు, ఆదివాసీలు అనే వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పైకి చూపించేవాళ్లు. ఇది చూసేవాళ్ళకు, పి.ఎఫ్.ఐ. ఒక అల్పసంఖ్యాకుల, బలహీనవర్గాల సంక్షేమం కోసం పనిచేసే ఒక  ధార్మికసంస్థ అనే ఒక రక్షణ కవచం ఏర్పరచుకొన్నారు. దీనితో, ‘ఈ సంస్థను నిషేధించవలసిన అవసరం ఏముంది?’ అని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ఒక కుట్రపూరితమైన యోచన వాళ్ళు అమలు చేస్తున్నారు.

అవస్థి ఇంకా ఏమంటున్నారంటే – “భారతదేశాన్ని ప్రజాస్వామ్యవ్యవస్థ నుండి రూపుమాపి, ఇస్లామిక్ మతరాజ్యంగా భర్తీ చేయటమే పి.ఎఫ్.ఐ. వాళ్ళ అంతిమ లక్ష్యం. ఈ పాపులర్ ఫ్రంట్ వాళ్ళు భారతదేశం మొత్తాన్ని శత్రువుగా (కాఫిర్ లు) భావిస్తూ, భారత్ లో పూర్తి ముస్లిం సాధికారతయే లక్ష్యంగా తీవ్రంగా పనిచేస్తోంది. పి.ఎఫ్.ఐ. కొన్ని ప్రాజెక్టులు నడిపిస్తోంది, అవేమిటంటే – ‘స్కూల్ చలో’, ‘సర్వ శిక్షా గ్రామ్’, ‘ఒక ముస్లిం విద్యార్థిని దత్తత తీసుకోవటం’ – ఇలా ముస్లిం పిల్లలకు మాధ్యమిక స్థాయి వరకూ విద్యను ప్రోత్సహించటం. ఈ ప్రచారాలు, ఉద్యమాలు వాళ్ళకు బహిరంగంగా పనిచేసేందుకు చట్టబద్ధతను కల్పిస్తాయి. కానీ, లోపల లోపల, వాస్తవంగా వాళ్ళ మతప్రచారం చేసుకొనే వీలు, రక్షణ ఉంటాయి. పి.ఎఫ్.ఐ. సభ్యులు భారత్ ను ఒక ప్రజాస్వామ్యదేశంగా భావిస్తారు. కానీ, వాస్తమైన వాళ్ళ మతసిద్ధాంతం ఏమంటే, మెల్లగా కొన్ని రాజకీయ, సామాజిక కారణాల, వర్గాల వలన, ఈ ఇస్లాం విషసర్పాలు మన మెడలకు చుట్టుకుంటున్నాయి. పి.ఎఫ్.ఐ. సభ్యులు నిరంతరం వాళ్ళ హక్కులకు భంగం వాటిల్లిందని పెద్దగా గోలచేస్తూ, ప్రతిక్రియ ఒక్కటే వాళ్ళకు మిగిలిన ఏకైక మార్గం, అని వాళ్ళు తమ పవిత్రగ్రంథంలో చెప్పారని జీహాద్ ప్రకటించి, దానిని అమలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడకుండా, తమ తీవ్రవాద చర్యలను సమర్థించుకుంటారు.”

అవస్థి ఇంకా ఇలా అంటున్నారు – “జమాత్-ఎ-ఇస్లామీ ని స్థాపించిన సయ్యద్ అబూ అలా మౌదుడీ, అల్లామా ఇక్బాల్ అనబడే మహమ్మద్ ఇక్బాల్ (‘సారా జహాన్ సే అచ్ఛా హిందూస్తాన్ హమారా’ పాత వ్రాసి, తరవాత పాకిస్తాన్ ను అభిమానించాడు), ఒసామా బిన్ లాడెన్ వంటి ఇస్లాం మతమౌధ్యుల రచనల ప్రభావం ఈ పి.ఎఫ్.ఐ. సభ్యుల మీద బాగా ఉన్నది. వీళ్ళు తమ సంస్థ ఒక ధార్మికసంస్థ అనే ముసుగులో, మతమార్పిదులను కొనసాగిస్తూ, తమ ఉగ్రవాదచర్యల ద్వారా ఇక్కడి ప్రజలలో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తూ, భారత్ ను ఇస్లాంమతరాజ్యంగా మార్చటమే, తమ అంతిమ లక్ష్యంగా, విద్రోహ కార్యకలాపాలు  చేస్తున్నారు.”

అవస్థి గారి మాటల్లో ఇంకా – “నిషేధింపబడిన సిమి అనే ఉగ్రవాద సంస్థ సభ్యులే, చాలా వేగంగా తిరిగి సమూహాలుగా ఏర్పడి, పి.ఎఫ్.ఐ. అనే పేరుతో ముందుకు వస్తున్నారు. ఈ సంస్థ మొదటగా దక్షిణ భారతదేశంలో నియామకాలు చేపట్టి,  అక్కడి నుండి ఉత్తరభారత్ లో తన విషపు కోరలను వ్యాపింపజేస్తున్నది.  తక్రీర్ అనబడే జకీర్ నాయక్ ద్వేషపూరిత ఉపన్యాసాల ద్వారా వీళ్ళు ప్రభావితులౌతున్నారని వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే, పి.ఎఫ్.ఐ. ఇలా సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) అనే తన రాజకీయ పార్టీ విభాగం ద్వారా విషపు కోరలు చాస్తున్నది అని తెలిసింది, ఆశ్చర్యంగా, జకీర్ నాయక్ చేత నడపబడుతున్న ఇస్లాం రీసెర్చ్ ఫౌండేషన్ (IRF) ను ప్రభుత్వం నిషేధించిన కొద్ది రోజుల్లోనే, పి.ఎఫ్.ఐ. అతనికి మద్దతుగా దేశమంతటా వివిధ ప్రదేశాలలో భారీ ర్యాలీలు నిర్వహించింది. గూఢచార వర్గాల సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థల సభ్యుల మధ్య, ప్రత్యేకంగా ఐ.ఆర్.ఎఫ్.ను నిషేధించిన తర్వాత, పరస్పర అభిప్రాయమార్పిడి నిత్యం పెరుగుతూ ఉన్నదని, ఎలక్ట్రానిక్ ఋజువులు లభిస్తున్నాయి.

పి.ఎఫ్.ఐ. దేశవ్యతిరేక కార్యకలాపాలలో పాత్ర సరిగ్గా అంచనా వేయాలంటే, 01.06.2022న, కేంద్రప్రభుత్వ అమలు సంచాలక కార్యాలయం (Directorate of Enforcement (ED)) విడుదల చేసిన ఒక ప్రకటనలో, పి.ఎఫ్.ఐ. మరియు వాళ్ళ సోదర సంస్థలలో దర్యాప్తులో భాగంగా, పి.ఎఫ్.ఐ. కి సంబంధించిన రూ.59,12,051/- బాలన్స్ గల 23 బ్యాంకుఖాతాలను, ఇంకా పి.ఎఫ్.ఐ. ముఖసంస్థ రెహాబ్ ఇండియా ఫౌండేషన్ (Rehab India Foundation (RIF)) రూ.9,50,030/- బాలన్స్ ఉన్న 10 బ్యాంకుఖాతాలను, ప్రస్తుతం ఉన్న మనీ లాండరింగ్ చట్టం ప్రకారం జప్తు చేశామని తెలియజేశారు.

ఇంకా, ED దర్యాప్తులో పి.ఎఫ్.ఐ, ఆర్.ఐ.ఎఫ్. సంస్థలు, కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల, మూలాల నుండి భారీ మొత్తాలలో నగదు స్వీకరించారని వెల్లడించారు. పే.ఎఫ్.ఐ. ఖాతాలలో మొత్తం రూ. 60 కోట్ల కంటే ఎక్కువగా భారీ మొత్తం డిపాజిట్ చేశారు, అందులో రూ.30 కోట్లు దాటిన మొత్తాన్ని 2009 లోనే డిపాజిట్ చేశారు. అలాగే, ఆర్.ఐ.ఎఫ్. ఖాతాలలో 2010 నుండి సుమారు రూ.58 కోట్ల భారీ మొత్తం జమ చేశారని వెల్లడించారు.

ఇంకా, ED దర్యాప్తులో మనీ లాండరింగ్ చట్టం, 2002, సెక్షన్ 3 ప్రకారం, పి.ఎఫ్.ఐ.  తనకు అనుబంధంగా ఉన్న కొంతమంది నింద మోపబడిన వ్యక్తుల ప్రమేయంతో, క్రియాశీలక కుట్ర ద్వారా, మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనకు భారీగా పాల్పడినట్లు నిర్ధారించారు.

ED దర్యాపులో ఇంకా – పి.ఎఫ్.ఐ. గల్ఫ్ దేశాలనుండి రహస్యంగా నిధుల సేకరణ చేసి, చాలా ప్రణాళికాబద్ధంగా, నేరపూరిత కుట్ర ద్వారా, ఈ నిధులు అజ్ఞాతవ్యక్తులు, వక్రమార్గాల ద్వారా, భారతదేశానికి గుట్టుచప్పుడు కాకుండా, రహస్యంగా వాళ్ళ సభ్యులు, ఉద్యోగులు, వాళ్ళ బంధువులు, సానుభూతిపరుల బ్యాంకు ఖాతాలకు చేరేటట్లు విదేశీ చెల్లింపులు (foreign remittances) చేసి, ఆ తర్వాత అక్కడినుండి ఆయా నిధులు పి.ఎఫ్.ఐ., ఆర్.ఐ.ఎఫ్. ఇంకా ఇతర సంబంధిత వ్యక్తుల/సంస్థల ఖాతాలకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ‌డి ఇంకా తన ప్రకటలలో “ఈ విధంగా చట్టవిరుద్ధంగా, నేరపూరితంగా చేసిన, సేకరించిన నిధులు, వసూళ్లు పి.ఎఫ్.ఐ. మరియు ఆర్.ఐ.ఎఫ్. బ్యాంకు ఖాతాలలో మచ్చలేనట్లు పైకి చూపించి, నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా పి.ఎఫ్.ఐ. దాని సంబంధిత సంస్థలు, వ్యక్తులు చేస్తున్న ఒక భారీ ఎత్తున జరిగే నేరపూరితమైన కుట్ర, దేశద్రోహచర్య. దేశ, విదేశాల నుండి వాళ్ళు ఈ విధంగా చేసిన వసూళ్ళు, సేకరించిన నిధులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ, దేశవిద్రోహాలకు పాల్పడుతున్నారు. దీని ఫలితంగా, వాళ్ళకు, వాళ్ళ ఉద్యోగులు, సానుభూతిపరులకు వ్యతిరేకంగా అసంఖ్యాకమైన నేరారోపణ ఫిర్యాదులు, ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు అవుతున్నాయి.”

మనం పి.ఎఫ్.ఐ. గురించి ఇప్పటివరకూ చర్చించినదంతా, అతిపెద్ద మంచుకొండపై అతిచిన్న ముక్క మాత్రమే. ఇదే కాకుండా, పి.ఎఫ్.ఐ. పేరు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA) ఇంకా చాలా రాష్ట్రాలలో పోలీసుశాఖలలో నిర్వహించే నేరసంబంధిత దర్యాప్తులలో వినబడుతున్నది. పి.ఎఫ్.ఐ.పై దేశవ్యాప్తనిషేధం విధించాలనే చాలామంది ఎప్పటినుండో నిరంతరంగా కోరుతున్నారు, పి.ఎఫ్.ఐ. గురించిన పాతచిట్టా (గత చరిత్ర) ప్రకారం, దానిపై నిషేధం ఎంతమాత్రమూ అకారణం, అసంబద్ధం కాదు.

ఈ సందర్భంగా ముగింపు ఏమంటే, ఎవరైనా జాతీయవాద సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్.తో సంశయాత్మక సంస్థ అయిన పి.ఎఫ్.ఐ.ను పోల్చటం ఎంత మాత్రమూ సమంజసం కాదు. ఒకవేళ అలా పోలిస్తే, గత 97 సంవత్సరాలుగా ఆర్.ఎస్.ఎస్. మన జాతికి, దేశానికి, సమాజానికి చేసిన, చేస్తున్న స్వార్థరహితమైన సేవకు మనమందరం అన్యాయం చేసినట్లే.

Source : Firstpost 

అనువాదం: సత్యనారాయణమూర్తి