ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ అనేక అసత్య కథనాలు వండివార్చిన పలు విదేశీ వార్తా సంస్థలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ముస్లిములను రెచ్చగొట్టే విధంగా, హిందువులను దోషులుగా చిత్రీకరిస్తూ, పోలీసుల స్ఫూర్తిని దెబ్బతీస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను మసకబార్చే విధంగా పలు విదేశీ మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న అసత్య కధనాలపై పలు సంస్థలు ఫిర్యాదులు నమోదు చేశాయి. ఆయా వార్తా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలిందిగా ప్రభుత్వాన్ని కోరాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ సంస్థపై ఫిర్యాదు:
ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను కొందరు సిఏఏ వ్యతిరేక ఆందోళనకారులు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ హత్య జరిగిన మరుసటి రోజునే అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తా సంస్థ, ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అసత్యపు కధనాన్ని ప్రచురించింది. “తాము అంకిత్ శర్మ సోదరుడిని ఇంటర్వ్యూ చేశామని, అంకిత్ శర్మను హత్య చేసినవారు ఘటన సమయంలో “జై శ్రీరామ్” నినాదాలు చేశారని” అతడి సోదరుడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ కధనం సాగింది.
దీనిపై స్వరాజ్య వంటి పలు వార్తా సంస్థలు ఆరా తీయగా.. తాను అసలు ఏ వార్తా సంస్థకూ ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న విషయాన్ని అంకిత్ శర్మ సోదరుడు స్పష్టం చేశాడు. అంతేకాకుండా తాను చెప్పినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కధనం పూర్తి అసత్యమని తెలియజేశాడు. దీనికి స్పందించిన ముంబైకి చెంసిన లీగల్ రైట్స్ అబ్సర్వేటరీ సంస్థ.. వాల్ స్ట్రీట్ జర్నల్ సంస్థను నిషేధించడంతో పాటు, ఆ వార్తా సంస్థ చీఫ్ ఎడిటర్ ని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అల్-జజీరాపై ఫిర్యాదు:
వార్తా ప్రసారాల సమయంలో భారత పటాన్ని కాశ్మీర్ లేకుండా టెలివిజన్లలో ప్రసారం చేసిన అల్-జజీరా ఛానెల్ పై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ.. ఒడిశాకు చెందిన కళింగా రైట్స్ ఫోరమ్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
బీబీసీ సంస్థకు పోలీసులకు ఫిర్యాదు:
ఢిల్లీ అల్లర్ల సమయంలో విధులు నిర్వహిస్తూ రతన్ లాల్ అనే పోలీస్ కానిస్టేబుల్ ప్రాణత్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు అతడిని హత్యచేశారు. అయితే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వార్తా సంస్థ మరో అసత్య కధనాన్ని ప్రసారం చేసింది. పోలీసులు, హిందూ ఆందోళనకారులు కలిసి శాంతిపూర్వకంగా నిరసన ప్రదర్శన చేస్తున్న ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నారనేది దాని సారాంశం.
దీనిపై హైదరాబాద్ కు చెందిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసుల స్ఫూర్తిని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా, అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మసకబార్చే కుట్రతో అసత్య, కల్పిత కధనాలు ప్రసారం చేస్తున్న బీబీసీ వార్తాసంస్థపై కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా తమ ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదు ఢిల్లీ పోలీస్ విభాగం స్పెషల్ కమిషనర్ దర్యాప్తులో ఉంది.
For local updates, download Samachara Bharati
For Multi-lingual News App – download Ritam