Home Telugu Articles దేశానికి తీవ్ర నష్టం కలిగించే కాంగ్రెస్ ఎన్నికల హామీపత్రం

దేశానికి తీవ్ర నష్టం కలిగించే కాంగ్రెస్ ఎన్నికల హామీపత్రం

0
SHARE
2004-2014 మధ్య కాలంలో విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ సమర్పణ సమయంలో చేసిన అనేక పెద్దపెద్ద వాగ్దానాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అప్పుడనిపించింది `అవతలివారు చేసే వాగ్దాలను పట్టించుకోకూడదు. వివరాల్లోకి వెళితే అసలు సంగతి బయటపడుతుంది’ అని. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన ప్రణాళిక పత్రాన్ని కొన్ని పేజీలు చదవగానే నా భయాలన్నీ నిజమయ్యాయి.

టుక్దే టుక్దే ఎన్నికల హామీపత్రం
పేజీ 35లోని 30వ అంశంలో చట్టాలు, నియమ నిబంధనలను సమీక్షిస్తామని కాంగ్రెస్ వారు వాగ్దానం చేశారు. దేశ ద్రోహ కుట్రను నిర్వచించి, అందుకు శిక్షను నిర్ధారించే భారత శిక్షా స్మృతి లోని 124ఎ పరిచ్ఛేదాన్ని పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదులైన, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికైనా `బెయిల్ తప్పనిసరి, జైలు శిక్ష తప్పనిపరిస్థితిలో’ అనే పద్దతి అమలు చేస్తామని చెప్పారు. అలాగే భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA)కూడా సావరిస్తామన్నారు. దేశాన్ని విభజించడం తప్ప తమకు మరొకటి అంగీకారం కాదనే విధంగా వ్యవహరించిన వేర్పాటువాదులతో నిరంతర చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. అలాగే కాశ్మీర్ లోయలో భద్రతా దళాల సంఖ్య తగ్గిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వల్లనే జమ్మూకాశ్మీర్ సమస్య పుట్టింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి, రాజ్యాంగ వ్యతిరేకంగా 35ఎ అధికారణను తెచ్చింది. 1957 నుంచి 1988 వరకు అన్ని అసెంబ్లీ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడింది. ఈ చర్యల మూలంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాలంటే విశ్వాసం పోయింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ చేసిన హామీలు వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు సంతోషాన్ని కలిగించేవిధంగా ఉన్నాయి. లోయ నుంచి `కాశ్మీర్ పండిత్’ల తరిమివేత, వారి కష్టాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విచిత్రం.

ఉగ్రవాదుల పట్ల కాంగ్రెస్ ఎప్పుడూ మెతకవైఖరి అవలంబిస్తూనే ఉంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ టాడా చట్టాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే దానిని తొలగించింది. అలాగే పోటా చట్టాన్ని కూడా బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు వేర్పాటువాదులు, ఉగ్రవాదులపై మరింత మెతకగా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

భారత దేశానికి మావోయిస్ట్ లు అతిపెద్ద ముప్పు అంటూ డా. మన్మోహన్ సింగ్ ప్రకటించినా వారిపట్ల ప్రభుత్వం ఎప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఎన్నికల్లో, జె ఎన్ యు కేసు, అర్బన్ నక్సల్స్ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ వారి పట్ల సానుభూతితోనే మెలిగింది.

`న్యాయ్’ మోసం
ఇప్పటికే చాలామంది ఆర్ధికవేత్తలు కాంగ్రెస్ ప్రకటించిన `న్యాయ్’ పధకాన్ని కొట్టిపారేశారు. కేంద్ర, రాష్ట్రాలు కలిపి ఇప్పటికే పేదలకు న్యాయ్ లో హామీ ఇచ్చిన దానికంటే 20 శాతం ఎక్కువ లబ్ది చేకూరుతోంది. ఆర్ధిక వ్యవస్థ మరింత బలోపేతమై పేదరికం తగ్గితే, అప్పుడు ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఇప్పుడున్న పధకాలకు అదనంగా న్యాయ్ ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రతినిధి ప్రకటించారు. ఎన్నికల పత్రంలోని పేజీ 9లోని 19-20వరకు ఉన్న అంశాలు పరిశీలిస్తే ఆర్ధిక విచక్షణను పాటిస్తామని, పధకాన్ని పరిశీలన, పరీక్ష తరువాత దశలవారిగా ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావడం వల్ల వచ్చే అదనపు నిధులను ఈ పధకం కోసం మళ్ళిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

మొదట ప్రకటించినట్లుగా కాకుండా న్యాయ్ పధకం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పధకమని కాంగ్రెస్ తన ఎన్నికల పత్రంలో స్పష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ హామీ ఇస్తున్నాడానికంటే ఇప్పటికే అందిస్తున్న సబ్సిడీలు ఎక్కువని రాష్ట్రాలు అంటే అప్పుడు ఏమి చెపుతారు? ఇక సబ్సిడీల గురించి ప్రస్తావిస్తూ `సరైన సబ్సిడీల’ను మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీనినిబట్టి ఏ సబ్సిడీ సరైనది, అవసరమైనది, ఏది కాదు అన్నది కేంద్రం నిర్ణయిస్తుందన్నమాట.

వ్యవసాయ ఋణ మాఫీ
వ్యవసాయ ఋణ మాఫీ అమలు చేస్తామని కొత్తగా హామీ ఇవ్వకపోయిన వివిధ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని మాత్రం పేర్కొంది. కానీ కర్ణాటక, పంజాబ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లను చూస్తే అక్కడ హామీ ఇచ్చిన ఋణ మాఫిని అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని తెలుస్తుంది. అంతేకాదు ఎన్డీయే ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ యోజనను కూడా ఈ రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు.

ప్రజా ఆరోగ్యం
ప్రజా ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడం చాలా అవసరం. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ విషయాన్ని గురించి ఏమి చెప్పకుండా కేవలం నినాదాలకే పరిమితమయింది. శ్రీ. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పధకం వల్ల 50కోట్లమంది ఉచితంగా వైద్య సేవలు పొందారు.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్
2010లో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా నేను కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపొందడానికి తగిన కృషి చేశాను. కానీ ఆ తరువాత నాలుగేళ్ళ పాటు లోక్ సభలో ఆ బిల్లును ఆమోదింపచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనుక ఇప్పుడు రిజర్వేషన్ బిల్లు తెస్తామని అంటే నమ్మడం ఎలా?

జి ఎస్ టి
అధికారంలోకి వస్తే ఒకే జి ఎస్ టి రేటు అమలు చేస్తుందని మరోసారి ప్రకటించింది. ప్రస్తుతం చాలామటుకు ఆహార పదార్ధాలపై పన్ను అసలు లేదు. సామాన్య ప్రజానీక ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5శాతం పన్ను మాత్రమే ఉంది. ఇక 28శాతం పన్ను శ్లాబ్ దాదాపుగా తొలగించాం. రాబోయేకాలంలో 12శాతం, 18శాతాలను కలిపి మధ్యస్థంగా ఒక రేటు నిర్ధారిస్తాం. అప్పుడు సున్నా, 5, 15 శాతం పన్ను శ్లాబ్ లు మిగులుతాయి. అయితే వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేవస్తువులు, ఎక్కువగా వాడని వస్తువులన్నింటికి ఒకే రేటు విధిస్తామని కాంగ్రెస్ అంటోంది. అంటే టీవి, ఎయిర్ కండిషనర్, వాషింగ్ మిషన్ లకు ఆహార పదార్ధాలు, చెప్పులు, ముతక బట్టలకు ఒకే పన్ను విధిస్తారన్నమాట. ఈ ఒకే పన్ను రేటును రాహుల్ గాంధీ సింగపూర్ ను చూసి నేర్చుకున్నారు. కానీ తేడా ఏమిటంటే అక్కడ పేదరికం లేదు. అందుకనే మెర్సిడెజ్ బెంజ్ కారుకు, బియ్యనికి కూడా అక్కడ 7శాతం పన్నే ఉంటుంది.

జాతీయ భద్రత గురించిన ఎలాంటి అవగాహన లేకుండానే అనేక హామీలు గుప్పించారు. ఏదిఏమైనా ఇలాంటి అసంబద్ధమైన, గందరగోళ హామీలను నెరవేర్చాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఎలాగూ రాదు. ఎందుకంటే వాళ్ళ పరాజయం ఖాయం కనుక.

– అరుణ్ జైట్లీ

Source: Organsier