Home News దేవాలయాలను నేలకూల్చి, విగ్రహాలు దొంగలించిన చర్చి పాస్టర్లు

దేవాలయాలను నేలకూల్చి, విగ్రహాలు దొంగలించిన చర్చి పాస్టర్లు

0
SHARE
ఓ  చర్చి నిర్వహిస్తున్న పాస్టర్లు సమీపంలో ఉన్న దేవాలయాలను కూల్చివేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న పురాతన గ్రామ దేవతగా కొలువుతీరివున్న వారిచిట్టి అమ్మవారికి చెందిన రెండు దేవాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. స్థానిక చర్చికి చెందిన వ్యక్తులు మార్చి 28వ తేదీ అర్ధరాత్రి డీసీబీ సహాయంతో కూల్చివేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసేసారు. అంతేకాకుండా దేవాలయంలోని దేవతా విగ్రహాలను కూడా దొంగిలించుకుని వెళ్లిపోయారు.
ఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మొదట పోలీసులు రాజీ కోసం ప్రయత్నించినట్టు తెలిసింది. ఐతే తూర్పుగోదావరి జిల్లా శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ సభ్యులు చేపట్టిన ఆదోళన కారణంగా చర్చి పాస్టర్లు నడిపల్లి ప్రభుదాస్ అలియాస్ సుబ్బారావు, దూడ తాతారావు, ఎరుపల్లి సత్తిబాబులపై ఐపీసీ సెక్షన్ 295, 379, 427, 447, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసులో కీలక నిందితుడు అయిన పాస్టర్ ప్రభుదాస్, తాను ధ్వంసం చేసిన దేవాలయాల పక్కనే ఐదేళ్ల క్రితం ‘క్రీస్తు సంఘం’ పేరిట ఒక చర్చి నిర్మించి మతపరమైన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అదే సమయంలో పక్కనే దేవాలయాలు ఉండటంతో అతడిలో అసహనం అధికమైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రభుదాస్ నిర్మించిన చర్చి గురించి ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో వాకబు చేయగా ఆ చర్చికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేవని తేలింది. అనుమతి లేని చర్చి నిర్మాణంపై చర్య తీసుకోవాల్సిందిగా ఫోరమ్ స్థానిక రెవెన్యూ అధికారులకు చేసిన ఫిర్యాదులో కోరింది.