కర్ణాటక: రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను తీవ్రవాదితో పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారానికి తెరపడింది. ఇటీవల మంగుళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేల్చివేత కుట్రలో ఆదిత్యారావ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అయితే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదిత్యారావును పోలిఉన్న ఆరెస్సెస్ కార్యకర్త ఫోటోలను సోషల్ మీడియా నుండి సేకరించి, విమానాశ్రయం పేల్చివేత కుట్రలో ఆరెస్సెస్ కార్యకర్త పాత్ర ఉందంటూ ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం మొదలుపెట్టారు. దీంతో వారు పోస్ట్ చేసిన నకిలీ ఫోటోలు అన్ని వాట్సాప్ గ్రూపులకు చేరింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సత్య పరిశోధన’ ద్వారా ఇది అబద్దంగా తేలింది.
మరి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫోటోలు ఎవరివి?
సయ్యద్ అబ్దాహు కషాఫ్, అజీజ్ బికనీర్ అనే ఇద్దరు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మంగుళూరు విమానాశ్రయం పేలుడు కేసు నిందితుడు ఆదిత్యారావు ఆరెస్సెస్ గణవేశ్ (యూనిఫామ్) ధరించినట్టు, బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ఎంపీ తేజస్వి సూర్యతో అతడు కలిసి ఉన్నట్టుగా పేర్కొంటూ కొన్ని ఫోటోలు తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఐతే నిజానికి అవి కర్ణాటకకు చెందిన ఆరెస్సెస్ కార్యకర్త సందీప్ లొంబో అనే యువకుడివి. ఆదిత్యారావ్, సందీప్ లొంబోల ముఖకవళికల్లోని సారూప్యతను ఆసరాగా చేసుకున్న సయ్యద్ అబ్దాహు కషాఫ్, అజీజ్ బికనీర్ లు, సందీప్ లొంబో ఫేస్బుక్ అకౌంట్ నుండి అతడి ఫోటులు సేకరించి, వాటిని నిందితుడు ఆదిత్యారావుగా ప్రచారం చేయసాగారు.
ఈ ఘటనపై సందీప్ లొంబో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేశారు. తన ఫోటోలు తస్కరించి, తనను అపఖ్యాతిపాలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరారు.