తమిళనాడు: క్రైస్తవ మతంలోకి మారాలని ఓ విద్యార్థినిని నిత్యం పాఠశాలలో చిత్రహింసలకు గురిచేయడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అరియలూరు జిల్లా వడుగపాళయం గ్రామానికి చెందినది ఎం.లావణ్య(17) తిరుకట్టుపల్లి సేక్రెడ్ హార్ట్ హైస్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది.
క్రిస్టియన్ సంస్థ అయిన ఆ పాఠశాల లావణ్యను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేసింది. లావణ్య తను క్రైస్తవ మతంలోకి మారడానికి నిరాకరించింది.. దీంతో పండగ సెలవులకు పాఠశాల యాజమాన్యం ఆ బాలికను ఇంటికి పంపలేదు. బదులుగా ఆమెను పాఠశాలలోనే ఉంచి, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం, వంట చేయడం వంటి పనులను చేస్తూ బాలికను తీవ్ర ఇబ్బందులుకు గురి చేసింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లావణ్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఈ నెల 9న జరిగింది. ఆమెకు మొదట వాంతులు కావడంతో సమీపంలోని క్లినిక్‌కి తీసుకెళ్లారు. హాస్టల్ వార్డెన్ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. ఇంటికి తిరిగి వచ్చినా లావణ్య పురుగుమందు తాగినట్లు చెప్పలేదు.
తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి అప్పటికే దాదాపు 85% ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. చివరకు ఆ బాలిక నిన్న(బుధవారం)ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మాట్లాడిన వీడియో ట్విట్టర్‌లో పోస్టు చేయబడింది. “నా పేర్లు లావణ్య. పాఠశాల యాజమాన్యం నన్ను క్రైస్తవ మతంలోకి మారాలని, తదుపరి చదువులకు సహాయం చేయిస్తామని నా సమక్షంలోనే నా తల్లిదండ్రులను అడిగారు. నేను అంగీకరించకపోవడంతో, వారు నన్ను తిడుతూనే ఉన్నారు” అని ఆమె వీడియోలో పేర్కొంది. తనను హింసించిన వ్యక్తి పేరు కూడా చెప్పింది.
బాలికకు న్యాయం చేయాలంటూ హిందూ సంఘాలు నిరసనలు కార్యక్రమాలు చెపట్టాయి. పోలీసులు హాస్టల్ వార్డెన్ మారిని అరెస్టు చేశారు.
10th std school topper, A Hindu girl committed suicide & takes her own life unable to bear the torture of 𝗙𝗼𝗿𝗰𝗲𝗱 𝗖𝗼𝗻𝘃𝗲𝗿𝘀𝗶𝗼𝗻 by her own school Management.
CM @mkstalin avl, Y don't u reconcile the family?? We know, u will not do that.@ShefVaidya @KapilMishra_IND pic.twitter.com/f4WESGoYob— Amar Prasad Reddy (@amarprasadreddy) January 20, 2022
Source : VSK BHARATH