ఇవాల్టి పోలింగ్ సమయంలో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిపై దాడి జరిగిందన్న కధానాల్లో నిజానిజాలు –
ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డి కల్వకుర్తి ఆమంగల్ మండలంలోని జంగారెడ్డిపల్లిలో ఒక పోలింగ్ బూత్ లో వోటర్లను బెదిరించారు. ఈ ప్రాంతంలో బిజెపి అభ్యర్ధి ఆచారి తల్లోజుకు మంచి పట్టు ఉంది. కనుక బిజిపి అవకాశాలను దెబ్బతీయడానికి ఇక్కడ అలజడి సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ పధకం వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉదయం ఇక్కడకి వచ్చిన వంశీ చంద్ రెడ్డి వోటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లో నిలబడి ఉన్న ఒక మహిళతో వాగ్వాదానికి దిగడామెకాక, ఆమెపై చేయి చేసుకున్నాడు. మరొక మహిళను కూడా గట్టిగా తోసివేయడంతో ఆమె కిందపడిపోయి కాలు విరిగింది. ఆమెతో పాటు ఉన్న ఆమె భర్త కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చంద్ రెడ్డిని అడ్డుకోవాలని ప్రయత్నించాడు. షెడ్యూల్ జాతికి చెందిన ఆ మహిళను కాంగ్రెస్ అభ్యర్ధి నుంచి కాపాడటానికి ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులతోపాటు ఆమె వర్గానికి చెందినవారు కూడా అక్కడకు రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇంతలోనే అక్కడకి చేరుకున్న పోలీసులు వంశీ చంద్ రెడ్డిని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. అయితే రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ సోషియల్ మీడియా బృందం వంశీ చంద్ రెడ్డి పైనే దాడి జరిగిందంటూ ప్రచారం ప్రారంభించింది. కానీ వీడియోలోను, ప్రత్యక్ష సాక్షి కధనం ప్రకారం అది నిజం కాదని, కాంగ్రెస్ అభ్యర్ధే దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది.
వంశీ చంద్ రెడ్డి తమ ఆడవారిపై ఎలా దాడిచేశాడో గిరిజనులు వివరించారు –
https://www.facebook.com/VSKTelangana/videos/972394649626138
పోలింగ్ బూత్ లో ఉన్న ప్రజల ప్రతిస్పందన, వంశీ చంద్ రెడ్డిని పోలీసులు అక్కడ నుండి తరలించిన వీడియో –
https://www.facebook.com/VSKTelangana/videos/283541698965000