Home Videos VIDEO: Goa Liberation Day – ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల కీలక పాత్ర

VIDEO: Goa Liberation Day – ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల కీలక పాత్ర

0
SHARE

మనం ఎప్పుడూ బ్రిటీష్ పాలన నుంచి భారత్ ఎలా విముక్తి పొందిందనే విషయాన్నే చర్చిస్తుంటాం. కానీ పోర్చుగీసు, ఫ్రెంచ్ పాలన నుండి గోవా తదితర ప్రాంతాలు అలా విముక్తమయ్యాయనే సంగతి పెద్దగా పట్టించుకోము. నిజానికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 ఏళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. 1961, డిసెంబర్ 19న గోవా విదేశీపాలన నుండి బయటపడింది. గోవా విముక్తి పోరాటంలో ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని స్వయంగా స్వతంత్ర్య యోధుడు మోహన్ రానడే తన `సర్ఫరోషీ కీ తమన్నా’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.