Home News హజ్‌ సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు

హజ్‌ సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు

0
SHARE
  • తొలగించిన సబ్సిడీ ముస్లింలకే ఖర్చు
  •  బయలుదేరే ప్రాంతాలు తొమ్మిదే
  •  సౌదీని సంప్రదించనున్న కేంద్రం
  •  తొమ్మిదిచోట్ల హజ్‌హౌ్‌సల నిర్మాణం
  •  అఫ్జల్‌ కమిటీ సిఫారసులు

హజ్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేయాలని దీనిపై ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 45 ఏళ్లు పైబడిన మహిళలు పురుషుడు లేకుండా కనీసం నలుగురు చొప్పున గ్రూపులుగా వెళ్లేందుకు అనుమతించాలని సూచించింది. అఫ్జల్‌ అమానుల్లా నేతృత్వంలోని కమిటీ 2018-22 కాలానికి హజ్‌ పాలసీకి సంబంధించిన కీలకసిఫారసులు చేసింది. ఈ ముసాయిదా నివేదికను మైనారిటీ వ్యవహారాల మంత్రి ము ఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీకి కమిటీ అందజేసింది.

  •  కొత్త పాలసీకి అనుగుణంగా వచ్చే ఏడాది హజ్‌ ప్రయాణం
  •  సౌదీ అరేబియా వెళ్లేందుకు ఇప్పటిదాకా ప్రయాణికులు విమానాలు ఎక్కేందుకు ఉన్న 21 ప్రాంతాలు 9కి కుదింపు.
  •  హైదరాబాద్‌, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌, కోల్‌కతా, లఖనవూ, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చిన్‌ల నుంచి మాత్రమే యా త్రికులు వెళ్లే అవకాశం.
  •  ఈ తొమ్మిది చోట్ల హజ్‌హౌ్‌సలను నిర్మించి వాటి పరిధిలోకి వచ్చే రాష్ట్రాలను అనుసంధానం చేస్తారు.
  •  భక్తుల భద్రతకు మరిన్ని చర్యలు
  •  45 ఏళ్ల లోపు వయసు మహిళలు తమ తండ్రి/సోదరుడు/కుమారుడిని వెంటపెట్టుకుని వెళ్లొచ్చు.
  •  ఎత్తివేసిన సబ్సిడీ మొత్తాన్ని ముస్లింల విద్యాభివృద్ధికి, వారి సంక్షేమానికి వినియోగం
  •  విమానాలకన్నా తక్కువ ఖర్చయ్యే నౌకల ద్వారా ఇకనుంచి ప్రయాణ ఏర్పాట్లు
  •  నౌకల ద్వారా హజ్‌ ప్రయాణంపై సౌదీ సర్కారును సంప్రదించనున్న కేంద్రం.
  •  నౌకా ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకునే యాత్రికులు బయలుదేరే ప్రాంతాలు తగ్గింపు

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)