Home News హిందువులకు అభ్యంతరకరమైన పాఠ్యాంశాలను తొలగిస్తామని అంగీకరించిన కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ

హిందువులకు అభ్యంతరకరమైన పాఠ్యాంశాలను తొలగిస్తామని అంగీకరించిన కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ

0
SHARE

గ్రేడ్ కే-6, గ్రేడ్ 6-8 స్కూల్  పాఠ్య పుస్తకాలలో హిందువులు, భారత దేశం గురించి ముద్రించిన అవాస్తవాలను కొట్టివేయడానికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది.  అదే విదంగా అమెరికన్ హిందూ సమాజం ఎత్తిచూపిన అన్ని తప్పులను సవరించడానికి సైతం సంసిద్ధత వ్యక్తపరచింది. హాటన్ మిఫ్ఫ్లిన్ హర్కోర్ట్ పబ్లిషేర్స్ ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించింది.

అమెరికన్ హిందూ సమాజం కలసికట్టుగా ఒక దశాబ్ద కాలం పైగా సాగించిన పోరాటంలో ఇది కీలక విజయంగా భావిస్తున్నారు. ఈ పోరాటం కాలిఫోర్నియా పాఠ్య పుస్తకాలలో భారత దేశం, హిందూత్వం  గురించిన దోషాలను చూపి వాస్తవికతను, సాంస్కృతిక దృష్టిని తెలియచేయడానికి చేసిన ప్రయత్నమని హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పేర్కొంది.

హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థ కు చెందిన శాంతారాం నెక్కర్ మాట్లాడుతూ “ఇది నిజంగా చరిత్రాత్మకమైనది. చాల సంవత్సరాలుగా పౌర సమాజంతో నిరంతరం నిర్ణయాత్మకంగా చర్చలు జరపడం ద్వారా  హిందూ అమెరికన్ సమాజం తమ వాదనను అందరి ముందు వినిపించగలిగింది.” అని అన్నారు. హిందూ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ భారతదేశ నాగరకత పట్ల అమెరికాలో వాస్తవిక దృష్టిని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్న సంస్థ.

చాలా పుస్తకాల్లో కొంత సానుకూల మార్పు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల అవాస్తవాలు గూడు కట్టుకొని ఉన్నాయి అని అన్నారు. భారత దేశం, హిందూత్వం పట్ల పక్షపాత ధో రణి, ఏక పక్షంగా ఉన్న అవాస్తవాల పట్ల  తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

కొన్ని వేల సంఖ్యలోని హిందూ అమెరికన్ తల్లితండ్రులు, విద్యార్థులు, స్థానికులే కాకుండా ఫిజి, కరేబియన్ దేశాలలో వారు, 75 వివిధ మత సంస్థలు, 17 రాష్ట్రాలలోని ఎన్నుకోబడిన అధికారులు, 38 విద్యావేత్తలు నుండి వచ్చిన లేఖలు, సాక్ష్యాలను పరిశీలించిన తరువాత పాఠ్య పుస్తకాలను సవరించాలని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ స్టేట్ బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది.

ఈ విజయానికి దేశంలోని వివిధ హోదాలలో ఉన్న అధికారులు, సోషల్ మీడియా మెసేజ్ ల రూపంలో అభినందనలు తెలుపుతూ  చేసిన ప్రయత్నాన్ని సమర్దిస్తున్నారు.

సౌత్ ఆసియన్ హిస్టరీస్(SAHFA) అనే సంస్థ హిందూ వ్యతిరేకతను కలిగించే విధంగా చేసిన విషపూరిత వ్యాఖ్యానాలను, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  ఆఖరి క్షణంలో చేసిన బెదిరింపులను సైతం లెక్క చేయకుండా బోర్డు తమ తీర్పును ఇచ్చింది.

హిందూ అమెరికన్ ఫౌండేషన్ లోని సీనియర్ డైరెక్టర్ అయిన సమీర్ కల్ర మాట్లాడుతూ “ తమ సంస్థలో దళితులతో సహా అన్ని వర్గాలు, కులాలకు చెందిన వారు ఉన్నారని, చరిత్రలో జరిగిన వాస్తవాలను  దాచకుండా కుల మతాలకు అతీతంగా వాస్తవికతతో కూడిన అంశాలు పాఠ్య పుస్తకాలలో ఉండాలని భావిస్తున్నామని, SAHFA లాంటి హిందూ వ్యతిరేక సంస్థలు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడం జరిగిందన్నారు. హిందూ వ్యతిరేక SAHFA సంస్థ సూచించిన మార్పులు కాలిఫోర్నియా న్యాయ సూత్రాలను అతిక్రమించేవిగా, పాఠ్య పుస్తకాలను రూపొందించే నియమ నిబందనలకు విరుద్ధంగా ఉన్నాయి “ అని అన్నారు.